S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/30/2018 - 22:20

టాలీవుడ్‌లో వరుసగా మల్టీస్టారర్ సినిమాల హవా జోరుగా కొనసాగుతుంది. అయితే పెద్ద హీరోలు ఇద్దరు కలిసి ఈ మల్టీస్టారర్ సినిమాలు చేయకుండా యంగ్ హీరోలతో జత కడుతున్నారు. ఇప్పటికే వెంకటేష్, మహేష్, రామ్‌లతో మల్టీస్టారర్స్ చేశాడు. తాజాగా వరుణ్ తేజ్‌తో సినిమా మొదలుపెట్టాడు. ఇక నాగార్జున కూడా నానితో ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు. తాజాగా నాగార్జున మరోసారి మల్టీస్టార్‌కు ఓకె చెప్పాడు.

06/30/2018 - 21:30

బాహుబలి స్ఫూర్తితో సౌత్‌లో భారీబడ్జెట్‌తో పలు చిత్రాలను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ముందుగా చెప్పుకునేది.. సంఘమిత్ర సుందర్.సి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో మొదలైన ఈ సినిమాలో శృతిహాసన్ టైటిల్ రోల్‌లో నటించేందుకు ఓకె చెప్పడంతో షూటింగ్ మొదలుపెట్టారు. అయితే అనుకోకుండా శృతి తప్పుకోవడంతో సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం ఈ టైటిల్ రోల్‌లో బాలీవుడ్ భామ దిశాపటాని నటిస్తోంది.

06/30/2018 - 21:24

పాతాళభైరవి, మిసమ్మ, మాయాబజార్ లాంటి అమోఘ విజయాల తర్వాత విజయా వారు ఒక జానపదం నిర్మించాలని తలంచి కె.వి.రెడ్డితో చర్చించడం, కె.వి.గారు, విజయావారి ఆస్థాన రచయిత పింగళి గారితో కలసి ఈ చిత్రం గురించి చర్చించడం నాగిరెడ్డి, చక్రపాణిలకు వివరించడం జరిగింది. అదే ‘జగదేక వీరుని కథ’ చిత్రం.

06/30/2018 - 21:20

1990ల్లో వచ్చిన ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురూ’ పాట నేటికీ సతతహరితమే. నేను, మా ఫ్రెండ్ ఆనంద్ ఫస్ట్ షోకు కావలిలోని ‘లత’ థియేటర్‌లో చూసిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది. డిగ్రీ మొదటి సంవత్సరం, అప్పుడే మొగ్గ తొడుగుతున్న యవ్వనం, కాలేజీ వాతావరణం ఈ సినిమాకన్నా ఈ పాటను మరపురానివి చేశాయి.

06/30/2018 - 21:16

తెలుగు చలన చిత్రాలలో ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు ప్రేక్షకులు చూసారు. అన్ని చిత్రాల్లో కొన్ని చిత్రాలు మనసును ఆకట్టుకుంటాయి. హృదయాన్ని ఏ పిల్ల సమీర తీరాలకో తీసుకెళతాయి. కొన్ని చిత్రాలు సందేశాత్మకంగా ఉంటే, మరికొన్ని నిత్య నూతనంగా భావించే ప్రేమలాలిత్యంతో అద్భుతంగా ప్రేక్షకుల మనసులలో తొణికిసలాడుతాయి. ఏ సినిమా ఏ ప్రేక్షకుడికి ఎలా నచ్చుతుందో తెలియదు.

06/30/2018 - 21:13

ఏంటి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా.. నిజమే ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోదట.. కానీ తన జీవితంలో ఓ ప్రత్యేక వ్యక్తి ఉన్నాడట. ఇలాంటి కామెంట్స్ చేసింది ఎవరో కాదు కోలీవుడ్ గ్లామర్ భామ లక్ష్మీ మీనన్. చిన్న వయసులోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి..

06/30/2018 - 21:11

తమిళ సూపర్‌స్టార్ అజిత్ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తయినా ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారట. వివేకం, వేదాలమ్ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న అజిత్-శివల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు అటు బిజినెస్ పరంగా కూడా భారీ హైప్ నెలకొంది.

06/30/2018 - 21:02

వెనె్నలకు రచనలు పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

06/24/2018 - 00:03

మిల్కీ భామ తమన్నా మళ్లీ స్పీడ్ పెంచింది. భారీ అంచనాలు పెట్టుకున్న అభినేత్రి ఫ్లాప్ తరువాత ఈ భామకు అవకాశాలు తగ్గాయి. తెలుగులో కేవలం క్వీన్ సినిమా మాత్రమే చేస్తోంది. అటు తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుంది. ఇక తమన్నా తాజాగా కళ్యాణ్‌రామ్‌తో చేసిన నా నువ్వే కూడా ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు. అయినా సరే మిల్కీ భామ గ్లామర్ విషయంలో ఎప్పుడు టాప్ కాబట్టి ఈ అమ్మడికి మళ్లీ అవకాశాలు వస్తున్నాయి.

06/23/2018 - 22:45

నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, యావత్ సినిమా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజంగా ఓ సామాన్యుడి స్థాయి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పాలి. బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా నుండి అనుకోకుండా దర్శకుడు తేజ తప్పుకోవడంతో సినిమా ఆగిపోతుందా అని అనుకున్నారు అందరూ.

Pages