S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/25/2016 - 21:24

ఈవారం వెనె్నల అనుబంధంలో జాతీయ స్థాయి కష్టమా? అంటూ వచ్చిన వ్యాసంలో గత 62 ఏళ్లలో తెలుగు సినిమా ఒకే ఒక్క జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం సాధించుకోగలిగింది అంటూ వ్రాసారు. జాతీయ అవార్డులు ఇచ్చే విషయంలో పైరవీలు, కుళ్లు రాజకీయాలు, ప్రాంతీయ వైషమ్యాలు, పక్షపాత ధోరణి విశృంఖలంగా వున్నాయన్నది జగమెరిగిన సత్యం. రాజకీయంగా ఉపయోగం వుంటేనే అవార్డులు ఇచ్చే సత్సంప్రదాయం పెద్దలలో నెలకొని వుంది.

07/25/2016 - 21:37

ఎంచుకున్న రంగంలో ఒకస్థాయి దాటివెళ్లిన సెలబ్రిటీల గురించి ఏ సమాచారం తెలిసినా అభిమానులకు ఒకింత అపురూపంగానే ఉంటుంది. అదే సనిమా రంగంలో అయితే, ఆ ఆర్థ్రత ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఒక్కోసారి అభిమాన నటుడో, నటో రొటీన్ లైఫ్‌లో ఏం చేస్తుంటుంది, వాళ్ల ఇష్టాయిష్టాలు, లేదూ సినియేతర చిత్రాలు, వాళ్లు వాడిన వస్తువులు, నివాసమున్న ప్రదేశాలు..

07/25/2016 - 21:18

కథ: జీవర్ సీతారామన్
మాటలు: డివి నరసరాజు
సంగీతం: ఎంఎస్ విశ్వనాథం
ఎడిటింగ్: పంజాబి
కళ: ఎకె శేఖర్
నృత్యం: వెంపటి సత్యం, తంగప్పన్
ఫొటోగ్రఫీ: వినె్సంట్, ఎస్ సుందరం
నిర్మాత: ఎవి మొయ్యప్పన్
దర్శకత్వం: కృష్ణన్- పంజు

07/25/2016 - 21:14

ఎప్పటినుంచో తెలుగు చిత్రాలలో అడపాదడపా కనిపిస్తూనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే నటి విష్ణుప్రియ. చూడటానికి కుందనపు బొమ్మలా కనిపించే ఈ అమ్మడికి సరైన వేషాలు పడడం లేదు. హీరో చెల్లెలుగానో, హీరోయిన్ స్నేహితురాలుగానో చాలా సినిమాలు చేసింది. కానీ ఏ చిత్రంలో కూడా సరైన గుర్తింపు రాలేదు. అలాంటి విష్ణుప్రియకు ట్వంటీఫస్ట్ సెంచరీ లవ్ చిత్రంలో హీరోయిన్ వేషం దొరికింది.

,
07/25/2016 - 21:09

సామర్ల వెంకట రంగారావు. జన బాహుళ్యంలో ఎస్వీ రంగారావుగా పాపులరైన ఈ నటుడు మనకు దూరమై దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ దక్షిణాది ప్రేక్షకుల హృదయాలలో చిరంజీవిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆయన నటించిన శాంతి రస పాత్రలను గుర్తుకుతెచ్చుకొంటే బంగారుపాప, పండంటి కాపురం, తాత మనవడు చిత్రాలు మచ్చుతునకలు.

07/25/2016 - 21:03

సినిమా సృజనాత్మక వ్యాపారమే. ఎవ్వరూ కాదనలేరు. అందుకోసమే ఏటా లెక్కకుమించి చిత్రాలు విడుదలవుతున్నా -సంస్కృతీ సంప్రదాయాన్ని, విలువలను నిలబెట్టే సినిమా ఒక్కటీ రావడం లేదన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని నిజం.
**

07/25/2016 - 20:59

తనకు మంచి అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తానంటోంది ఈ గ్లామర్ భామ? ఇంతకీ ఈమె ఎవరో తెలుసా? బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ రూపొందించిన ‘రమణ్ రాఘవ్ 2.0’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఆకట్టుకున్న తెలుగమ్మాయి -మిస్ ఇండియా ఎర్త్ శోభిత ధూళిపాళ. ఆ సినిమాతో ఈ అమ్మడికి చాలానే అవకాశాలు వస్తున్నాయట. గుంటూరుకు చెందిన ఈ అమ్మడు గ్లామరస్‌గా కనిపించేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తుంది.

07/25/2016 - 20:56

1960లో విడుదలైన దేవాంతకుడు తెలుగులో వచ్చిన తొలి సోషియో ఫాంటసీ చిత్రం. బెంగాలీ నవల ‘జమలాయేజీ బంతో మానుష్’ ఆధారంగా సినిమా దర్శక నిర్మాత సి పుల్లయ్య రూపొందించారు. ఎన్టీ రామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన చిత్రంలో అతిథి పాత్రలో యమధర్మరాజుగా ఎస్వీఆర్ ఆకట్టుకున్నారు.

07/25/2016 - 20:53

ఇద్దరుమిత్రులు చిత్రంలో నాయికా నాయకులు ఖుషి ఖుషీగా నవ్వుతూ పాట పాడుతూ చివరిలో ‘హుషారుగా ఉందాములే.. హమేషా మజాగా’ అని ముగిస్తారు.

Pages