S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/25/2016 - 20:59

తనకు మంచి అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తానంటోంది ఈ గ్లామర్ భామ? ఇంతకీ ఈమె ఎవరో తెలుసా? బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ రూపొందించిన ‘రమణ్ రాఘవ్ 2.0’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఆకట్టుకున్న తెలుగమ్మాయి -మిస్ ఇండియా ఎర్త్ శోభిత ధూళిపాళ. ఆ సినిమాతో ఈ అమ్మడికి చాలానే అవకాశాలు వస్తున్నాయట. గుంటూరుకు చెందిన ఈ అమ్మడు గ్లామరస్‌గా కనిపించేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తుంది.

07/25/2016 - 20:56

1960లో విడుదలైన దేవాంతకుడు తెలుగులో వచ్చిన తొలి సోషియో ఫాంటసీ చిత్రం. బెంగాలీ నవల ‘జమలాయేజీ బంతో మానుష్’ ఆధారంగా సినిమా దర్శక నిర్మాత సి పుల్లయ్య రూపొందించారు. ఎన్టీ రామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన చిత్రంలో అతిథి పాత్రలో యమధర్మరాజుగా ఎస్వీఆర్ ఆకట్టుకున్నారు.

07/25/2016 - 20:53

ఇద్దరుమిత్రులు చిత్రంలో నాయికా నాయకులు ఖుషి ఖుషీగా నవ్వుతూ పాట పాడుతూ చివరిలో ‘హుషారుగా ఉందాములే.. హమేషా మజాగా’ అని ముగిస్తారు.

07/18/2016 - 22:12

‘సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలీదు. కాని, పంచ్ డైలాగ్‌ల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది’ అనే డైలాగ్ ఇటీవల ఒక చిత్రంలో మహేష్‌బాబు పలికాడు. కేవలం పంచ్ డైలాగ్స్ మాత్రమే కాదు. సినిమాల ప్రభావం కూడా జనాల మీద గట్టిగానే ఉంది. ఎందుకంటే ఒక సినిమా రిలీజయితే, తమ కథానాయకుడు ప్రపంచాన్ని జయించాడనే రేంజ్‌లో హీరోలకు పెద్ద, పెద్ద కటౌట్లు పెట్టి, పాలాభిషేకం చేస్తున్నారు అభిమానులు.

07/18/2016 - 22:10

కథ: కె.బాలచందర్
మాటలు, పాటలు: అనిశెట్టి
కళ: ఏకె శేఖర్
ఎడిటింగ్: ఎన్‌ఎస్ ప్రకాశం
నృత్యం: కె తంగప్పన్
కెమెరా: యస్ మారుతీరావు,
సంగీతం: విశ్వనాథం,
రామ్మూర్తి, ఆర్ గోవర్ధనం
నిర్మాత: కాంతారావు పహిల్వాన్
దర్శకత్వం: కృష్ణన్- పంజు

07/18/2016 - 21:12

జంటిల్‌మన్ చిత్రం విడుదలయ్యాక అందరి దృష్టీ హీరోయిన్ నివేదా థామస్‌పైనే పడింది. గ్లామర్‌కి గ్లామర్. నటనకి నటన రెండూ చూపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను, పరిశ్రమను ఆకట్టుకున్న నివేదాథామస్‌కు అవకాశాలు ఎదురొస్తున్నాయి. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

07/18/2016 - 21:06

ఒక్క చిత్రం కూడా ఇంకా తెలుగులో విడుదల కాలేదు. అయితేనేం రెండు చిత్రాల్లో అవకాశాలను ఎగరేసుకుపోయింది అను ఇమ్మాన్యుయేల్. తొలి చిత్రం యాక్షన్ హీరో బిజు అనే మలయాళ హిట్ చిత్రంతో దక్షిణాది సినీ పరిశ్రమను ఒక్కసారిగా తనవైపు చూసేలా చేసుకుంది అను. తొలి చిత్రమే హిట్ అవడంతో తమిళ, మలయాళ చిత్రాల్లో అవకాశాలు జోరుగా వస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ సరసన ఆక్సిజన్ చిత్రంలో అను నటిస్తోంది.

07/18/2016 - 21:05

ఇవ్వాళ వస్తున్న చిత్రాల్లో హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేస్తున్నారు, కాసుల కోసం. గతంలో సినిమాల్లో శృంగార నృత్యాలకు సంబంధించి అక్కచెల్లెళ్లు జయమాలిని, జ్యోతిలక్ష్మి పేరు ముందుగా వినపడేది. అగ్ర హీరోలనుంచి వర్ధమాన హీరోలతో కూడా ఈ సోదరీమణులు నటించి మెప్పించారు. ఒకానొక సమయంలో మీ చిత్రంలో జయమాలిని నృత్యం వుందా? లేకపోతే జతపరచండి అని పంపిణీదారులు డిమాండ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.

07/18/2016 - 21:02

నవ నాగరికతకు కేంద్రం ప్యారిస్ నగరం. అబ్బుర పరచే ఫ్యాషన్లకు జన్మస్థానం. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ‘ఈఫిల్ టవర్’ కనిపించేది ఇక్కడే. ఫ్రాన్స్ దేశ రాజధానే ప్యారిస్ నగరం. మే 11నుండి 22వరకు ఫ్రాన్స్ దేశంలో ‘కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం’ నిర్వహించారు. దీంతో వచ్చే ఆదాయాన్ని ‘ఎయిడ్స్ నిర్మూలనకు వెచ్చిస్తుంది ఆ సంస్థ. ఆ ఉత్సవంలో విరాళాలను దాతల నుంచి సేకరించి ప్రోగు చేస్తుంది ఆ కమిటీ.

Pages