S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/29/2018 - 04:35

సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటేనే స్టయిల్. ఆయన సినిమాల్లోని స్టయల్ కోసమే మాస్ జనాలు ఎక్కువగా ఆరాటపడతారు. అలాంటి స్టయిల్‌తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న చిత్రం నరసింహ. నా దారి రహదారి అంటూ రజనీ చెప్పిన మేనరిజమ్స్ ప్రేక్షకుల్లో ఓ రేంజ్ క్రేజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ రజనీతో పోటీపడి మార్కులు కొట్టేసింది.

07/29/2018 - 04:34

ప్రస్తుతం బాలీవుడ్‌కి దూరంగా కేవలం సౌత్‌లోనే సినిమాలు చేస్తున్నాడు ప్రభుదేవా. హిందీలో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న ఆయనకు అక్కడ బ్రేక్ పడింది. దాంతో కాస్త గ్యాప్ ఇవ్వాలని సౌత్‌పై ఫోకస్ పెట్టాడు. ఇక తమిళంలో ప్రభుదేవా సినిమాలంటే పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. దర్శకుడిగా కూడా ఆయన అదే తరహా సినిమాలే చేసాడు.

07/28/2018 - 19:23

పద్మాలయ వారు 1972లో నిర్మించి విడుదల చేసిన మహోన్నత కుటుంబ కథా చిత్రం ‘పండంటి కాపురం’! అమోఘ విజయాన్ని సాధించిన ఈ చిత్రంలో అతిరథ మహారథులందరూ నటించారు. ముఖ్యంగా జమున పోషించిన మాలినీదేవి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆమెపై చిత్రీకరించిన పాట ‘మనసా కవ్వించకే నన్నిలా!’ ప్రాణాధికంగా ప్రేమించినవాడు తనను సర్వనాశనంచేసి మోసగించాడన్న అపార్థపు నేపథ్యంలో చిత్రీకరించబడిన పాట!

07/28/2018 - 19:22

మానవ సంబంధాల మనోహర దృశ్యకావ్యం లేతమనసులు. మనోహార దృశ్యకావ్యం అని ఎందుకు అన్నానంటే భార్యాభర్తలు, పిల్లలు, అత్తామామలు- వీరిమధ్య అనుబంధం అజరామరంగా ఉండాలి. అరమరికలు లేకుండా ఉండాలి. అలాంటి కథను ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వాళ్లు ఎన్నుకుని డి.వి.నరసరాజుగారి చేత మాటలు రాయించుకుని, ఎం.ఎస్.విశ్వనాథన్ చేత సంగీతం సారథ్యంలో అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రం ‘లేత మనసులు’.

07/21/2018 - 19:21

తెలుగు సినిమా పాటలు ఎన్నో మధురమైనవి వున్నాయి. వాటిలో ఒక చెల్లిని ఓదారుస్తూ అన్నయ్య పాడే ‘ముద్దుల మావయ్య’ చిత్రంలో ‘మావయ్య అన్న పిలుపు’ పాట నాకు చాలా నచ్చిన పాట. ఈ పాటలో చెల్లిని వర్ణిస్తూ అన్నగా బాలకృష్ణగారు అభినయించే సన్నివేశం ప్రతి ఒక్క చెల్లెమ్మకూ కంట తడి పెట్టిస్తుంది. చెల్లెలుగా సీత నటన అపూర్వం. ‘అరచేత పెంచాను చెల్లిని...

07/21/2018 - 19:19

గత కాలంలో అధికంగా ప్రజాదరణ పొందిన నాటక రాజం ‘కృష్ణతులాభారం’. ఒకానొక కాలంలో ‘కృష్ణుడంటే రఘురామయ్య’ అనే నానుడి తెలుగు ప్రేక్షకులలో ఉండేది. అప్పట్లో ఈ నాటకం ప్రదర్శించినపుడు కృష్ణుడు ఒకవైపు కూర్చొన్నప్పుడు ఏవో బరువులు ఉన్నట్టుగా ఒక పెట్టెను రెండోవైపు ఉంచి తూగకపోవడంతో రుక్మిణి తులసిదళం వేయగానే కృష్ణుడు తటుక్కున లేచి నిలబడేవాడు. అప్పట్లో ఇప్పటిలా గ్రాఫిక్ ఫొటోగ్రఫీ ఉండేదికాదు.

07/14/2018 - 19:38

ప్రస్తుతం పరిస్థితుల్లో మూడురోజులు సినిమాలు ఆడడమే గగనం అవుతున్న ఈరోజుల్లో ఏకంగా 15 సెంటర్స్‌లో వంద రోజుల సినిమా ఇచ్చాడు సుకుమార్. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం అటు వంద రోజులు పూర్తిచేసుకోవడంతోపాటు నాన్ బాహుబలి రికార్డులో టాప్ సినిమాగా నిలిచింది. దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా రామ్‌చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

07/14/2018 - 19:36

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సమంత.. ఈమధ్య తన ప్రతిభను చాటుకునే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కన్నడ రీమేక్ యూటర్న్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంది. ఈ సినిమాలో సమంత కీరోల్‌లో కనిపిస్తుంది. ఈ సినిమాతోపాటు సమంత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది అదికూడా కొత్త దర్శకుడితో.

07/14/2018 - 19:34

అందాల భామ కాజల్‌కు ఈమధ్య బాగా సినిమాలు తగ్గాయి. వరుసగా స్టార్ హీరోలతో జోడీకట్టి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్‌కు ఈమధ్య వరుసగా పరాజయాలు పలకరించడంతో ఈమెకు కొత్త అవకాశాలు తగ్గాయి. అటు తమిళంలోనూ పరిస్థితి అలాగే మారడంతో ఇపుడు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో వుంది.

07/14/2018 - 21:39

బాలీవుడ్ బాద్షాకు ఈమధ్య కెరీర్‌పరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు చేస్తున్న సినిమాలన్నీ కమర్షియల్‌గా సక్సెస్ కావడంలేదు. దాంతో క్రేజ్ కూడా బాగా తగ్గింది. ప్రస్తుతం జీరో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరుగుజ్జు పాత్రలో షారుఖ్ కనిపిస్తాడట. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఆయన స్పేస్ పైలెట్ రాకేష్‌శర్మ బయోపిక్‌లో నటిస్తున్నాడు.

Pages