S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

07/07/2018 - 23:41

మూడేళ్ల క్రితమే కథ తయారైనా ఆ కథను విన్న హీరోలకు అది నచ్చక చివరకు ఒక ఎన్నారై బకరా సినిమా తీస్తానని ముందుకు రాగా రవితేజని కలిసి అతని స్థాయికి మించి 12కోట్లు ఇస్తామనగానే కథ విన్నాడో లేదో గాని మాస్ మహారాజా వెంటనే ఒప్పుకున్నాడు. అలా ‘నేల టికెట్’ తయారైంది. ఇది నేల టికెట్ ఆడియన్స్‌నేకాక బాల్కనీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చుతుందని రవితేజా బాకా వాయించినా ఏ ప్రేక్షకులనూ అలరించలేక పోయింది.

06/30/2018 - 21:36

మహానటి చిత్రంలో కీర్తిసురేష్ సావిత్రి పాత్రను నిజంగా మనం సావిత్రిగా ఫీలవుతాము. దర్శకుడు క్రిష్ పాత్రతో కె.వి.రెడ్డి సావిత్రిలో ఒక కంట కన్నీరు కురిపించాలని రెండో కన్నులో ఎలాంటి భావం ఉండవద్దని చెబితే ఒకే షాట్‌లో లీనమైన సావిత్రి జీవితంలోని రెండో కన్ను కూడ కన్నీళ్ళమయమైంది.

06/23/2018 - 22:03

మీ వ్యూస్
=======

06/16/2018 - 20:18

గత కొనే్నళ్లుగా హిట్ సినిమా ఎరుగని వెటరన్ యాక్టర్ రవితేజకి తాజా చిత్రం ‘నేల టికెట్’ ఫలితం ‘నేలమట్టం’ అయిన తీరున అట్టర్‌ఫ్లాప్ అయ్యి, అతగాడ్కి తీవ్ర నిరాశని మిగిల్చింది. కాలానికి తగ్గరీతిన, తననుతాను మలచుకోగల్గితేనే మనిషికి ఏ రంగంలో అయినా విజయం సాధ్యం అవుతుంది. రవితేజ గత 15, 16 ఏళ్లుగా అదే వెటకార పూరిత నటనతో ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుండటంతో అతని చిత్రాలు ఫట్‌మంటున్నాయి.

06/09/2018 - 21:34

‘మహానటి’- రంగస్థలం, భరత్‌ల మాదిరి సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకుల మన్నన పొంది హిట్ అయింది. తమాషా ఏమంటే చిత్ర నిర్మాతలు గాని దర్శకుడు గాని మహానటి సావిత్రి మరణించే నాటికి పుట్టనే లేదు. నిర్మాతలు ప్రియాంక, స్వప్నల తల్లి, తాతగారు ఎక్కువగా సావిత్రి నటించిన చిత్రాలు చూస్తూ ఆమె గొప్పదనం వారికి చెప్తూ ఉండేవారు. అయితే ప్రియాంక భర్త నాగఅశ్విన్ సావిత్రి బయోపిక్ తీస్తాననగానే ఆ సోదరీ మణులు ఉలిక్కిపడ్డారు.

06/02/2018 - 23:39

పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో విడుదలైన ‘మెహబూబా’ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీసువద్ద విజయం సాధించలేక పోయింది. తనయుడు ఆకాష్‌పూరిని హీరోగా పరిచయంచేస్తూ తనకు అలవాటైన బాటలో వెళ్ళక కొత్తగా ఉంటుందని చేసిన మెహబూబా చిత్రం పూరీ జగన్నాథ్ వరుస పరాజయాల పరంపరలో ఒకటిగా నిలిచింది. ఎన్నుకున్న కథ బాగానే ఉన్నా, సరైన హీరో లేకపోవడం మైనస్‌గా మారింది.

05/26/2018 - 21:53

స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మించిన ‘మహానటి’ చిత్రం చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు అపురూపమైన అనుభూతిని పంచింది. సావిత్రి జీవిత కథలో ఇన్ని మలుపులున్నాయా? అనిపిస్తుంది. దర్శకుడు నాగ్‌అశ్విన్‌కు ఇది రెండో చిత్రం అంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ప్రతి సన్నివేశం, ప్రతి దృశ్యం కళాఖండంగా చిత్రీకరించి, తెలుగువాడి సత్తా చాటాడు. మహానటిగా నటించిన కీర్తిసురేష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.

07/14/2018 - 21:35

కథలో కొత్తదనం, ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం అభిరుచినిబట్టి కథకు ప్రాధాన్యత నివ్వడం హర్షణీయం, ఆనందదాయకం. ఆచితూచి అడుగులేస్తూ, మంచి చిత్రాలు నిర్మించాలన్న అభిలాష ఉండాలి ప్రతి దర్శకుడికి. ‘రంగస్థలం చిత్రం సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుని 3 గం. సినిమా అయినా కుర్చీకి అతుక్కుపోయేటట్లుగా చేసిం ది. విసుగులేక హాస్యపుజల్లులతో, మాటల తూటాలతో ముందుకు సాగింది. ప్రేక్షకులను అబ్బురపరచింది.

05/12/2018 - 21:37

మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘్భరత్ అనే నేను’ ఓ మోస్తరుగా వుండి అభిమానులను నిరాశపరిచి, మాస్, క్లాస్ ప్రేక్షకులను ఒకింత ఆనందపరిచింది. ఒక మామూలు కథ తీసుకుని, మహేష్, కొరటాల శివ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. మొదటిరోజు డివైడ్ టాక్ తెచ్చుకుని, మెల్లమెల్లగా సూపర్ హిట్ రేంజ్‌కి చేరుకుని ప్రేక్షకులను, విమర్శకులను విస్మయానికి గురిచేసింది.

05/05/2018 - 21:00

మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషించిన ‘్భరత్ అను నేను’ చిత్రంలో మహేష్ స్టైల్ సీఎంగా టక్ చేసుకునే పాత్రలో ప్రిన్స్‌గా కనబడడం సంతోషం. ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్ళేవారిపై సీఎం పాత్ర ద్వారా మన దేశంలో రయ్యిరయ్యిమని సిగ్నల్ దాటి వెళ్ళేవాహన చోదకులకు 20,000 ఫైన్ బావుంది. క్రమశిక్షణ లేని మన దేశంలో భరత్ చేసినట్లుగా ఎవరూ చేయకపోవచ్చును.

Pages