S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/27/2019 - 20:00

చెన్నై టి.నగరు బజోల్కారోడ్‌లో ‘లక్ష్మీనిలయం’.. బ్రహ్మముహూర్తం వేళ మూడుగంటలకే కాంతులు పంచుకుంటుంది. ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారకరాముడు అప్పుడే నిద్రలేస్తాడు. నిద్రలేచే సమయానికి వాహినీవారి పహిల్వాన్ వస్తాడు. ఆ పహిల్వాన్ నమ్మకస్తుడు. విజయ వాహినీ స్టూడియో అధినేత నాగిరెడ్డికి, యన్‌టి రామారావుకీ, తర్వాత త్రివిక్రమరావుకి మసాజ్ చేస్తుంటాడు.

07/20/2019 - 20:51

1966లో సురేష్ ప్రొడక్షన్స్‌పై రామానాయుడు నిర్మించిన ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రంలో శ్రీకృష్ణుడు అష్ట్భార్యలతో గడిపే విధానంలో ఒకవైపు శృంగారం, మరోవైపు నారదుని భక్తితత్వాన్ని శ్రీశ్రీ కలం అందించిన తీరు అద్వితీయం.

07/20/2019 - 20:50

అక్కినేని నట జీవితంలో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలన్నీ ప్రేమకథా చిత్రాలే. దేవదాసు, అనార్కలి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం.. ఇలాంటి ఎన్నో ప్రేమ కథా చిత్రాలు ఆయన నటనా ప్రావీణ్యాన్ని రుచి చూపించినవే. దర్శకరత్న దాసరి నారాయణరావు మస్తిష్కం నుంచి పుట్టుకొచ్చిన అతిగొప్ప ప్రేమకథా చిత్రం -ప్రేమాభిషేకం.

07/20/2019 - 20:48

అది 1974.
కాకినాడ సూర్యకళామందిర్‌లో సాంస్కృతిక సమాఖ్యవారి నాటక పరిషత్ పోటీలు జరుగుతున్నాయి. దంటు భాస్కరరావు యంగ్‌మెన్స్ హాపీ క్లబ్ స్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో.. యంయస్ నిర్వహణలో జరుగుతున్నాయి. నాటక పోటీలంటే ఇప్పట్లా ఎవరో నలుగురైదుగురు చిన్నాచితకా కళాకారులు చివరిరోజున రావడం కాదు. విధిగా రచయితలూ, ప్రముఖ దర్శకులూ, ప్రముఖ రంగస్థల కళాకారులు... ప్రముఖ సినీ నటులూ వచ్చేవారు.

07/13/2019 - 21:00

నాకు నచ్చిన పాట, జనం మెచ్చిన పాట.. దాశరథి పాటల పూదోట విరిసిన పాట -దివినుండి భువికి దిగివచ్చె/ దిగివచ్చె పారిజాతమే నీవై నీవై’’... ఈ పాట ‘తేనెమనసులు’ చిత్రంకోసం కవితాశరధి దాశరధి వ్రాయగా.. కెవి మహదేవన్ సంగీతం సమకూర్చారు. గాన గంధర్వుడు ఘంటసాల, పి సుశీలమ్మ ఆలపించగా.. అప్పుడే తెరమీదకి తెచ్చిన రామ్మోహన్... తెరమీదకొచ్చిన సంధ్యారాణిలపై ఆదుర్తి సుబ్బారావు చిత్రీకరించారు.

07/13/2019 - 20:58

సురేష్ సంస్థని దశాబ్దాలుగా నిలదొక్కుకునేలా చేసిన చిత్రమిది. సురేష్ సంస్థ అధినేత రామానాయుడు కలలని సాకారం చేసిన చిత్రం. ఈ చిత్రానికి కథ కోడూరి కౌసల్యాదేవి నవల ఆధారమైతే, మనసుకవి ఆచార్య ఆత్రేయ సంభాషణలు, పాటలు కథాకథనంలో పటుత్వాన్ని కల్గించాయి అనడం ఎంతమాత్రం అతిశయం కాదు. ఈ చిత్ర సారధ్యాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి కెఎస్ ప్రకాశరావు నిర్వహించారు.

07/13/2019 - 20:57

కేమరా రన్నవుతుంది. వేమన బిలంలోకి వెళ్లడం పూర్తయింది. చూసిన సందర్శకుల కళ్లమ్మట ధారాపాతంగా కన్నీరు. అలా ఎంతసేపు కేమరా రన్ అయిందో తెలీదు. తర్వాత తేరుకొని కళ్లు తుడుచుకుంటూ కట్ చెప్పేరు కెవి రెడ్డి.

07/13/2019 - 20:41

ఒకే కథవున్న సాంఘికాలు మళ్లీమళ్లీ చిత్రాలు (బ్రతుకుతెరువు, భార్యబిడ్డలు)గా రావడం అరుదు. కాని, పురాణకథలు, జనపదాలూ మళ్లీమళ్లీ వచ్చిన ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. గొల్లభామ, మంగమ్మ శపథం, అపూర్వ సహోదరులు వంటి కొన్ని కథలు పునర్జన్మ ఎత్తాయి. అయతే జానపద కథల్లో అగ్ర తాంబూలం బాలనాగమ్మది. మొదటిసారిగా జెమినీ సంస్థ బాలనాగమ్మ (1942)తీసిన ఏడాదిలోనే ఇంకో బాలనాగమ్మ, శాంత బాలనాగమ్మ పేరిట వచ్చింది.

07/06/2019 - 20:41

ముత్యాలముగ్గు. బాపు-రమణల రూపకల్పనలో కథా కథన సంవిధానం వినూత్నపంథాలో నడిచింది. కథకి సంభాషణలు, సన్నివేశాలు ఒకతీరైతే, ఇందలి పాత్రలు ఇంకొక తీరై మొదట్లో సామాన్య ప్రేక్షకుడి నాడికి అందలేదు. ఆ తర్వాత మక్కువ ఏర్పడి బాపు-రమణల కృషిని ఇనుమడింప చేశారు. శతాధిక చిత్రాలవైపు దూసుకెళ్లి, ఆర్థికంగా నిర్మాతలను అబ్బురపర్చింది.

07/06/2019 - 20:40

‘బుజ్జి బుజ్జి పాపాయి/ బుల్లిబుల్లి పాపాయి/ నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెనె్నలలోయి...’ అనే పల్లవితో ప్రారంభమై ప్రేక్షకులందరి ఎదలను ఊయలలూగించింది -ఆడబ్రతుకు చిత్రంలోని ఓ పాట. ఈ గీత రచన ఆచార్య ఆత్రేయ. స్వర కూర్పు -సంగీత యశస్వి ఎంఎస్ విశ్వనాథన్. వేదాంతం రాఘవయ్య దర్శక సారథ్యంలో జెమిని సంస్థ నిర్మించింది ఆడబ్రతుకు చిత్రాన్ని.
చరణాల్లోకి వెళ్తే...

Pages