S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

03/30/2019 - 20:53

ఆదివారం వచ్చిందంటే చాలు ఆంధ్రభూమి ముందుగా చూడాల్సిందే. ‘సరయుశేఖర్’గారి ఫీచర్, ఫ్లాష్‌బ్యాక్ ఎట్ 50, మీవ్యూస్, కొత్త సినిమాల రివ్యూస్, ఇంకా ‘నాకునచ్చిన చిత్రం’, ‘పాట’, ‘ఇమంది’గారి జ్ఞాపకాలు ఇలా ఏవైనాసరే అన్నీ మాకు నచ్చేవే! ఇలాంటి శీర్షికలు మరిన్ని పెంచి వెనె్నలకు మరింత చల్లదనాన్ని ఆపాదిస్తారని ఆశిస్తున్నాం.

03/23/2019 - 20:20

ఏడాది ఆరంభంలో పండుగ సీజన్. వచ్చేది వేసవి సీజన్. ఈ సీజన్లను పెద్ద చిత్రాలు ఆక్రమించటంతో -్ఫబ్రవరి, మార్చి నెలల్లో చిన్న సినిమాలు థియేటర్ల వద్ద వరుస పెడుతున్నాయి. అయితే, వీటిలో ఏ ఒక్క చిత్రమూ ప్రేక్షకుల సినిమా ఆకలిని సంతృప్తిపర్చలేకపోయింది. మార్చి నెలనే తీసుకుంటూ కల్యాణ్‌రామ్ 118 ఏదో ఫరవాలేదు అనిపిస్తే, బొట్టు, మ్యాగ్నెట్, వేరీజ్ వెంకటలక్ష్మి, బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్..

03/16/2019 - 20:15

తీసినవి తక్కువే అయినా, చెక్కు చెదరని సినిమాలు తీశాడు రాజీవ్ మీనన్. ఆ విషయాన్ని ‘సర్వం తాళమయం’తో మరోసారి రుజువు చేశాడు. పదిహేడేళ్ల గ్యాప్ తరువాత మెగాఫోన్ పట్టుకున్నా, సన్నివేశాన్ని నడిపించటంలోని సున్నితత్వం ఏమాత్రం దెబ్బతినకుండా ‘సౌవర్ణ శోభిత సంగీతం.. వర్ణ వైషమ్యాలకు అతీతం’ అన్న పాయింట్‌ను అద్భుతమైన కథగా చెప్పటం అతని ప్రతిభకు తార్కాణం.

03/09/2019 - 23:28

అదే పెద్ద తప్పు

03/02/2019 - 20:31

గత వెనె్నల సంచికలో ‘కొత్తదనమే ఇష్టం’ అంటూ ప్రచురించిన కల్యాణ్‌రామ్ ఇంటర్వ్యూ బావుంది. అందరు హీరోలు చెప్పినట్టుకాకుండా -కల్యాణ్ నిజాయితీగానే చెప్పాడనిపిస్తుంది. అతని కెరీర్‌లో ఎన్నో సినిమాలు ఫ్లాపులైనా -ప్రతి సినిమాలోనూ ఏదోక కొత్తదనం చెప్పడానికి, చూపించడానికీ తాపత్రయపడతున్నట్టు ఆడియన్స్‌కి అర్థమవుతూనే ఉంది.

02/23/2019 - 20:52

‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమా గురించి లీడ్‌రోల్ చేసిన సోనమ్‌కఫూర్ మాట్లాడుతూ ‘రెజీనా కూల్ గాళ్, మంచి నటి. వీటన్నిటికి మించి రెజీనా దగ్గర ఎప్పుడూ ఓ పరిమళం ఉంటుంది. అందుకే రెజీనాతో రొమాన్స్ బాగుంటుంది. నేను హ్యాపీ’ అంటూ కామెంట్ చేయడం చాలా బావుంది. ఆ కామెంట్‌లో సోనమ్ మెచ్యూరిటీ కనిపిస్తోంది.

02/16/2019 - 20:39

నిన్నగాక మొన్నవచ్చి నటనలో ఇంకా ఓనమాలు కూడా పూర్తిచేయని రకుల్ -మీడియా ముందు ఇచ్చే స్టేట్‌మెంట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. ఈమధ్య ఓ మీడియాతో మాట్లాడుతూ ‘ఏ భాషలోనైనా నటన ఒకటే కదా!’ అనేసింది. అనుభవ రాహిత్యంతో కూడిన పెద్ద మాట ఇది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువ సంభాషణలతో నటన చూపించాల్సి ఉంటుంది. కానీ హిందీ, మలయాళం చిత్రాల్లో చిన్న చిన్న డైలాగులతో అండర్‌ప్లే చూపించాల్సి ఉంటుంది.

02/09/2019 - 20:43

పెళ్లి తరువాత కెరీర్‌కు సంబంధించి సమంత తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెను మరింత ఎత్తులకు తీసుకెళ్తున్నాయ. కథలు, పాత్రల ఎంపిక విషయంలో ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలను అభినందించకుండా ఉండలేం. -విభిన్నమైన కథాంశాలు, విలక్షణ పాత్రల కోసం నిర్మాతలు, దర్శకులు ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్నారంటే అతిశయోక్తి కాదు.

02/02/2019 - 20:02

స్టార్ హీరో హీరోయిన్లు చెప్పే మాటలు ఒక్కోసారి ఫకాలున నవ్వు పుట్టిస్తుంటాయి. తాము నిజమని నమ్ముతారో లేక ఏంచెప్పినా జనం నమ్ముతారన్న నమ్మకమో తెలీదుగానీ, అబద్ధాలు మాత్రం అప్పటికప్పుడు చెప్పేస్తున్నట్టే అనిపిస్తుంటుంది. ‘కథ నచ్చితే చేయడమే నాకు తెలుసు. బోయపాటి చెప్పారు. నచ్చింది, చేశాను’ అంది హీరోయిన్ కైరా అద్వానీ. ‘ఈ కథమీద నాలుగేళ్లు కసరత్తు చేసి అన్నివిధాలా సంతృప్తి కలిగాకే సెట్స్ మీదకెళ్లాం.

01/26/2019 - 22:32

గతంలో దక్షిణాది హీరోయిన్లు కొందరు పెళ్లయిన ‘పెద్దమనుషుల్ని’ ప్రేమించి రెండో భార్యగా సెటిలయ్యేవారు. అలా పెళ్లి చేసుకున్న తరువాతే -సావిత్రి జీవితం ఎంత ఘోరమైపోయిందో మహానటిలో చూశాం. శ్రీదేవి కూడా మిధున్ చక్రవర్తిని ప్రేమించి ‘ భార్యకు విడాకులిస్తే పెళ్లి చేసుకుందాం’ అన్న ప్రపోజల్ పెట్టిందట. అతడు వెనక్కి తగ్గగానే బోనీకఫూర్‌ని చేసుకుందన్న కథనాలు చదువుకున్నాం. చివరకు ఆమె మరణం మిస్టరీగా మారింది.

Pages