S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/21/2016 - 23:54

ఒకప్పుడు ఒక సినిమా థియేటర్‌లో విడుదలయిందంటే.. సైకిల్‌స్టాండ్ వాళ్ల దగ్గర నుంచి హాల్లో టీ, పల్లీలు, సమోసాలు అమ్ముకునేవారి వరకూ హడావుడి కనిపించేది. స్వీట్స్‌బళ్లవారికి, ఆ థియేటర్‌నీ నమ్ముకుని జీవించే ఇతర వ్యాపారస్థులకు విడుదలైన సినిమా కనీసం యాభై రోజుల వరకైనా హౌస్‌పుల్ కలెక్షన్స్‌తో నడుస్తుందనే గ్యారంటి ఉండేది. ఆ ఆనందంతోనే తమ వ్యాపారాలు సంతోషంగా సాగించేవారు.

03/21/2016 - 23:52

వరుణ్‌తేజ్ కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారా అని ఇన్నాళ్లు టాలీవుడ్ ఎదురుచూసింది. ఇప్పుడు ఆ అదృష్టం హేబాపటేల్‌ను వరించడంతో అందరూ ఆమెను ఇప్పుడు మెగాపటేల్ అని సంబోధిస్తున్నారు. ఎందుకంటే మెగా కాంపౌండ్‌లోకి వెళ్లిన మరో హీరోయిన్‌గా గుర్తిస్తున్నారు. మొదట ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కథానాయికగా అనుకున్నారు.

03/21/2016 - 23:50

రీమేక్ సినిమాలకంటే స్ట్రెయిట్ సినిమాల్లోనే కిక్కుంటుంది. స్ట్రెయిట్ సినిమా అంటే నా ఊహ. కనుక ఆసక్తి పుట్టిస్తుంది. అలాగని ఇండస్ట్రీలో అన్నీ మనం ఊహించుకున్నట్టు ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలి అంటున్నాడు కుమార్ నాగేంద్ర. నారా రోహిత్, లతా హెగ్దె జంటగా రూపొందిన ‘తుంటరి’ రీమేక్‌తో మంచి పేరు తెచ్చుకున్న నాగేంద్రతో ఈవారం చిట్‌చాట్.
---
మీ నేపథ్యం?

03/21/2016 - 23:48

స్ర్తి, పురుషుల్లో అనుమానాలు, అపోహలు అవమానాలకు తావుండరాదని తెలియజెప్పే చిత్రమిది. ఆ రోజుల్లోనే మహిళా చిత్రంగా సూపర్ డూపర్ హిట్‌కొట్టింది అమ్మాయిల శపథం. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సత్యనారాయణ, కాంతారావు, రామకృష్ణ, చంద్రమోహన్, లక్ష్మి, చంద్రకళ, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు తమ పాత్రల్లో జీవించారు. ఆత్రేయ కలం నుండి వచ్చిన పాటలన్నీ హిట్టే.

03/21/2016 - 23:46

వేణు హీరోగా నటించిన ‘చిరునవ్వుతో..’ సినిమాలోని ‘సంతోషం సగం బలం.. హాయి నవ్వమ్మా..’ అనే పాట చాలా ఇష్టం. బహుశా ఈ పాటకు నాలాగే చాలామంది అభిమానులు ఉండొచ్చు. చిరునవ్వుతో సినిమా మొత్తం సున్నితమైన హాస్యంతో హృద్యంగా సాగుతుంది. సినిమాలోని అన్ని పాటల్లానే ఈ పాట చిత్రీకరణ కూడా బావుంటుంది. నిరాశలో వున్నవారు ఈ పాట వింటే హాయి అనిపిస్తుంది. పాటలోని పదాలు, చరణాలు మనస్సుకు స్వాంతన, ఓదార్పు ఇస్తాయి.

03/21/2016 - 22:33

రచన:
సముద్రాల సీనియర్
కళ:
టివిఎస్ శర్మ
నృత్యం:
హీరాలాల్, వెంపటి సత్యం
ఎడిటింగ్:
ఎస్‌పిఎస్ వీరప్ప
ఛాయాగ్రహణం:
ఎంఎ రెహమాన్
సంగీతం:
ఘంటసాల
దర్శకత్వం:
కమలాకర కామేశ్వర రావు

03/21/2016 - 22:27

ఎప్పటిల్లాగే ఈ వారం కూడా చిన్న
సినిమాలు అవకాశాలు అందిపుచ్చుకున్నాయి. కానీ సరైన ఆదరణను
పొందలేకపోతున్నాయి. ఈ వారం
సతీ తిమ్మమాంబ, దృశ్యకావ్యం, శివాజీ కథానాయకుడిగా ‘సీసా’, రాజు కుంపట్ల దర్శకత్వంలో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ చిత్రాలతోపాటుగా విశాల్ కథానాయకుడిగా అనువాద చిత్రం ‘కథకళి’ విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో బాక్సాఫీస్‌ను గలగలలాడించే దమ్మువున్న సినిమా ఒక్కటీ

03/15/2016 - 16:01

* యంగ్ హీరో శైలేష్ బొలిశెట్టి

03/15/2016 - 02:07

సంక్రాంతి తర్వాత పుంఖాను పుంఖాలుగా వస్తున్న సినిమాలు సరైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈవారం కూడా దాదాపు 9చిత్రాలు విడుదలైనట్టు రికార్డులు చెబుతున్నాయి.

03/15/2016 - 02:02

తెలుగు సినిమాల్లో నటించడానికి వచ్చిన తెలుగురాని భామలంతా ఒకే ఒక మంత్రాన్ని నేర్చుకొని వస్తున్నారు. ఎందుకంటే ఆ ఒక్కమంత్రం చెప్పేస్తే తెలుగు ప్రేక్షకులు అభిమానులైపోతారని. ఎవరైనా కోచింగ్ ఇస్తున్నారో ఏమో! ఇప్పటికి లతాహెగ్డే పదహారవ అమ్మాయి అయి వుంటుంది. ఎవరొచ్చినా కానీ ఏది ఎలావున్నా, తాను మహేష్‌బాబు ఫ్యాన్‌నని చెప్పుకోవడం ఫ్యాషనైపోయింది.

Pages