S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/14/2018 - 19:36

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సమంత.. ఈమధ్య తన ప్రతిభను చాటుకునే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కన్నడ రీమేక్ యూటర్న్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంది. ఈ సినిమాలో సమంత కీరోల్‌లో కనిపిస్తుంది. ఈ సినిమాతోపాటు సమంత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది అదికూడా కొత్త దర్శకుడితో.

07/14/2018 - 19:34

అందాల భామ కాజల్‌కు ఈమధ్య బాగా సినిమాలు తగ్గాయి. వరుసగా స్టార్ హీరోలతో జోడీకట్టి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్‌కు ఈమధ్య వరుసగా పరాజయాలు పలకరించడంతో ఈమెకు కొత్త అవకాశాలు తగ్గాయి. అటు తమిళంలోనూ పరిస్థితి అలాగే మారడంతో ఇపుడు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో వుంది.

07/14/2018 - 21:39

బాలీవుడ్ బాద్షాకు ఈమధ్య కెరీర్‌పరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు చేస్తున్న సినిమాలన్నీ కమర్షియల్‌గా సక్సెస్ కావడంలేదు. దాంతో క్రేజ్ కూడా బాగా తగ్గింది. ప్రస్తుతం జీరో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరుగుజ్జు పాత్రలో షారుఖ్ కనిపిస్తాడట. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఆయన స్పేస్ పైలెట్ రాకేష్‌శర్మ బయోపిక్‌లో నటిస్తున్నాడు.

07/14/2018 - 21:24

ఆడజన్మ గొప్పదనం గురించి- విశిష్టంగా వివరించి రచించిన ఈ గీతం- సిరివెనె్నలగారి సాహితీ సృష్టికి మరో మచ్చుతునక.

07/14/2018 - 18:52

1947 ప్రాంతంలో విడుదలై అన్ని థియేటర్‌లలో శత దినోత్సవం జరుపుకొని రజతోత్సవం వైపు పరుగులిడిన జానపద చిత్ర రాజం ‘కీలుగుఱ్ఱం’. సాధారణంగా శృంగార కథానాయికగా సాత్విక అభినయంతో మెప్పించే అంజలీదేవి ఇందులో రాక్షసిగా కనబడడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. నాగేశ్వరరావు కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో మహారాజుగా ఏ.వి.సుబ్బారావు వేశారు.

07/08/2018 - 00:03

మహేష్‌బాబు నటించిన ‘్భరత్ అనే నేను’ ఘన విజయం తరువాత తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. మహేష్ నటిస్తున్న 25వ చిత్రమిది. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది.

07/08/2018 - 00:23

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రంగస్థలంతో తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. నాన్ బాహుబలి రికార్డ్స్‌కింద రంగస్థలం మొదటి స్థానంలో నిలబడింది. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న చరణ్ ఆ తరువాత కొరటాల శివతో మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే చరణ్ ఫోకస్ ఇప్పుడు ఒక్క తెలుగులోనే కాకుండా.. హిందీపై కూడా పడ్డట్టుంది. ఇదివరకే హిందీలో జంజీర్ (తెలుగులో తుఫాన్) చిత్రంలో నటించాడు.

07/07/2018 - 21:59

‘ముత్యాలముగ్గు’ సినిమాలోని ఈ పాట నాకు ఎంతో ఇష్టం. గుంటూరు శేషేంద్రశర్మగారు వ్రాసిన ఒకే ఒక్క సినిమా పాట. అద్భుతమైన సాహిత్యం, కె.వి.మహాదేవన్‌గారి అమృత తుల్యమైన సంగీతం, సుశీలగారి ఆర్ద్రతగల కంఠం, బాపుగారి సహజ చిత్రీకరణ, విశాల నేత్రి సంగీత నటన ఇవన్నీ కలిసి ఈ పాటను అజరామరం చేశాయి.

07/07/2018 - 22:03

1974లో హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు విడుదలై ఘన విజయం సాధించింది. ఆ చిత్రం తర్వాత కృష్ణ నటించినవి దాదాపు 14 సినిమాలు అపజయం పాలయ్యాయి. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుకొని, 1976లో స్వంత బేనర్‌లో ‘పాడిపంటలు’ తీసి విజయాన్నందుకున్నారు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎద్దులు చేసే విన్యాసాలు ఆసక్తిని కల్గిస్తాయి.

06/30/2018 - 22:26

అందాల భామ రాశీఖన్నా పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. చేసే ప్రతి చిత్రంలో తన పాత్ర పరిధి ఎలాంటిదో ముందుగానే కసరత్తు చేసి, ఆ పాత్రలో జీవించడానికి తెగ తాపత్రయపడుతోంది. ఫలితంగానే నేడు టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంటోంది.

Pages