S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/15/2016 - 02:02

సహజంగా ఓటమి ఎదురైనప్పుడు గెలుపుకోసం చేసే ప్రయత్నంలో ఎవరైనా సరే రెచ్చిపోవాల్సిందే! ప్రస్తుతం అనీషా ఆంబ్రోస్ పరిస్థితి అలానే ఉంది. అందమైన లుక్‌తో అందర్నీ ఆకట్టుకునే అనీషాకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి, చేజారిపోతున్నాయి. అలియాస్ జానకి చిత్రంలో హీరోయిన్‌గా నటించాక ఒక్కటీ ఆమె ఖాతాలో పడలేదు. ఆ సినిమా ప్రభావమో లేక అమ్మడి జాతక ప్రభావమోగానీ ఒక్కటంటే ఒక్కటీ గుర్తింపు పాత్ర లభించలేదు.

03/15/2016 - 02:01

ఫ్లాష్‌బ్యాక్ @ 50

03/15/2016 - 01:45

1972లో విడుదలైన సంపూర్ణ రామాయణం బాపు దర్శకత్వంలో అద్భుతంగా రూపొందింది. ఉత్తమ విలువలను ప్రదర్శిస్తూ, దర్శక నిర్మాతలు సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా నిర్మించారు. శ్రీరామకథను పెద్దగా వివరించాల్సిన పనిలేదు. శ్రీరాముడు సీతాదేవితో నారచీరలు ధరించి, సరయు నదిని దాటే సమయంలో గుహుడు పాడిన పాట ‘రామయ తండ్రి..

03/15/2016 - 01:47

విశ్వనాథ సత్యనారాయణ నవలా రూపంగా వచ్చిన సినిమా -ఏకవీర’. ఎన్టీఆర్, కాంతారావు, జమున, కెఆర్ విజయలు రెండు జంటలుగా ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ కలంనుండి జాలువారిన పాటలన్నీ ఆణిముత్యాలే. ప్రతీరాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైర గాలి, తోటలో నా రాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఈరాజు నీడ నవ్వెను నేడు. నీ పేరు తలచినా చాలు, ఎదలో పొంగె శతకోటి యమునా తరంగాలు..

03/15/2016 - 01:43

టెలీ సీరియల్స్ నుండి బిగ్ స్క్రీన్‌కి వచ్చిన మోడల్ పరుల్ యాదవ్. ‘్భగ్యవిధాత’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తరువాత కన్నడ సినీ రంగంలో వరుస అవకాశాలు రావడంతో సూపర్‌హిట్ హీరోయిన్‌గా పేరు పొందింది. బెంగుళూరులో నిర్వహించిన పలు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అవార్డులను కైవసం చేసుకొని ఉత్తమ నటిగానూ నిరూపించుకుంది. తరువాత తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తన హవా చూపించింది.

03/15/2016 - 01:42

చిరంజీవి 150వ చిత్రం -పరిశ్రమలో ఉత్కంఠ రేపుతోంది. స్వయంకృషితో మాస్ హీరోగా ఎదిగిన స్టార్. ఫైట్లు పాటలతో అభిమానగణాన్ని సంపాదించుకున్న మెగా. రెండూ కలగలిపి -పెట్టుకున్నదో, సంపాదించుకున్నదో మొత్తానికి ‘మెగా స్టార్’ అయ్యాడు. సామాజిక సేవతో ‘పద్మాన్నీ’ అందుకున్నాడు. ఎదగడానికి ఇనే్నళ్లు కష్టపడిన చిరంజీవి -ప్రజారాజ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో పూర్తిగా చతికిలపడిన సంగతి తెలిసిందే. ‘నాకు గంజి తెలుసు..

03/15/2016 - 01:41

== శ్రీను కోనేటి ==

అబ్బాయి క్లాసు.. అమ్మాయి మాస్ చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించిన కోనేటి శ్రీను, ఏ సినిమాలోనైనా కథలో దమ్ముంటే చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఏ రాజకీయాలు ఆపలేవని చెబుతున్నారు. ఆయనతో
ఈవారం చిట్‌చాట్..

మీ నేపథ్యం?
-మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట వద్ద లింగాల మా ఊరు. డిగ్రీ చదివా. సినిమా రంగంలోకి రావడానికి నాన్న ప్రోత్సాహమే కారణం.

03/15/2016 - 01:39

తెలుగులో ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రం నిర్మించేటప్పుడు టైటిల్స్‌లో ఎవరి పేరు ముందు, ఎవరి పేరు వెనుక వేయాలోనన్న సందేహం వచ్చిందట. అందరూ గొప్పనటులే కనుక -సమస్యకు పరిష్కారం చూపలేక కేవలం పేకముక్కలపై నటీనటుల బొమ్మలు వేసి సరి అనిపించుకున్నార్ట. కానీ టైటిల్స్ విషయంలో ఎలాంటి సంశయం లేకుండా మరొక పాత్రధారి పేరును డైరెక్ట్‌గా వేసినా ఎవరి నుంచీ అభ్యంతరం రాలేదు. ఆ చిత్రం గుండమ్మ కథ.

03/15/2016 - 01:38

ఈమధ్య కాలంలో ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్న హీరోయిన్ రెజీనానే. ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ వాలిపోతోంది. ఇటీవల చీరలమ్ముతానంటూ తిరిగింది. అది కూడా ఓ మంచి కాజ్ కోసం చేస్తున్నానని చెప్పింది. ఇవన్నీ ఎందుకూ? అన్న డౌట్ సాధారణంగా ఎవరికీ రాదు. ఎందుకంటే -ఆమెకు మంచి హిట్‌పడి చాలాకాలమైందన్న విషయం చాలామందికి తెలుసు కనుక.

03/07/2016 - 23:13

అవినీతిని నిలదీసిన అబలగా, విధిని, పోలీసు అకృత్యాలను ఎదిరించిన మానవతామూర్తిగా రేవతి నటించిన అంకురం సినిమా అంటే చాలా ఇష్టం. ఒక సాధారణ బడిపంతులు కూతురు అత్తారింటికి వెళ్లడం కోసం రైల్లో ప్రయాణిస్తుంటే సత్యం అనే గిరిజనుడు తన చంటిపాపను ఆమెకు అప్పగించి, నీళ్లకోసం కిందికి దిగుతాడు. తర్వాత అతను రాడు, పాపను తీసుకోడు. ఆ పాపను తండ్రికి అప్పగించాలని ఆమె పొందిన తపనే ఈ చిత్ర కథాంశం.

Pages