S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/29/2016 - 20:52

తెలుగు సినిమాను ఓ కొత్త ఒరవడిలోకి నడిపించిన చాలా సినిమాల్లో -మానవుడు దానవుడు కూడా ఒకటి. ఒక మనిషి రెండు జీవితాలను అనుభవిస్తూ పగలు ప్రాణం పోసే వైద్యుడిగా (వేణు), చీకటిన ప్రాణం తీసే కిరాతకుడిగా (జగన్) శోభన్‌బాబు పోషించిన పాత్రలు అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రం చూసినప్పుడే మైండ్‌లో రిజిస్టరైపోయింది. నాలుగు దశాబ్దాల పైచిలుకు కాలం గడిచినా, మర్చిపోలేనంత ముద్రవేసింది. అదే -మానవుడు దానవుడు.

08/29/2016 - 20:50

1991లో విడుదలైన ‘పెళ్ళి పుస్తకం’ చిత్రానికి ఆరుద్ర కలంనుండి జాలువారిన అద్భుత గీతం- శ్రీరస్తూ శుభమస్తూ. ఈ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకూ పెళ్ళిపీటల మీదనున్న వధూవరులకు వినిపించే సందేశ గీతమిది. ముఖ్యంగా కొత్త పెళ్ళికూతురుకి కొన్ని సూచనలివ్వబడ్డాయి. ‘శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం’- అంటే ఇద్దరిమధ్యా వివాహ బంధం ఏర్పడిందని.

08/22/2016 - 22:14

హ్యాపీడేస్ తరువాత -వరుణ్ సందేశ్‌కు ‘హ్యాపీడేస్’ కరవయ్యాయి. వరుస ప్రాజెక్టులన్నీ బాక్సాఫీస్ దగ్గర బాల్చీ తనే్నయడంతో -్భగవంతుడి కరుణ లేదంటూ డీలాపడ్డాడు వరుణ్. ఇప్పుడిక ‘మిస్టర్ 420’ మీదే అతని ఆశలు ఉన్నాయి. దాదాపు నిర్మాణం పూర్తవడంతో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్‌ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన ప్రియాంక భరద్వాజ్ కనిపించబోతుంది.

08/22/2016 - 22:12

గోవా బుల్లి ఇల్లీ బేబీ పిచ్చి హ్యాపీగా ఉందట. చాలాకాలంగా హిట్టుకు కరువాచిన క్షణాల్లో -రుస్తుం ఆమెకు దివ్యౌషధంలా పనిచేయడమే కారణమంటున్నారు ఆమె ఫ్రెండ్స్. అవునుమరి.. కాస్త ఆలస్యంగానైనా వంద కోట్ల క్లబ్‌వైపు ‘రుస్తుం’ పరుగులు తీస్తుంటే -బేబీ ఆనందంతో గాల్లో తేలిపోదూ. కనీసం -రెండు కొత్త ప్రాజెక్టులైనా ఒళ్లో వాలతాయని ఇలియానా ఆశ పాపం.

08/22/2016 - 22:05

తెలుగు, తమిళ తెరలను పదిహేడేళ్లపాటు ఏలేసిన త్రిషకూ -ఓ తీరని కోరిక ఉందట. తెలుగు, తమిళ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేసేసిన త్రిష -స్టార్ హీరో రజనీతో ఒక్క సినిమా కూడా చేసే అవకాశం రాలేదని ఇప్పుడు ఆవేదన చెందుతోంది. ఈ విషయానే్న ఈమధ్య చెప్పుకొస్తూ అనేకమంది హీరోలతో నటించినా, సూపర్‌స్టార్ రజనీతో నటించాలన్న కోరిక ఇప్పటికీ తీరలేదని, ఆ ఒక్క కోరికా అలాగే ఉండిపోయిందని చెప్పుకొచ్చింది.

08/22/2016 - 21:44

శ్రీకృష్ణ దేవరాయల కొలువులోని అష్టదిగ్గజాల్లో ఒకరైన నంది తిమ్మన వ్రాసిన ప్రబంధమే పారిజాతాపహరణం. ఆ ప్రబంధం ఆధారంగా 1920లో ముత్తరాజు సుబ్బారావు ‘శ్రీకృష్ణతులాభారం’ నాటకాన్ని రచించారు. వందలకొద్దీ ప్రదర్శనలు జరుపుకున్న నాటకంలో ప్రసిద్ధ నటుడు స్థానం నరసింహారావు సత్యభామ పాత్ర పోషించి ‘మీరజాలగలడా’ గీతాన్ని ఆలపించి వనె్నకెక్కారు. ఆ నాటకంలోని పాటలు, పద్యాలు జనరంజకంగా నిలిచాయి.

08/22/2016 - 21:26

-కబాలి కొట్టుకుపోవడానికి సవాలక్ష కారణాల్లో మీడియా ఒకటి అనిపిస్తుంది. వోవరాక్షన్ చేసి కబాలి చిత్రాన్ని ఆకాశానికి ఎత్తింది విజువల్ మీడియా. పట్టుతప్పి నింగినుండి నేలకుపడి కబాలి ముక్కలైతే, భూమిలోకి తొక్కేసిందీ విజువల్ మీడియానే అనిపిస్తుంది. ‘కబాలి’ చిత్ర నిర్మిత సమయం నుంచీ విడుదల వరకూ అత్యుత్సాహం చూపించింది.

08/22/2016 - 21:06

బాహుబలిలో తళుక్కున మెరిసి, కలిసొచ్చిన అవకాశాలతో తెలుగు, హిందీ భాషల్లో బిజీ అయ్యింది తమన్నా. బాలీవుడ్‌లో పాగా వేయాలన్న కోరికను బాహుబలి తీర్చడమే కాదు, ఇబ్బడిముబ్బడిగా అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. తమిళంలోనూ రేంజ్ పెంచుకున్న తమన్నా, తొలిసారి మళయాల స్క్రీన్‌పై కనిపించబోతోందని వార్త విస్తృతంగా ప్రచారమైంది.

08/22/2016 - 21:05

తెలుగు సినిమా రంగంలో ఎందరో హీరోలు. అద్వితీయమైన నటనను ప్రదర్శించిన వాళ్లు కొందరు. పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్లు ఇంకొందరు. ఆహార్యంలోనూ, వాచకంలోనూ తనకు సాటి లేదనిపించుకున్న వాళ్లు ఇంకొందరు. కానీ అందాల నటుడిగా పేరు తెచ్చుకున్న వాళ్లు మాత్రం బహు కొద్దిమంది. వాళ్లలో ఒకప్పటి హరనాథ్ ఒకరు. పూర్తిపేరు బుద్దరాజు వేంకట అప్పల హరనాథ్ రాజు.

08/22/2016 - 21:02

లఘు చిత్రం ఏఎస్‌ఎల్ ప్లీజ్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ భీమన. ఒక్క చిత్రానికి పది కోట్ల వ్యూస్ సాధించిన ఆ లఘు చిత్రంతో రామ్ కెరీరే మారిపోయింది. తొలి చిత్రం హమ్‌తుమ్‌తో టాలీవుడ్‌కు వచ్చి, వికెఏ ఫిలిమ్స్ పతాకంపై ‘ఆకతాయి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న
భీమనతో ఈవారం చిట్‌చాట్.
**
మీ నేపథ్యం?

Pages