S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

04/14/2018 - 22:12

రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌చరణ్ జీవించాడు. ఆ పాత్రకు జీవం పోసేలా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన విధానం అందరీన విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని ఏ ఒక్క పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేనికదే సాటి. రంగస్థలంలో నటించిన ప్రతీ ఒక్కరూ వారి వారి పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

04/07/2018 - 21:53

సినిమాల్లో సెట్స్ మైమరిపించే మాయాజాలమే. అయితే గొప్ప సెట్స్ వున్న ఎన్నో చిత్రాలు ఢాం అనడం చూశాం. ‘‘అబ్బా! సెట్స్ ఎంత బాగున్నాయో!’’ అని ప్రేక్షకుడు అన్నాడంటే ఆ ఆర్ట్ డైరెక్టర్ ఫెయిల్ అయినట్టే అని ఒక కళా దర్శకుడే అన్నాడు. సెట్ ఎప్పుడూ కథని, పాత్రల్ని డామినేట్ చేయకూడదు. జానపద, పౌరాణిక చిత్రాల్లో గొప్ప సెట్స్ అవసరమే గాని సామాన్య ప్రజలు నివసించే ఇళ్లను రాజమహల్‌లాగా చూపించడం తగదు.

04/01/2018 - 04:09

బాహుబలిని, ప్రభాస్‌ని చూసి హాలీవుడ్ షేక్ అయింది. బాలీవుడ్ బావురుమంది అంటూ డబ్బాలు మోగాయి. అయితే భారత్, చైనా, ఇతర దేశాల్లోని వసూళ్లని బట్టి ప్రేక్షకుల సంఖ్యను అంచనా వేస్తే అమీర్‌ఖాన్‌ని 300 కోట్లమంది వీక్షించారనీ, ఇది ప్రపంచ రికార్డు అని తేలింది. 3 ఇడియెట్స్ పరసీ క్యాసెట్లు, సత్యమేవ జయతే టీవీ షోలు చూసిన చైనావారు అప్పటికే అమీర్ అభిమానులయ్యారు.

03/24/2018 - 21:53

ఒక కొత్త సినిమా వస్తుందంటే ప్రేక్షకులలో వచ్చే సందేహం హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? ఇద్దరూ వారి అభిమానులైతే అభిమానుల్లో కొండంత సంతోషం. అయితే మన తెలుగు సినిమాలలో కథలన్నీ హీరో ప్రాధాన్యమున్న కథలే వస్తున్నాయి. ముందు హీరో, ఆ తరువాత అతని ఇమేజ్‌కు తగ్గ కథ. మరి హీరోయిన్ పాత్రమేమిటి? ఎంత పెద్ద హీరోయిన్‌ని తీసుకున్నా డ్యూయెట్లకోసమే. అంతే తప్ప కథలో హీరోయిన్ పాత్ర నామమాత్రమే.

03/24/2018 - 21:14

శ్రీరామచరితమును - విని తరించుడు
రామనామమును - మది ధ్యానింపుడు
పురాణ పురుషుని - పురుషోత్తమునీ
కరుణాధాముని - కారణ జన్ముని రామ

మను సంభవమగు అయోధ్య పురమును
జనపతి దశరధ ప్రభు పాలించెను
కుల వర్థనులగు కొమరులు లేరని
తలపోయుచు తన మంత్రుల బిలచెను రామ

03/18/2018 - 03:40

అందరి పరిస్థితి అదే..

03/10/2018 - 22:27

పవన్ కళ్యాణ్ హీరోగా ఇటీవల విడుదలైన అజ్ఞాతవాసి చిత్రంలోని ‘‘కొడకా.. కోటేశ్వరరావు కరుసై పోతవురో’’ పాట రచయిత అల్పమైన ఆలోచనను, మనస్సును తెలుపుతోంది. ఇది అసలు అభిరుచి లేని రచయితలు రాసే పాటగా మనం పేర్కొనవచ్చు. పరమశివుని పేరైన కోటేశ్వరస్వామి మీద అనేకులు కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ, కోటయ్య, కోటమ్మ తదితర పేర్లు పెట్టుకుంటారు. వ్యక్తుల పేర్లు పాటలో వచ్చే విధంగా పాటల రచయితలు రాయటం దురదృష్టకరం.

03/03/2018 - 22:54

అందానికి చిరునామా ఆమెదే. విశ్వసుందరీమణులెందరున్నా మణికిరీటం మాత్రం ఆమెకే. ఆమె ప్రతి కదలికలో అందం జాలువారుతుంది. ఆమెను చూస్తే కోట్ల గుండెలు ఝల్లుమంటాయి. ఆమె నటిస్తే కళ్ళు తెరకే అప్పజెప్పబడతాయి. ఆమె డాన్స్ చేస్తుంటే తెరమీద ఆమె తప్ప ఇంకెవరూ కనిపించరు. స్ర్తిది అందమా ఏదీ అంటే వేలు నీవైపే చూపుతుంది.

02/24/2018 - 21:41

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ విడుదలకు ముందు ఫస్ట్‌లుక్‌ని రికార్డు స్థాయిలో కోటిమందికిపైగా వీక్షించారనీ, రిలీజ్ ముందే 120 కోట్ల బిజినెస్ చేసి మరో రికార్డు సాధించామని చానల్స్ టాంటాం చేశాయి. సినిమా విడుదల మొదటిరోజు ఆ చిత్రం మీద వచ్చినన్ని జోక్స్ మరే చిత్రానికీ రాలేదు. రెండో రోజు గడిచాక సగం థియేటర్లు జారిపోయాయి. వారం తిరిగేసరికి మొత్తం వసూళ్లు యాభైకోట్లే!

02/17/2018 - 23:00

తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడిగా, డైలాగ్‌కింగ్‌గా మోహన్‌బాబుకు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్టయిల్‌ని ఏర్పరచుకున్నారు. వివిధ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని అలరించాయి. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించినన్ని పాత్రలు మరే నటుడూ చేయలేదంటే అతిశయోక్తి కాదేమో! చాలా కాలం విరామం తర్వాత సొంత నిర్మాణ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం ‘గాయత్రి’.

Pages