S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

11/10/2018 - 20:24

‘అరవింద సమేత...’లో రాయలసీమను అవమానించే సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించి క్షమాపణ చెప్పాలంటూ విద్యార్థి పోరాట సమితి ధ్వజమెత్తింది. రాయలసీమ ఫ్యాక్షనిజంపై అరవింద మొదటి చిత్రం కాదు, చివరి చిత్రం కూడా కాబోదు. అలాగే తెలుగు పలుకుబడిలో యాసలు ప్రాంతాన్నిబట్టి మారుతాయి. వాటిని ఉపయోగించి హాస్య సన్నివేశాలు చిత్రిస్తే, ఆ ప్రాంత ప్రజల్ని అవమానించినట్టు కాదు.

11/03/2018 - 20:30

హక్కులు, రాయతీలు కోరుకుంటున్నంత నిక్కచ్చిగా చిన్న సినిమా దర్శక, నిర్మాతలూ బాధ్యతలు తీసుకుంటే బావుంటుంది. చిన్న సినిమాలను రక్షించండి అంటూ అప్పుడప్పుడూ గగ్గోలు వినిపిస్తూనే ఉంది. కానీ, ఎన్ని చిన్ని సినిమాలు ప్రేక్షకులను మైమరిపింప చేస్తున్నాయన్న లెక్కలు తీస్తే -లెక్కించడానికేమీ ఉండవు. వచ్చే సినిమాల్లో ఒకటీ అరా ఔరా! అనిపించడం తప్ప చాలా సినిమాలు ఏమాత్రం సినిమా ప్రామాణికత లేకుండానే వస్తున్నాయ.

10/27/2018 - 19:57

రామ్ సినిమాలు వరుసగా తనే్నస్తుండటంతో -హిట్టు కోసం పట్లు పడుతున్నాడు. కాని, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్నానన్న ఆలోచనకు రాకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే గతవారం విడుదలైన హలో గురు ప్రేమకోసమే చిత్రానే్న తీసుకుంటే, దర్శకుడు తెలివైనవాడు కనుక మామా అల్లుళ్ల కథల్ని అటు తిప్పి, ఇటు తిప్పి మళ్లీ మళ్లీ చేసేస్తున్నాడు. కనీసం రామ్ అయనా ఆలోచించాలిగా.

10/20/2018 - 23:14

అజ్ఞాతవాసి అపజయం తరువాత విజయం కోసం త్రివిక్రం సర్వశక్తులొడ్డిన చిత్రం అరవింద సమేత. అనుభవం లేని ఫ్యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెట్టాడు. సినిమా అతుకుల బొంత. త్రివిక్రమ్ మార్క్ సహజత్వం నిల్. పైగా తెలుగు ప్రేక్షకులను హింసించి కసి తీర్చుకున్న పగా ప్రతీకారాల జానర్. అతి హీరోయిజంతో ఇప్పటికే విసుగెత్తిన ప్రేక్షకుడిని తట్టిలేపి వెగటు పుట్టించిన చిత్రమిది. తమన్ నేపథ్య సంగీతం ఒక్కటే రిలీఫ్.

10/13/2018 - 20:15

ఆహా ఓహో అంటూ విజయ్‌ను ఆకాశానికి ఎత్తారు. ఎన్నికల మూడ్ వచ్చేసింది కనుక నోటా ఇరగదీదీస్తుందన్నారు. ఏమైంది? నోటాకు మాట లేదు. అర్జున్ రెడ్డి ఇమేజ్ మొత్తం ఆకాశానికి ఎగిరిపోయంది. అందుకే అంటారు పెద్దలు -ఎక్కడికక్కడే ఉండాలి తప్ప ఎగిరెగిరి పడకూడదు అని. ఏమైతేనేం.. విజయ్‌కు విషయం తెలిసొచ్చి ఉంటుంది. కొత్త అనుభవం అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఇమేజ్ అనేది ఒక సినిమాతో వస్తే మరో సినిమాతో పోవచ్చు.

10/06/2018 - 20:36

గత వారం వెనె్నలలో ప్రచురితమైన ‘అప్పుడప్పుడు...’ వ్యాసం ఆలోచింపచేసేదిగా ఉంది. సినిమాపై ప్రేక్షకుడికి విరక్తిపుడుతున్న సమయంలో అప్పుడప్పుడు ఇలాంటి జీవిత చిత్రాలొచ్చి సినిమాపై మమకారాన్ని సజీవం చేస్తున్నాయన్న వ్యాసకర్త ఆలోచన బావుంది. సినిమా స్వర్ణయుగంలో అప్పుడప్పుడు చెత్త సినిమాలు వచ్చేవి. ఇప్పుడు అప్పుడప్పుడు మంచి సినిమాలొస్తున్నాయి. అంతే తేడా.

09/29/2018 - 19:53

వారం వారం కొత్త సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులను పూర్తిగా నిరాశకు గురిచేసి వెళ్తున్నాయి. అప్పుడప్పుడూ వచ్చే మెరుపులా ఏ ఒక్కటో ఆకట్టుకుంటుందే తప్ప, తెలుగు సినిమాలన్నీ రొటీన్ అన్న భావనే కలుగుతుంది. వాస్తవికాంశాల ఆధారంగా ఇతర భాషల్లో అనేక చిత్రాలు రూపుదిద్దుకుంటుంటే -తెలుగు దర్శకులు, నిర్మాతలు మాత్రం ‘మూస కథ’లు పట్టుకునే వేలాడటం బాధాకరం.

09/22/2018 - 20:12

చానల్ సినిమా కార్యక్రమాల్లో ఔచిత్యాన్ని మరిచి సంచలనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న సమంత- నాగచైతన్య మధ్య చిచ్చుపెట్టిన శైలజ.. సమంతపై ఆధిపత్యం చెలాయిస్తున్న చైతన్య అంటూ ఊదరగొట్టిన ఒక చానల్ చివరకు తుస్సుమనిపించింది. అసలు విషయం ఏమంటే చైతూ నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఆగస్టు చివరిన విడుదల కావలసి ఉంది. వాయిదాపడి సెప్టెంబర్ 13న వచ్చింది.

09/15/2018 - 19:59

కథ లేకున్నా కథనంతో ప్రేక్షకులను సీనిమాలో లీనంచేసిన ఘనత గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌కు దక్కుతుంది. ఇలాంటి సినిమాలు అడపాదడపా వస్తున్నాయి. హ్యాపీడేస్, కొత్తబంగారులోకం తదితర సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ సినిమాల క్రెడిట్ అంతా సినిమా దర్శకుడికే చెందుతుంది. కథలు లేవు అనే వర్ధమాన దర్శకులు ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది.

09/08/2018 - 20:41

కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వచ్చేముందు తనకు కాషాయం నచ్చదని ఎరుపు ఇష్టం అని చెప్పాడు. వ్యతిరేకుల్ని చంపేసే కల్చర్ ఉన్న కేరళ నేతల్ని కలుస్తున్నాడు. ఆయన చిత్రం ‘విశ్వరూపం-2’లో కూడా ఈ పైత్యం కనిపిస్తుంది. దేశభక్తుడైన హీరో ముస్లిం (కమల్) దేశద్రోహి అయిన హిందూని చంపడం కథ.

Pages