S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/18/2016 - 20:56

పాత చిత్రాలలో ఓ అద్భుతమైన సినిమా మూగప్రేమ. సంగీత సాహిత్యాలు, హాస్య, కరుణ రసాలు మిళితమైన ఒక విశిష్టమైన దృశ్యకావ్యం ఇది. ఆనాటి సామాజిక సమస్య అయిన ధనికుల పేదలమధ్య పెరుగుతున్న అగాధం, రగులుతున్న ద్వేషం కళ్లకు కట్టేలా చిత్రించాడు దర్శకుడు. సంగీత సాహిత్యాలతోపాటుగా కథ కథనం చక్కగా సాగి చివరికి సుఖాంతం కావడం గమనించదగ్గ విశేషం. ప్రాచీన నాటక లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న ఈ చిత్రం ఈనాటికీ జనరంజకంగా ఉంటుంది.

07/18/2016 - 20:54

దొంగరాముడు చిత్రంలో పెండ్యాల సంగీత దర్శకత్వంలో సుశీల ఆలపించిన ‘తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు’ అనే పాట నాకు చాలా ఇష్టం. బడికి వెళ్లక అల్లరి చిల్లరిగా తిరుగుతూ చెడుదారిలో పయనిస్తున్న చిన్నపిల్లవాణ్ణి మాష్టారు కఠినంగా శిక్షిస్తాడు. ఆ బాబుకి చెల్లెలు మంచి బుద్ధులు చెబుతూ పాడిన పాటే ఇది.

07/11/2016 - 21:52

‘గుంటూరు టాకీస్’ తర్వాత జబర్దస్త్ భామ ‘రేష్మీగౌతమ్’ నటించిన సినిమా ‘అంతం’. రంజాన్ సందర్భంగా గురువారంవిడుదలైన సినిమా బాగానే నడుస్తోందని టాక్. జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కింది. అంతం సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయన్నది డిస్ట్రిబ్యూటర్స్ టాక్. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 300 స్క్రీన్లపై సినిమాను రిలీజ్ చేశారు.

07/11/2016 - 21:37

చిరు 150వ సినిమా కోసం దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమను జల్లెడ పట్టేస్తున్నారు. ఎందుకు? అన్న ప్రశ్న మైండ్‌లోకి వస్తుంది కదూ! ఇంకెందుకూ.. హీరోయన్ కోసం. నయన్ అనుకున్నారు. అనుష్కను పిలిచారన్నారు. ఇలా రోజుకో పేరు.. ఇక్కడమ్మాయ అక్కడమ్మాయ అంటూ రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయ.

07/11/2016 - 22:01

కథ: ముళ్లపూడి వెంకటరమణ
మాటలు: ఎన్‌ఆర్ నంది
నృత్యం: హీరాలాల్, పిఎస్ గోపాలకృష్ణ
ఎడిటింగ్: టి.కృష్ణ
కెమెరా: పిఎల్ రాయ్
కళ: తోట
సంగీతం: కెవి మహదేవన్
నిర్మాత: సి సుందరం
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు

07/11/2016 - 21:24

వెండితెరపై నవరసాలు పండించి -మేటి నటి అనిపించుకున్న సావిత్రికి సరిజోడిని ఇప్పటి ఇండస్ట్రీలో ఊహించగలమా? తెలుగు సినిమా స్వర్ణయుగంలో ధ్రువతారగా వెలుగొందిన ఆమె జీవిత కథను సినిమా తీస్తే -ఆ పాత్రను పోషించగల ప్రతిభావంతురాలు ప్రస్తుత చిత్ర పరిశ్రమలో దొరుకుతుందన్న నమ్మకం కలుగుతుందా? సావిత్రి పోషించిన పాత్రలు, ఆ పాత్రల్లో ఆమె ఇమిడిపోయిన తీరు -తెలుగు ప్రేక్షకుడు ఎప్పటికీ మర్చిపోడు.

07/11/2016 - 21:24

పుంఖాను పుంఖాలుగా సినిమాలు విడుదలవుతున్నా -తెలుగు ప్రేక్షకుడు ఒక్కదానికీ సరైన మార్కులు వేయడం లేదు. ముఖ్యంగా ఈ సీజన్ చిన్న సినిమాకు సరైన స్లాట్ ఇచ్చినా, విడుదలైన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర బతికి బట్టకట్టేకపోయాయ. ఈవారం చూస్తే..

07/11/2016 - 21:09

అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ హాట్‌భామ దీపికా పడుకోనే గత కొన్ని రోజులుగా రణవీర్‌సింగ్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి వ్యవహారంపై బాలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. మొత్తానికి వీరి ప్రేమ ఫలించిందని.. ఇటీవలే దగ్గరి బంధువుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారన్నది సమాచారం.

07/11/2016 - 21:07

తెలుగు నటీమణుల్లో నిర్మలకు ప్రత్యేకత ఉంది. ఆమె చేసిన ఏ చిత్రంలోనైనా పాత్ర కనిపిస్తుందే తప్ప, ఆ పాత్రలో నిర్మలమ్మ కనిపించదు. సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్రలలో ఎంతగా రాణించిందో నిర్మల అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ పాత్రలలో అంతగా రాణించింది. అందుకే వీరిద్దరికీ పేరుపక్కన అమ్మను చేర్చి సూర్యకాంతమ్మ, నిర్మలమ్మ అని సంబోధిస్తుంటారు పరిశ్రమ పెద్దలు.

Pages