S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/08/2018 - 20:59

‘చిత్రం’గా మొదలైన తన కెరీర్ వరుస హిట్లతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. శాశ్వతంగా దూరమైనా అభిమానుల హృదయాల్లో ఇంకా బతికే ఉన్నాడు హీరో ఉదయ్‌కిరణ్. ఆయన నటించిన హిట్ చిత్రాల్లో రెండవ చిత్రం ‘నువ్వు నేను’. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలను మనం తెరపై చూసి ఉంటాం. ఈ సినిమా సూపర్ అనేది కథలోను, నటనలోను, డైరెక్షన్ మొదలైన వాటినిబట్టి మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ‘నువ్వు నేను’.

09/02/2018 - 01:02

ఏంటి షాక్ అవుతున్నారా.. ఇన్ని రోజులు తనదైన గ్లామర్‌తో ఘాటు లిప్‌లాక్ సన్నివేశాలతో ఆకట్టుకున్న ఆండ్రియా ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేయనని అంటుంది. ఏంటి ఆండ్రియా ఇలాంటి నిర్ణయం తీసుకుందని షాక్ అవ్వకండి.. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఇకపై గ్లామర్ రోల్స్, లిప్‌లాక్ సీన్స్ చేసేదిలేదని, కేవలం నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటిస్తానని చెప్పుకొచ్చింది.

09/02/2018 - 00:58

విలన్‌గా?

09/01/2018 - 20:41

అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో బ్లూప్లానెట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సిల్లీ ఫెలోస్ ఈనెల 7న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌రావు చెప్పిన విశేషాలు...

09/01/2018 - 20:21

ఈ తరం కుర్రకారుకు పాత సినిమాల్లో పాటలు నచ్చవు. మసుకెక్కవు. సాహిత్య పిపాసులకు కొత్త పాటలు విరక్తి కల్గిస్తాయి. సాహిత్యాభిమానులకు పాత సినిమా పాటలు వీనుల విందుగా విన్పిస్తాయి. అది ఆనాటి రచయితల సాహిత్య మహిమ. గుణసుందరి కథలోని ‘ఈ వనిలో కోయిలనై...’ పాటంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ పాటను రచించే తీరు! టి.జి.కమలాదేవి నటిస్తూ, పాడిన ఈ పాటలో ప్రత్యేకత ఉంది.

09/01/2018 - 20:20

తమిళంలో 1959లో విడుదలై విజయం సాధించిన చిత్రం వీనస్ మూవీస్‌వారి ‘కళ్యాణపరిసు’లో అక్కినేని అతిథి పాత్రను పోషించారు. జెమినీ గణేశన్, బి.సరోజాదేవి ప్రధాన జంట. ఆ చిత్ర నిర్మాతలైన కృష్ణమూర్తి, గోవిందరాజన్, శ్రీ్ధర్‌లు అదే చిత్రాన్ని తెలుగులో పునర్ నిర్మించిన చిత్రం ‘పెళ్ళికానుక’. తమిళంలో అక్కినేని పోషించిన అతిథి పాత్రను జగ్గయ్య పోషించగా అక్కినేని, సరోజాదేవి ప్రధాన నాయకీ నాయకులు.

08/26/2018 - 00:14

సౌత్ క్రేజీ గ్లామర్ గర్ల్ రెజీనా కాసాండ్రాకు ఈమధ్య టైం అస్సలు బాగోలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలు అందుకోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. దాంతో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మధ్యే చంద్రవౌళి అనే సినిమాలో కాస్త గ్లామర్ డోస్ ఓ రేంజ్‌లో పెంచేసి మళ్లీ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నాలు చేసిన ఈ అమ్మడికి ఆ ఆశలు ఫలించాయి. ఎందుకంటే ప్రస్తుతం రెజీనాకు కోలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతున్నాయి.

08/26/2018 - 00:13

ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు సౌత్‌లో కూడా బయోపిక్ సినిమాల హవా ఎక్కువైంది. ఇప్పటికే పలు బయోపిక్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ముఖ్యంగా సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సంచలన విజయంతో ఈ సినిమాలకు క్రేజ్ పెరిగింది. ఇప్పటికే అన్న ఎన్టీఆర్, వై.ఎస్ యాత్ర, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటివారి బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి.

08/26/2018 - 00:11

టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కొరటాల శివ తదుపరి చిత్రంగా మెగాస్టార్‌తో సినిమాకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల ఆ తరువాత ఒకదాన్ని మించి మరో సూపర్‌హిట్ సినిమాలు తెరకెక్కించాడు. తాజాగా మహేష్‌తో భరత్ అనే నేను తరువాత చిరంజీవి కోసం కథను సిద్ధం చేస్తున్న ఆయన, ఆ తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

08/26/2018 - 00:10

లేటెస్టుగా గీతగోవిందం సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్, అర్జున్‌రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకుని క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం విజయ్ అంటే టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంది. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు తమిళ్, హిందీ భాషల్లో కూడా మనోడికి మంచి ఇమేజ్ దక్కింది.

Pages