S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/24/2015 - 23:41

ఫ్లాష్‌బ్యాక్ @ 50
===========

12/18/2015 - 05:06

తెలుగులో హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించినా సరైన కమర్షియల్ బ్రేక్‌ను అందుకోలేకపోయింది అందాల భామ శ్రద్ధాదాస్. పలు చిత్రాల్లో రెండో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భామ ఈమధ్య బాలీవుడ్‌లో కూడా ఓ చిత్రంలో నటించింది. మరోవైపు ప్రత్యేక పాటల్లో నర్తిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా శ్రద్ధాదాస్ ‘డిక్టేటర్’ చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది.

12/18/2015 - 05:05

ఈమధ్యే మెగాహీరో వరుణ్‌తేజ్ సరసన ‘కంచె’ సినిమాలో హీరోయిన్‌గా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాలభామ ప్రజ్ఞాజస్వాల్‌కు ఇప్పుడు టాలీవుడ్‌లో అవకాశాల వెల్లువ ఎక్కువైంది. ప్రస్తుతం ఈ భామకు పలు అవకాశాలు వస్తున్నాయట. తాజా సమాచారం ప్రకారం క్రేజీ హీరో రవితేజ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

12/18/2015 - 05:04

ప్రముఖ తమిళ కథా సినీ రచయిత, సంభాషణలకర్త అయిన
ఎకె వేలన్ తొలిసారి నిర్మాతగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం -తాయి పిరందల్ వాసిపిరక్కు. ఆ చిత్రం విజయం సాధించింది. ప్రముఖ నిర్మాత సుందర్‌లాల్ నహతా, విజయవాడ రామాటాకీసు
అధినేత అశ్వత్థనారాయణ కలిసి తమిళ చిత్రం హక్కులుకొని, శ్రీ ప్రొడక్షన్స్ బేనర్‌పై తెలుగులో నిర్మించిన చిత్రం
మంచి మనసుకు మంచి రోజులు.

12/18/2015 - 04:57

ప్రస్తుతానికి సుక్కూతోనే...

- దర్శకుడు సూర్యప్రతాప్

కరెంట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తాజాగా కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు పల్నాటి సూర్యప్రతాప్. ఈ సందర్భంగా సూర్యప్రతాప్‌తో చిట్‌చాట్...

12/18/2015 - 04:56

జానపద శైలిలో జనరంజక చిత్రాలను నిర్మాతలు నిర్మిస్తే -ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. జగదేకవీరుని కథ, చంద్రహారం లాంటి జానపదాలు ప్రేక్షకులను సినీ స్వర్ణయుగంలో మురిపించాయి. నాగిరెడ్డి, చక్రపాణిల ఆధ్వర్యంలో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించిన కెవి రెడ్డి గొప్ప జానపద చిత్రాలు ఎన్నో నిర్మించారు.

12/18/2015 - 04:55

‘జగదేకవీరుని కథ’ చిత్రం చివరలో ఘంటసాల ఆలపించిన పూర్తి సంగీత భరితమైన ఈ పాట అందరూ ఇష్టపడేదే. శాప కారణంగా రాయిలా మారిన ఓ గంధర్వుడికి శాప విమోచనం చేయడంకోసం రాకుమారుడు సంగీతాన్ని పాడాల్సి వస్తుంది. సంగీతంతో రాళ్లు కరగాలి. పూర్వకాలంలో సంగీతంతో వర్షాలు కురిపించిన మహామహులను గురించి విన్నాం. అదేవిధంగా ఈ చిత్రంలో సంగీతంతో పెద్ద కొండరాయిని కరిగించే సవాలును కథానాయకుడు ఎదుర్కొంటాడు.

12/18/2015 - 04:54

హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు అన్న తేడా లేకుండా ఎవరిమీదైనా పంచ్‌లు వేసే ధైర్యం ఎవరికుంది? అంటే కచ్చితమైన సమాధానం ఎవరైనా చెప్పేది ఒక్కటే. అదే సమంత. సమంతకున్న ధైర్యం ఎవరికీ లేదేమో. గతంలో హీరోలపైనే పంచ్‌లు వేసేసిన ఆమె తాజాగా తనతోటి హీరోయిన్లకు పంచ్ వేసింది. హీరోయిన్లందరూ తమ తల్లులతో సెట్స్‌పైకి వస్తారని, అలాంటిది తనకిష్టం వుండదని చెప్పుకొచ్చింది. ఒకరి సహాయం ఎందుకు?

12/18/2015 - 05:10

గతంలో సినిమా దర్శకుడిని -కెప్టెన్ ఆఫ్ ది షిప్‌తో పోల్చేవారు. నౌకలు నెలల తరబడి సముద్రంలో ప్రయాణం చేస్తాయి. నౌకలో ప్రయాణిస్తున్న వందలాది ప్రయాణికులు, వేలాది టన్నుల సరుకుని సురక్షితంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కెప్టెన్‌దే. అదేవిధంగా ఒక సినిమా నిర్మాణం పూర్తకావాలంటే మొత్తం 24 విభాగాలకు చెందినవారు సమన్వయంతో పనిచేయాలి. వీరందరూ సమష్టిగా పనిచేయడం వల్లనే చిత్ర నిర్మాణం పూర్తవుతుంది.

12/18/2015 - 05:10

జీవిత భాగస్వామిని నిర్ణయించుకొనే సమయంలో ఒకే రంగంలోని యువతీ యువకులు ఇంటివారైతే -చేస్తున్న వృత్తిలోని సాధక బాధకాలు ప్రత్యక్షంగా అర్థం చేసుకుని నిండైన జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి వస్తే స్వర్ణయుగం నుంచే సినిమా దంపతులను చూస్తున్నాం.

Pages