S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/07/2016 - 20:57

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

11/01/2016 - 02:47

కృష్ణావతారం చిత్రంలో సినారె ప్రాసలు, శృంగార భావాలు, సుతిమెత్తని ఎత్తిపొడుపులు, సరస సంభాషణా చాతుర్యంతో మనోహరంగా సాగే పాట -నీ చరణ కమలాల నీడయే చాలు/ ఎందుకో ఈ స్వామి బృందావనాలు’. ఈ పాట నాకు చాలా ఇష్టం. చెంచులక్ష్మి నుంచి ఆనాటి వరకూ సినీపాటలు సీనియర్ సముద్రాల రాయడం పరిపాటి. కానీ, ఈ చిత్రానికి ఆయన పదునైన సంభాషణలు రాశారు. కానీ, పాటలు మాత్రం సినారే రాయడం గమనార్హం.

11/01/2016 - 02:43

వరకట్న దురాచారానికి సమాజంలో బలవుతున్న ఆడపిల్లలు, కుటుంబాల దయనీయ పరిస్థితి, తీరుతెన్నులను నందమూరి సోదరులు హృద్యంగా చిత్రీకరించి నిర్మించిన సామాజిక సందేశాత్మక కుటుంబ కథాచిత్రం -వరకట్నం. అప్పటి వరకూ పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎన్టీ రామారావు తొలిసారిగా ఒక సామాజిక సమస్యను కథాంశంగా తీసుకొని దర్శకత్వం వహించిన చిత్రమిది. చిత్రంలో ఎన్టీఆర్, కృష్ణకుమారి నాయకా నాయికలు.

10/31/2016 - 22:36

ఈ రోజుల్లో సినిమాలు చూసి యువత నిర్వీర్యమవుతున్నారు. సమాజానికి అవసరమైన పౌరులుగా ఎదగడంలేదు. ఓ రకంగా వారి భవిష్యత్తును సినిమాలే నాశనం చేస్తున్నాయి అని ప్రజాభిప్రాయం వినబడుతున్న నేపథ్యంలో సినిమాలవల్ల సమాజం బాగుపడుతుందని ప్రేక్షకులు అనుకునే స్థాయికి నేటి సినిమా రావాలని ఆశిస్తున్నాడు దర్శకుడు ఎస్.ఎం.సూర్య. సినిమాపై వున్న చెడు అభిప్రాయం మారాలంటే మంచి సినిమాలను అందివ్వాలని చెబుతున్న ఆయనతో

10/31/2016 - 22:34

కెరీర్ ముగింపు దశలోకి వచ్చేసిందన్న విషయాన్ని గమనించేసింది అందాల భామ త్రిష! ఇక నటనకు ప్రాధాన్యం ఉన్న ఓ చిత్రంలో నటించాలని ఆలోచిస్తోంది. అందుకే తమిళనాడులో ప్రస్తుతం ఎక్కడ చూసినా అమ్మ నామం జపిస్తున్నారు కనుక, అలాంటి ఓ చిత్రంలో నటిస్తే బావుంటుందనుకుంది. అందుకే అమ్మ బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనస్సులో మాట బయటపెట్టేసింది. దీంతో కోలీవుడ్‌లో దర్శక, నిర్మాతలకు ఓ మంచి ఆలోచన కూడా ఇచ్చినట్లైంది.

10/31/2016 - 22:33

ఆర్టిస్టులు సినిమాల్లో నటించి ధనార్జన చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతుంటారన్న భావన జనావళిలో సహజం. కాని ఆ మహద్భాగ్యం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కళాకారుల టాలెంట్, కృషి, వీటన్నింటికీ మించి ఒకింత అదృష్టం కలసిరావాలి. అంతకుమించి ప్రేక్షకాదరణ చాలా చాలా అవసరం. అందుకే ‘ప్రేక్షకులే మా ఆరాధ్యదైవాల’ని కళాకారులు పదేపదే చెప్పుకుంటుంటారు.

10/31/2016 - 22:31

నచ్చిందే మరోసారి చేస్తే పోలా? అనుకుంటుంది కత్రినాకైఫ్. గతంలో బార్‌బార్ దేఖో చిత్రంలో చేసిన కాలాచెష్మా పాటనే మళ్లీ పాడాలనుకుంటోందట. సినిమా అప్పట్లో సరిగా ఆడకపోయినా, పాటలో కత్రినా ఊపునకు ప్రేక్షకులు పట్టంకట్టశారు. అసలు ఆ సినిమా కొద్పోగొప్పో నిలదొక్కుకుందంటే ఆ పాటతోనే. అందుకే మళ్లీ అదే పాటతో ప్రేక్షకులను మెప్పించాలని, ఆ పాటకు మరింత హంగులు జత చేయాలని ప్రయత్నిస్తోంది కత్రినా.

10/31/2016 - 20:53

సినిమాలో ప్రేక్షకుడి అంచనాకు దొరకని అంశం ఏదోకటి తెరపై కనిపిస్తే -ఆశ్చర్యపడతాడు. వౌత్‌టాక్‌తో సినిమా పబ్లిసిటీని పెంచేస్తాడు. అన్నింటికి మించి తన అభిమాన హీరో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తే ఇంకేముంది -సినిమాకు పట్టంకట్టేస్తాడు. దీనికోసం పాతతరం నుంచి నేటితరం వరకూ ఇలాంటి బోనస్ సన్నివేశాలను పెట్టడానికి -దర్శకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

10/31/2016 - 20:52

ఆంధ్ర మహాభాగవతంలో మార్కండేయుని వృత్తాంతం గోచరిస్తుంది. శివ వరప్రసాదిగా జన్మించి భక్తి ప్రపత్తులతో ఈశ్వరుని ఆరాధించి మృత్యువు కోరలనుంచి బయటపడిన భక్తవరేణ్యుడు మార్కండేయుడు. శివ పురాణంలోని మార్కండేయ చరిత్ర పఠిస్తే అపమృత్యువు బాధ తొలగుతుందని ప్రజల నమ్మకం. ఈ గాథను చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో కేబేరా పిక్చర్స్ బ్యానర్‌పై 1938లో ఘంటసాల బలరామయ్య, వెంకటరెడ్డిలు చిత్రంగా రూపొందించారు.

10/24/2016 - 22:20

‘బాహుబలి’లో కట్టప్పగా ఆకట్టుకున్న సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ అనసూయ వెంటపడుతున్నాడు. హీరోగా తరువాతి ప్రాజెక్టులో పట్టుబట్టి మరీ అనుసూయను ఖరారు చేసుకున్నట్టు సమాచారం. సినిమాలు చేస్తున్నా కెరీర్‌పరంగా ఒక్క కమర్షియల్ హిట్టూ కొట్టలేకపోయిన శిబిరాజ్, ఈసారి హిట్టు చాన్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని వినికిడి. అందులో భాగంగానే తెలుగు హాట్ యాంకర్ అనుసూయను అడుగుతున్నాడని ఇండస్ట్రీ టాక్.

Pages