S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/15/2016 - 04:03

సూపర్ హిట్టు యాక్షన్ సినిమా ప్రీ క్లైమాక్స్‌లో -విలన్ దెబ్బకు గింగిరాలు తిరిగే హీరోలా టాలీవుడ్ విలవిల్లాడుతోంది. నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోదీ యాక్షన్ ఎపిసోడ్ మొదలై వారం కావొస్తున్నా -‘పెద్ద’ దెబ్బనుంచి పరిశ్రమ తేరుకునే సీన్ కనిపించటం లేదు. ఇప్పట్లో తేరుకోవటం కష్టమన్న వాదనా వినిపిస్తోంది.

11/14/2016 - 23:10

అప్‌కమింగ్ హీరోయిన్లు పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తుంటే -తమన్నా బాటియాలో తడబాటు మొదలైందట. టాప్ హీరోయిన్ల క్యాటగిరీలో నయనతార రూటు మార్చి చిన్న హీరోలతో పెద్ద సినిమాలు చేస్తోంది. పెద్ద హీరోలకు కాల్షీట్లే ఇవ్వడం మానేసింది. ఇక పెళ్లికి సిద్ధమవుతున్న సమంత క్రమంగా సినిమాలు తగ్గిస్తోంది. త్రిష దాదాపుగా రేసునుంచి పూర్తిగా పక్కకెళ్లిపోయింది.

11/14/2016 - 22:07

బుల్లితెరపై హాట్ లుక్స్‌తో అట్రాక్ట్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది అనసూయ. ఆమె క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ‘ఐటెమ్ సాంగ్’ చాన్స్‌తో ఆమెవద్దకెళ్లినా సున్నితంగా తిరస్కరించింది. అదే టైంలో ‘క్షణం’లో విలనిజాన్ని, ‘సోగ్గాడే చిన్నినాయిన’లో భారీ అందాలతో అలరించిన అనసూయ -ఇప్పుడు మరో సెనే్సషన్‌కు తెరలేపిందట.

11/14/2016 - 22:05

కథానుసారం పాత్రకు అనుగుణంగా మేకప్ వేయడం చిన్న విషయమెమీ కాదు. కనిపించని కష్టం ఎంత ఉందో, మేకప్‌మెన్ మెళకువలు కూడా ఇక్కడ చాలా ముఖ్యం. కొంతమంది హీరోలు మేకప్ కోసం నైపుణ్యం కలిగిన పర్సనల్ మేకప్‌మన్‌లను ఏర్పాటు చేసుకుంటారు కూడా. సినిమాల ప్రారంభ దశనుంచే మేకప్ రంగం చిత్ర నిర్మాణంలో ముఖ్య భాగమైంది. ఎన్టీఆర్ నటించిన ‘సొంత ఊరు’ చిత్రంలో ఒక సన్నివేశంలో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపిస్తారు.

11/14/2016 - 21:58

సినిమా ఆవిర్భావానికి ముందే జానపదాలకు ఓ ప్రత్యేకస్థానం ఉన్నా -సినిమాల్లో వాటికి స్థానం దొరికిన తరువాత మరింతగా అవి జనాలకు దగ్గరయ్యాయి. సినిమా రంగంలో ఉద్దండులైన సంగీత దర్శకులు మైమరిపించే జానపద బాణీలుకట్టి మెప్పించారు. చేయి తిరిగిన గీత రచయితలు సందర్భానికి తగిన జానపద గీతాలు అందించి అబ్బురపర్చారు. నిజానికి -తెలుగు పరిశ్రమ కోసం పుట్టిన జానపద గీతాలు ఎప్పటికీ ఆణిముత్యాలే!

11/14/2016 - 22:09

-బందూక్ లక్ష్మణ్
తొలి చిత్రంతోనే వైవిధ్యమైన చిత్రం చేసి అందర్నీ ఆలోచింపజేసాడు లక్ష్మణ్. అప్పటినుండి ‘బందూక్ లక్ష్మణ్’గానే అతన్ని వ్యవహరిస్తున్నారు. సమాజంలోని బర్నింగ్ టాపిక్ ఇతివృత్తంగా మలచుకుని సినిమా చేసిన ఆయనతో
ఈవారం చిట్‌చాట్.
నేపథ్యం?
రంగారెడ్డి జిల్లా మంచాల మా ఊరు. డిగ్రీ వరకు చదువుకున్నా.
దర్శకుడిగా..?

11/14/2016 - 20:52

1962లో విడుదలై ఎనిమిది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న సాంఘిక చిత్రం ‘కులగోత్రాలు’. కథాంశం పాతదే అయినా ఇతర హంగులతో అలనాటి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన చిత్రమిది. ముఖ్య పాత్రలలో నాగేశ్వరరావు, కృష్ణకుమారి జీవించారనే చెప్పాలి. శుద్ధ్ఛాందస వాది అయిన భూషయ్య ఏదో ఒక లోటు కారణంగా తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి అంగీకరించకపోయినా, ఆయన అనుమతితోనే శుభకార్యం ముగుస్తుంది.

11/14/2016 - 20:49

దైవకార్యానికి, దైవ దర్శనానికి, దైవ కృపకు భక్తుడు ఎంతగా తపించి, విలపించిపోతాడో ఎన్నో సినిమాల్లో చూపించారు. చిన్న చిన్న సేవలు చేసినంత మాత్రానే ఎంతోమందిని కరుణించిన కరుణామయుని దయ తనపైనా పడాలని, తానుకూడా ఆ తానులో ఓ చిన్న ముక్క కాలేకపోయానేనని ఓ భక్తురాలు ఈ కలియుగంలో పడిన ఆవేదనను ‘గోరంతదీపం’ చిత్రంలో ఆవిష్కరించారు. 1978లో బాపుగారి దర్శకత్వంలో నిర్మింపబడిన ఈ చిత్రంలో ఎన్నో మంచి పాటలున్నాయి.

11/14/2016 - 20:46

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

11/07/2016 - 21:50

సక్సెస్‌లు కావాలంటే అప్పుడప్పుడూ సాహసాలు చేయాలంటోంది అందాల రాశి. హీరోలంటే ఫైటింగ్‌లు గట్రా చేస్తారు. మరి హీరోయిన్లు ఎలాంటి సాహసాలు చేయాలి? అన్న ప్రశ్నకు ఆమె దగ్గర వెరైటీ ఆన్సర్లే ఉన్నాయి. హీరోయిన్లు ఫైటింగ్‌లు చేసే చాన్స్‌లు ఉండవు కనుక -అంతకంటే పెద్ద సాహసాలే వెతుక్కుని చేయొచ్చంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎలా? అంటే -ఓ చిన్న సినిమాలో అంతకంటే చిన్న పాత్ర చేయడం సాహసం కాదా? అన్నది ఆమె ఎదురు ప్రశ్న.

Pages