S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/05/2018 - 00:25

మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పేస్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని రామేశ్వరంలో జరుగుతుంది. తెలుగులో స్పేస్ చిత్రంగా రూపొందే ఈ సినిమాలో వరుణ్‌తేజ్ వ్యోమగామిగా కనిపిస్తాడట. ఘాజి చిత్రంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న సంకల్ప్‌రెడ్డి తన తదుపరి చిత్రంగా మరో ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

08/04/2018 - 20:38

ఆయన కలంలో గళం విప్పి ఎగిరేంత బలం వుంటుంది.. ఆయన పదాలలో ఎవ్వరినైనా కట్టిపడేసే పదునుంటుంది.. నిత్యం పెదాలపై చిరునవ్వుంటుంది.. ఎప్పుడైనా.. ఎక్కడైనా, ఏదైనా.. ఎలాగైనా రాయగల సామర్థ్యం ఉంటుంది. గుండెల నిండా పొంగిపొర్లే ధైర్యం ఉంటుంది. అది విప్లవమైనా, జానపదమైనా, దేశభక్తి, మెలోడీ, సెంటిమెంట్ ఇలా.. ఏదైనా ఆయన రాస్తే.. ఆ పాట శిఖరం చేరాల్సిందే. జేజేలు కొట్టాల్సిందే.. అబ్బో అదుర్స్..అనాల్సిందే..

08/04/2018 - 20:13

కొమ్మకొమ్మకో సన్నాయి.. అనే వేటూరి పాట గోరింటాకులో అద్భుతంగా ఆవిష్కరించబడింది.
స్వరాల మామ కె.వి.మహదేవన్ అద్భుతంగా సంగీతాన్ని అందించిన పాట. ఇక సుశీల, బాలుగార్ల సంగతి చెప్పేదేముంది? తమ గానమధురిమతో ఆ పాటను గంధర్వ లోకాన్నుండి తీసుకొచ్చినట్లు చేశారు.

08/04/2018 - 20:11

1983 మే 19న విడుదలై అఖండ విజయం సాధించిన ‘బహుదూరపు బాటసారి’ సినిమా అంటే మా కుటుంబ సభ్యులకు చాలా ఇష్టం. అక్కినేని, దాసరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ చిత్రం. అక్కినేనితోపాటు సుజాత, దాసరి నారాయణరావు, రామకృష్ణ, రాజా, భానుచందర్, సుహాసిని, సుమలత, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, ఈశ్వరరావు లాంటి నటులు తమ శక్తివంచన లేకుండా ఈ సినిమాలో నటించి ఈ సినిమాను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు.

07/29/2018 - 04:37

త్రివిక్రమ్‌తో చేసిన అ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్‌కు ఆ చిత్రం మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత ఆయన చేసిన లై, చిన్నదానా నీకోసం, చల్ మోహనరంగ సినిమాలు భారీ పరాజయాన్ని అందుకున్నాయి. దాంతో నితిన్ టెన్షన్‌లో పడ్డాడు. ప్రస్తుతం వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శ్రీనివాసకళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్ తన తదుపరి సినిమా ఎవరితో అన్న ఆలోచనలో పడ్డాడు.

07/29/2018 - 04:35

సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటేనే స్టయిల్. ఆయన సినిమాల్లోని స్టయల్ కోసమే మాస్ జనాలు ఎక్కువగా ఆరాటపడతారు. అలాంటి స్టయిల్‌తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న చిత్రం నరసింహ. నా దారి రహదారి అంటూ రజనీ చెప్పిన మేనరిజమ్స్ ప్రేక్షకుల్లో ఓ రేంజ్ క్రేజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ రజనీతో పోటీపడి మార్కులు కొట్టేసింది.

07/29/2018 - 04:34

ప్రస్తుతం బాలీవుడ్‌కి దూరంగా కేవలం సౌత్‌లోనే సినిమాలు చేస్తున్నాడు ప్రభుదేవా. హిందీలో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న ఆయనకు అక్కడ బ్రేక్ పడింది. దాంతో కాస్త గ్యాప్ ఇవ్వాలని సౌత్‌పై ఫోకస్ పెట్టాడు. ఇక తమిళంలో ప్రభుదేవా సినిమాలంటే పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. దర్శకుడిగా కూడా ఆయన అదే తరహా సినిమాలే చేసాడు.

07/28/2018 - 19:23

పద్మాలయ వారు 1972లో నిర్మించి విడుదల చేసిన మహోన్నత కుటుంబ కథా చిత్రం ‘పండంటి కాపురం’! అమోఘ విజయాన్ని సాధించిన ఈ చిత్రంలో అతిరథ మహారథులందరూ నటించారు. ముఖ్యంగా జమున పోషించిన మాలినీదేవి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆమెపై చిత్రీకరించిన పాట ‘మనసా కవ్వించకే నన్నిలా!’ ప్రాణాధికంగా ప్రేమించినవాడు తనను సర్వనాశనంచేసి మోసగించాడన్న అపార్థపు నేపథ్యంలో చిత్రీకరించబడిన పాట!

07/28/2018 - 19:22

మానవ సంబంధాల మనోహర దృశ్యకావ్యం లేతమనసులు. మనోహార దృశ్యకావ్యం అని ఎందుకు అన్నానంటే భార్యాభర్తలు, పిల్లలు, అత్తామామలు- వీరిమధ్య అనుబంధం అజరామరంగా ఉండాలి. అరమరికలు లేకుండా ఉండాలి. అలాంటి కథను ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వాళ్లు ఎన్నుకుని డి.వి.నరసరాజుగారి చేత మాటలు రాయించుకుని, ఎం.ఎస్.విశ్వనాథన్ చేత సంగీతం సారథ్యంలో అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రం ‘లేత మనసులు’.

07/21/2018 - 19:21

తెలుగు సినిమా పాటలు ఎన్నో మధురమైనవి వున్నాయి. వాటిలో ఒక చెల్లిని ఓదారుస్తూ అన్నయ్య పాడే ‘ముద్దుల మావయ్య’ చిత్రంలో ‘మావయ్య అన్న పిలుపు’ పాట నాకు చాలా నచ్చిన పాట. ఈ పాటలో చెల్లిని వర్ణిస్తూ అన్నగా బాలకృష్ణగారు అభినయించే సన్నివేశం ప్రతి ఒక్క చెల్లెమ్మకూ కంట తడి పెట్టిస్తుంది. చెల్లెలుగా సీత నటన అపూర్వం. ‘అరచేత పెంచాను చెల్లిని...

Pages