S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

06/08/2019 - 20:52

గత రెండు నెలల్లో థియేటర్లకు వచ్చిన ఒక్క సినిమానూ గొప్ప చిత్రంగా చెప్పుకోడానికి లేదు. చిన్న చిత్రాలకు సరైన స్లాట్ దొరికినా -ఆడియన్స్‌ని రంజిప చేయగలిగే సనిమా ఒక్కటీ రాలేదు. నువ్వుతోపురా.. గీతా ఛలో.. అభినేత్రి-2.. ఏబీసీడీ.. ఎవ్వడూ తక్కువ కాదు.. సీత.. ఇలా వచ్చిన సినిమాల్లో ఇది బావుందని చెప్పడానికి ఒక్కటీ లేకపోవడం బాధాకరం.

06/01/2019 - 22:27

వెనె్నల ఫ్లాష్‌బ్యాక్ అట్ 50లో ప్రచురించిన ‘ఇల్లరికం’ చిత్రం విశేషాలు చాలా బాగున్నాయి. ఇందులో అందరినీ అలరించే వాటిల్లో రేలంగి చెప్పిన అల్లుడి కథ. అందులో ఆయనా, రమణారెడ్డి ప్రదర్శించిన నటన ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి. ఇందులో కొన్ని మనోహరమైన సన్నివేశాలు చాలా నిండుగా చిత్రీకరించారు. హాస్య సన్నివేశాలు అన్నీ హుషారుగా నడిచి నటీనటుల ప్రతిభ తెలుస్తుంది.

05/25/2019 - 20:33

హిట్టా ఫట్టా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే మహేష్ మహర్షిలోని కొన్ని సన్నివేశాలు ఫీల్‌ను అందించాయ. క్లాస్‌మేట్స్ అల్లరి నరేష్, పూజాహెగ్డేలతో మహేష్ చేసిన అల్లరి చూస్తే కాలేజిలో ఉన్నామా? అన్న భావన కలిగింది.

05/18/2019 - 21:49

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా గతవారం విడుదలైన మహర్షి చిత్రం మామూలుగానే ఉందితప్ప, బయట ప్రచారం జరుగుతున్నంత గొప్ప చిత్రమేమీ కాదు. ‘వీకెండ్ వ్యవసాయం’ అంటూ ఓ కానె్సప్ట్‌ను సినిమాలో డిస్కస్ చేయడం గొప్ప సమాజోద్దరణగా కనిపించొచ్చేమోగానీ ప్రాక్టికల్‌గా సాధ్యంకాదు. రైతు ప్రాధాన్యతకు గుర్తింపునిచ్చే చిత్రంగా చెప్పుకున్నా -కమర్షియాలిటీ తప్ప కమిట్‌మెంట్ చిత్రమని చెప్పలేం.

05/11/2019 - 20:44

టైటానిక్‌ని అవెంజర్సే ముంచేశారంటూ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ఎంతో ప్రేమ, సినిమాపట్ల ఆప్యాయత కనిపిస్తుంది. మార్వెల్ సంస్థ నిర్మించిన ‘ఎండ్‌గేమ్’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల దుమారం రేపడంపై ఆయన చేసిన కామెంట్ అద్భుతం. ఓ సినిమా గొప్పతనాన్ని ప్రొఫెషనల్‌గా ప్రశంసించడమంటే ఇదే. అవతార్, టైటానిక్ సినిమా రికార్డులను దాటేసిన ఎండ్‌గేమ్ సక్సెస్‌ను ఆయన చాలా గొప్పగా చెప్పాడు.

05/04/2019 - 19:47

కొత్త ఏడాది ఆరంభం నుంచీ కుంటుకుంటూ నడుస్తున్న తెలుగు సినిమాకు -ఏప్రిల్ నెలలో పూనకం వచ్చినట్టే కనిపిస్తోంది. గత మూడు నెలల్లో చెప్పుకోడానికి ఎఫ్-2 తప్ప ఒక్క సినిమా కూడా లేదు. కానీ, ఏప్రిల్‌లో మాత్రం మూడు సినిమాలు గొప్ప విజయాలు సాధించి పరిశ్రమకు కొత్త ఊపునిచ్చాయి.

04/27/2019 - 20:49

ఆర్భాటంగా నిర్మించిన బయోపిక్ కథానాయకుడు ఫ్లాప్ అయితే మహానాయకుడు డిజాస్టర్‌గా మిగిలింది. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ విమర్శకుల మెప్పు పొందినా కాసులు రాలలేదు. ఘంటసాల బయోపిక్ నిర్మాణం పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. తక్కువ బడ్జెట్‌తో తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయింది. ఆంధ్రలో విడుదల అయ్యాక కొద్దిపాటి లాభాలు రావచ్చేమో. గొప్ప హిట్ మాత్రం కాదు.

04/20/2019 - 20:40

వరుసగా ఆరు ఫ్లాపులు చూసిన హీరో సాయితేజ్. అందుకే కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కథలపై ఫోకస్ పెడుతున్నాడు. గతవారం వచ్చిన చిత్రలహరి కథతో నిజానికి మెగా అన్న ఇమేజ్ వదిలి ప్రయోగమే చేశాడని చెప్పాలి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రచారం చేసుకునేంత గొప్ప హిట్టని అనలేంకానీ, సాయతేజ్ నీరసాన్ని తగ్గించే వూపునిస్తుందని మాత్రం చెప్పొచ్చు.

04/13/2019 - 20:39

ప్రేమ విఫలమై దూరమైన అమ్మాయ, అబ్బాయ కొత్త జీవితం మొదలుపెట్టిన తరువాత మళ్లీ ఆ జీవితంలోకి రావడం..లాంటి ఇతివృత్తాలతో తెలుగులో చాలా కథలే వచ్చినప్పటికీ, అలాంటి కథతో మజిలీ చిత్రాన్ని నడిపించిన విధానం చాలా బావుంది. చాలాకాలం తరువాత ఓ మంచి తెలుగు సినిమా చూశామన్న భావన కలిగింది. దర్శకుడు శివ నిర్వాణ కథను నడిపించిన తీరు, ఆయా పాత్రల్లో ముఖ్య పాత్రలు ఒదిగిన విధానం మనసుకు హత్తుకుంది.

04/07/2019 - 22:52

అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ‘బాహుబలి’ సృష్టికర్త రాజవౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎంతవరకు సబబు? తెలుగు జాతికి స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తిని రగిల్చి, మన్యాన్ని ఉద్యమకేంద్రంగా మార్చి బ్రిటిష్ వారిపై పోరాడిన మన్యంవీరుడు ‘అల్లూరి సీతారామరాజు’. గిరిజనుల స్వాతంత్య్రంకోసం పోరాడి వారిని బానిస దాస్య శృంఖలాలనుండి కాపాడిన తెలంగాణాయోధుడు ‘కొమరంభీమ్’.

Pages