S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/22/2019 - 20:50

వరుస వైఫల్యాలకు బ్రేక్ వేసుందుకు అక్కినేని అఖిల్ తదుపరి ప్రాజెక్టును బొమ్మరిల్లు భాస్కర్‌తో చేయనున్న విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టు కోసం కాస్టింగ్ పూరె్తైనా, అఖిల్‌తో ఆడి పాడాల్సిన బ్యూటీని మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు. అయితే, 26నుంచే తొలి షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ఆమధ్య కైరా అద్వానీ లేదా రష్మికా మండన్న.. ఇద్దరిలో ఒకరికి చాన్స్ రావొచ్చన్న కథనాలు వినిపించాయి.

06/22/2019 - 20:49

గోదారి గట్టుంది/ గట్టుమీద సెట్టుంది/ సెట్టు కొమ్మన పిట్టుంది/ పిట్ట మనసులో ఏముంది...’ -ఈ పాట మూగమనసులు సినిమా కోసం పూదోట విరిసిన పల్లె పాట. ఒక ఈడొచ్చిన పాల పిట్టంటి గౌరి, గోదారి గట్టమ్మట పరికిణీతో గెంతుతూ పాడిన పాట. ఈ పాట పొంగింది కవితాశరధి దాశరథి కలంలో. గోదారి గలగల గలలా పారింది కమనీయ గానకోయిల పి సుశీలమ్మ గళాన. ఈ పాటకి ఎప్పుడో ఫిదా అయింది తెలుగు జాతి. జాతి నలుదిశలా వ్యాపించింది ఖ్యాతి.

06/22/2019 - 20:47

అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూధనరావు నిర్మించిన ద్వితీయ చిత్రం -తోడికోడళ్ళు. ఈ చిత్రం మాతృక శరత్ నవల ‘నిష్కృతి’. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించటానికి (స్క్రీన్‌ప్లే) హేమాహేమీలైన దుక్కిపాటి, ఆదుర్తి, ఆత్రేయ మేలుకలయిక పునాది. ఆదుర్తిది తొలి అడుగు అన్నపూర్ణా సంస్థలో. ఈ చిత్రానికి సంభాషణకర్త ఆచార్య ఆత్రేయ...

06/22/2019 - 20:44

సరే ఒక పనిచేద్దాం. ఎవరెవరు అక్కినేని పక్కన నటించాలని అనుకుంటున్నారో వారందరి పేర్లు రాసి చీట్లు కలుపుదాం. లాటరీ హీరో చేత తీయిద్దాం. ఎవరి పేరువస్తే వారే హీరోయిన్ అన్నారు. అందుకు అందరూ ఒప్పుకున్నారు.

06/15/2019 - 21:26

నాకు నచ్చిన, నా ఎద వీణను శృతి చేసిన పాట
-ఈ వీణకు శృతి లేదు/ ఎందరికో హృదయం లేదు/ నా పాటకు పల్లవి లేదు/ ఈ బ్రతుకెందులకో అర్థంకాదు

06/15/2019 - 21:24

ఈ సినిమా ఒక ప్రేమకథా చిత్రం. ఇందులో ప్రేమ జంటగా విశ్వా- శరణ్యలది తొలి పరిచయమైతే -బాలీవుడ్‌లో స్థిర పరిచితుడు, స్థితప్రజ్ఞుడు అయన ఓపీ నయ్యర్ -తెలుగుకు చేసిన ఓకే ఒక్క చిత్రమిది.
ఈ ప్రేమ కథకు జీవం జవం సంగీతమే. అంచేత ఇది ఒక సంగీత ప్రధాన చిత్రంగా ప్రేక్షకుల మన్ననలందుకుంది.

06/15/2019 - 21:23

ఒకరోజు లక్ష్మీ నిలయంలో కూర్చొని పెద్దాయన, చిన్నాయన.. అంటే యన్‌టి రామారావు, త్రివిక్రమరావులు సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. వారు మాట్లాడుకుంటున్నారంటే, అక్కడ మరెవరూ ఉండరు.

06/15/2019 - 21:10

పెళ్లికి రెడీగానే ఉన్నాను. కాకపోతే -అమ్మాయివైపు నుంచే ఇంకా క్లియరెన్స్ రాలేదు -అంటున్నాడు హీరో రాజ్‌తరుణ్. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానంటూ ఈమధ్య గుట్టువిప్పిన రాజ్‌తరుణ్, వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కే అవకాశం లేకపోలేదంటూ చెప్పకనే చెబుతున్నాడు. ఇంతకాలం లవర్ డీటెయిల్స్‌ను సీక్రెట్‌గా ఉంచిన రాజ్‌తరుణ్, తాజాగా ఆమె సమాచారానికి సంబంధించి కొన్ని క్లూలు ఇస్తున్నాడు.

06/15/2019 - 21:07

1973 డిసెంబర్ 14న ‘ఎర్రకోట వీరుడు’ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఎగబడ్డారు. బొమ్మపడింది. సినిమా మొదలైన ఇరవై నిమిషాల తరువాత తెరపై ఎన్టీఆర్ కనబడ్డారు. ఆయన డైలాగ్ చెప్పడం మొదలెట్టగానే -ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చెవులు రిక్కించి మళ్లీ శ్రద్ధగా ఎన్టీఆర్ చెప్పే డైలాగులు విన్నారు. కాసేపటికి అర్థమైపోయింది. అది ఎన్టీఆర్ వాయిస్ కాదని.

06/08/2019 - 21:14

శోభన్‌బాబు ఆకస్మిక మరణం.

Pages