S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/01/2018 - 20:37

సుదీర్ఘ బాహుబలి తరువాత ఎక్కువకాలం విశ్రాంతి తీసుకున్న దర్శకుడు రాజవౌళి కొత్త ఉత్సాహంతో మొదలెట్టిన బిగ్ ప్రాజెక్టు ఆర్‌ఆర్‌ఆర్. మల్టీస్టారర్‌కు అచ్చమైన నిర్వచనంగా స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌తో స్క్రీన్‌కు ఎక్కిస్తున్న చిత్రమిది. సినిమా షూటింగ్ ఆరంభమైన దగ్గర్నుంచీ ఏదోక విశేషంతో వార్తల్లో కనిపిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ -ఇప్పుడు ఫిమేల్ ఆర్టిస్ట్‌కు సంబంధించి మరో హాట్ న్యూస్‌ను బయటకు వదిలింది.

11/24/2018 - 23:43

చిత్రం..రాశి

11/24/2018 - 20:46

చిరంజీవి రీ ఎంట్రీ ఫిలిం ఖైదీ నెంబర్ 150కు దర్శకత్వం వహించి దాన్ని బ్లాక్‌బస్టర్‌గా మలిచినా ఆ సక్సెస్ క్రెడిట్ వినాయక్ ఖాతాలో పడలేదు. తర్వాత వచ్చిన ఇంటిలిజెంట్ వినాయక్ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీసింది. దాని తర్వాత బాలయ్యతో సినిమా లైన్‌లో ఉందన్నారు. ఇప్పుడు అది కూడా సైడ్ అయిపోయిందట. ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ బాలయ్యతో ‘జైసింహా’ నిర్మించిన సంగతి తెలిసిందే.

11/24/2018 - 20:44

నువ్వు నాకు జతగావుంటే సృష్టిలో ఇక దేనితోనూ పనిలేదంటూ ప్రేమికురాలికి -ఓ ప్రేమికుడు ప్రపోజ్ చేశాడనుకోండి ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. చాలా సినిమాల్లో ఇటువంటి ఎక్స్‌ప్రెషన్స్ చాలా వినొండచ్చు. కాకపోతే శంకర్ తెరకెక్కించిన ఐ -(మనోహరుడు) చిత్రంలో హీరో విక్రమ్ ప్రపోజ్ చేసిన స్టయిల్ వేరు, పాట వేరు. ఆ పాటే -నువ్వుంటే నా జతగా.

11/24/2018 - 20:42

పండుగలు పబ్బాలు, ఫంక్షన్లు వేడుకలు లేదూ ఏదైనా ప్రత్యేక సమయాలు, కాలక్షేపాల్లో అందరూ కూర్చుని హాయిగా చూడదగ్గ చిత్రం -నువ్వునాకు నచ్చావ్. తన కలంతో తెలుగు చిత్రాలకు ఓ కొత్త ఫ్లేవర్‌ను ఆపాదిస్తోన్న త్రివిక్రమ్‌ను గొప్పస్థాయికి తీసుకొచ్చిన చిత్రమైతే, సినిమామీద కసితో వచ్చిన కె విజయ భాస్కర్ ఆరంభంలోనే తన కెరీర్‌కు పెద్ద పీట వేసుకోడానికి అవకాశమిచ్చిన సినిమా.

11/24/2018 - 20:35

బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ఫిజీ దీవుల ట్రిప్ సక్సెసైంది. ఇన్‌స్టాలో అమ్మడి బికినీ ఫొటోలకు కుర్రాళ్లు వెర్రెత్తిపోతున్నారు. వారంపాటు ఫిజీ దీవుల్లో విలాసవంతమైన లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ, పనిలో పనిగా నిరంతర బీచ్ ఫొటో షూట్లతో తన అందాలను సామాజిక మాధ్యమాలకు షేర్ చేసింది. నిజానికి రియా కెరీర్ ప్రస్తుతం అయోమయంలోనే ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు రియా చేయని ప్రయత్నమంటూ లేదు.

11/17/2018 - 20:25

‘ప్రతిఘటన’ చిత్రంలోని ఈ ఎమోషనల్ సాంగ్ వింటున్న ప్రతిసారీ నాలో ఆవేదన, ఆలోచన రేకెత్తుతాయ్. నాలోని ఉడుకునెత్తురు కుతకుతా ఉడుకుతుంది. ముందుకు దూకమంటుంది.
చక్రవర్తి సంగీత సారథ్యంలో అమృత గాయని జానకి- ఆనందామృతంగా ఆలపించిన పాట ఇది. ఆశుకవి తెనాలి రామలింగని సరసన కూర్చోదగిన అర్హత కలిగిన- వేటూరి సుందరరామ్మూర్తి కలం నుండి.. కాదు కాదు అతని హృదయంనుండి అలవోకగా జాలువారిన పాట ఇది.

11/17/2018 - 20:24

సైరా చిత్రంతో బిజీగావున్న చిరంజీవి ఇప్పటికి 150 సినిమాలు దాటాడు. కానీ ఆయన కెరీర్‌లో గొప్ప సినిమాలంటూ ఎంచితే -సగం కూడా ఉండకపోవచ్చు. వాటిలో మంచి సినిమాలను ఏరుకుంటే -వేళ్లపైనే దొరకొచ్చు. అలాంటివాటిలో -పున్నమినాగు సినిమా కచ్చితంగా ఉంటుంది. చిరు సినిమా కెరీర్‌కు పున్నమినాగు -ఓ పెద్ద మలుపు. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.

11/17/2018 - 20:22

ఇటీవలే ఓ సినిమా ప్రమోషన్స్‌లో విశాల్ -వరలక్ష్మితో పెళ్లి వ్యవహారంతోపాటు ఆ రెండో ప్రశ్న కూడా మీడియా వాళ్లు అడిగారు. దర్శకత్వం ఎప్పుడు? అని ప్రశ్నిస్తే తప్పకుండా వచ్చే ఏడాది ఉంటుంది. త్వరలోనే దానిపైనా అప్‌డేట్ అందిస్తానని అన్నాడు. విశాల్ చెప్పినట్టే ఆ అప్‌డేట్ రానే వచ్చింది. ఓ ప్రయోగాత్మక కథాంశంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు.

11/19/2018 - 21:40

మలయాళ హీరోయిన్ మాళవిక నాయర్ తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలలోనే నటించినా ఇంతవరకూ పెద్ద బ్రేక్ అయితే రాలేదు. ఎవడే సుబ్రమణ్యం, కళ్యాణవైభోగమే లాంటి సినిమాలతోపాటు ఈమధ్య మహానటి సినిమాలో జెమిని గణేశన్ భార్య పాత్రలో కూడా నటించి అందరినీ ఆకట్టుకుంది. కానీ మెగా హీరో కళ్యాణ్‌దేవ్‌తో నటించిన ‘విజేత’ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా’లో కూడా ఒక కీలక పాత్ర పోషించింది.

Pages