S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/08/2018 - 22:29

హీరో మహేష్‌బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టబోయే ప్రాజెక్టు -చిత్రమైన కాంబినేషన్స్‌తో తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేష్ చేస్తున్న మహర్షి ప్రాజెక్టు తరువాత -లెక్కల మాస్టారు సుకుమార్‌తో ప్రాజెక్టు చేయనుండటం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు మహేష్ సరసన హీరోయిన్‌ను ఎంపిక చేసిన దగ్గర్నుంచీ -ఈక్వెషన్స్ వినిపించటం మొదలయ్యాయ. ఆ ఈక్వెషన్స్ హీరోయిన్ ఎవరో కాదు, రకుల్‌ప్రీత్ సింగ్.

12/08/2018 - 20:59

కె బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ఇంద్రధనుస్సు’ చిత్రం అమోఘం. ఎన్నో కేంద్రాలలో శత దినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. ఇప్పటికీ, ఎప్పటికీ రేపటి తరానికీ ఈ చిత్రం ఓ ఆణిముత్యమే. కథలో బలానికి నటీనటుల అభినయం తోడైతే, దానికి దర్శకుడి ప్రతిభ జతపడితే సినిమా ఎంత అద్భుతంగా వస్తుందో చెప్పడానికి ఇంద్రధనుస్సు ఓ ఉదాహరణ. అప్పట్లోనే బడ్జెట్‌కు వెనకాడకుండా నిర్మాత ధైర్యంగా ఈ సినిమా తీశాడని చెబుతుంటారు.

12/08/2018 - 20:57

ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ నాకు నచ్చిన సినిమా. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నటరత్న ఎన్టీఆర్‌ల కాంబోలో తొలి సినిమా స్కోప్ చిత్రం. ‘మధుమలై’ అడవుల్లో అదే నేపథ్యంతో నిర్మించిన కుటుంబకథా చిత్రం. ఈ చిత్రంలో రామారావుకి అందించిన క్యాస్ట్యూమ్స్, మేకప్, విగ్గు విభిన్నతరహాలో కొత్త గ్లామర్‌తో కనిపిస్తాడు.

12/08/2018 - 20:56

పెళ్లయతే హీరోయిన్‌గా పనికిరారనే మైండ్‌సెట్‌వున్న సౌత్‌లో పెళ్లి తర్వాత నటించి బ్లాక్‌బస్టర్లు నమోదు చేసింది సమంత. ఈ ట్రెండ్‌ను మిగతా సౌత్ హీరోయిన్లూ ఆదర్శంగా తీసుకుంటారనడంలో సందేహం లేదు. సినిమా నిర్మాణంలోకీ ఎంటరవుతానని ఈమధ్యే వెల్లడించింది శామ్. అంత బిజీలోనూ అప్పుడప్పుడూ హాట్ అండ్ స్టైలిష్ ఫొటో షూట్స్ చేస్తుంది. ఈ ఫొటో షూట్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు అక్కినేని ఫ్యాన్స్ కొందరు.

12/08/2018 - 20:55

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన నూతన చిత్రం 2.0తో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే వరుస సినిమాలతో రెడీ అవుతున్నాడు. రజనీకాంత్ 2.0 తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట షూటింగ్ పూర్తిచేసిన రజనీ, మరో కొత్త సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.

12/08/2018 - 20:53

గ్లామర్ షో.. లిప్‌లాక్‌లకు సై అనడం- ఇవన్నీ కథ డిమాండ్ మేరకే ఉంటాయని కొందరంటారు. కానీ మరికొందరేమో కథ డిమాండ్ చేసింది అనేస్తారు. ఏదేమైనా లిప్‌లాక్ విషయంలో చాలామంది హీరోయిన్లు టెంప్ట్ అవుతున్నారు. తాజాగా తమన్నా ఇపుడు అలాంటి రాగమే అందుకుంది. తెలుగు సినిమాలో ప్రస్తుతం బోల్డ్ కంటెంట్ ట్రెండ్ నడుస్తోందని.. ఇదో మంచి మార్పు అని చెబుతోంది.

12/08/2018 - 20:41

పెద్ద హీరోలతో ప్రాజెక్టు చేయాలంటే -ముందు హీరోయిన్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తోంది. అందులోనూ చిరంజీవిలాంటి సీనియర్‌తో ప్రాజెక్టు చేయాలంటే -హీరోయిన్ ఆప్షన్లు చూసుకోవాల్సిందే. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఆదరణ ఉన్న హీరోయిన్లనూ చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటివారిలో నయనతార, అనుష్క, త్రిష, శ్రీయ మాత్రమే సీనియర్ హీరోయిన్లు కనిపిస్తున్నారు.

12/01/2018 - 20:52

‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ బ్యానర్‌లో వచ్చిన ఓ మంచి చిత్రం -మంచి మనుషులు. ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులోని పాటలు మరో ఎత్తు. కారణం పాటలన్నీ హిట్ సాంగ్స్. అందుకే -ఈ సినిమాలోని పాటలన్నీ నాకు చాలా చాలా ఇష్టం. వాటిల్లో మరీ మరీ ఇష్టమైన పాట -నిన్ను మరిచిపోవాలని. ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన ఈ పాటను గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన తీరు, మామ కేవీ మహదేవన్ బాణీ కట్టిన విధానం అమోఘం.

12/01/2018 - 20:51

హీరో రాజశేఖర్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ గొప్ప చిత్రం -అంకుశం. ఇంచుమించు 30 ఏళ్ల క్రితంవచ్చిన ఈ సినిమా -నా జీవితాన్ని ప్రభావితం చేసిన సినిమాల్లో ఒకటని చెప్పాలి. అంకుశంలో రాజశేఖర్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉదాత్తత -నన్ను ఆ డిపార్ట్‌మెంట్‌కు నడిపించకపోయినా ప్రభుత్వ సర్వీసులో నిలిపేలా చేసిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించను. అందుకే -ఈ సినిమా నాకు చాలా ఇష్టం.

12/01/2018 - 20:49

తెలుగు తెరకు కొత్తందాలు కొత్త కాదు. ఒక్కో సినిమాలో ఒక్కొక్కరికి అవకాశం దక్కుతున్నా నిలదొక్కుకుంటున్న వాళ్లే తక్కువగా కనిపిస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ మోహన్ భగత్ హీరోగా నిర్మితమవుతున్న చిత్రం ‘కనకం 916 కేడియమ్’. రాకేష్ పోతాప్రగడ దర్శకుడిగా పరిచయమవుతుంటే, మోహన్‌కు జోడీగా వైశాఖి బోనం అరంగేట్రం చేస్తోంది. ఈ కొత్తందం ఎలాంటి క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి.

Pages