S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/09/2019 - 20:30

సరిలేరు నీకెవ్వరు టీం కేరళలో దిగిన గ్రూప్ ఫొటో. షెడ్యూల్ షూట్ ముగిసిన సందర్భంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు.. హీరో మహేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో ఇలా స్టిల్ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలకానున్న ఈ చిత్రంలో సుధీర్ఘ విరామం తరువాత నటి విజయశాంతి ఓ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంటే, తొలిసారి రష్మిక మండన్న మహేష్‌తో జోడీ కడుతోంది.

11/09/2019 - 20:29

కృష్ణ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన విప్లవవీరుని కథ అల్లూరి సీతారామరాజు. 1974లో విడుదలై సంచలన విజయం సాధించింది. భారత ప్రజలను స్వేచ్ఛా స్వాతంత్య్రాలవైపు నడిపించిన ఆయన త్యాగం మరువలేనిది. ఆయన ప్రేయసి సీత అతన్ని వివాహమాడాలని ఎదురుచూసింది. రామరాజు దేశ యాత్రలో వున్నాడు. రాబోయే పౌర్ణమికి వస్తాడన్న అతని మాటనే వేదంగా భావించి ఆయన కోసం ఎదురుచూస్తోంది.

11/09/2019 - 20:27

సకుటుంబ సపరివారంగా చూసి ఆనందించదగిన చిత్రం దసరాబుల్లోడు. జగపతి పతాకంపై విబి రాజేంద్రప్రసాద్ తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి అద్భుతంగా రూపొందించిన సినిమా. అక్కినేని, యస్వీఆర్, వాణిశ్రీ, చంద్రకళలాంటి ప్రధాన తారాగణంతో రూపొందించారు. పల్లెటూరి రైతు కుటుంబాల్లో వుండే సంప్రదాయాలు, విలువలు, అన్నాతమ్ముళ్ళ అనుబంధాలు, వదినా మరిదుల గౌరవభావనలు చూపించే సినిమా.

11/09/2019 - 20:25

బాలకృష్ణ ఎక్కడా తగ్గడం లేదు. వయసు అతని వేషాల ముందు వెలవెలబోతోంది. కుర్ర హీరోలను చాలెంజ్ చేస్తూ.. ‘రూలర్’ మేకోవర్‌తో హల్‌చల్ చేస్తున్నాడు. ఆమధ్య ఫ్రెంచ్ కట్ షేప్‌లో హెలీకాఫ్టర్ నుంచి దిగుతూ స్టైలిష్ మేకోవర్ లుక్కిచ్చిన బాలయ్య -ఇప్పుడు మరింత టీనేజ్ ఎక్స్‌ప్రెషన్‌తో మరో లుక్ బయటకు వదిలాడు.

11/09/2019 - 20:11

సినిమా ప్రపంచంలో మొదటి మాటల సినిమా మీకు తెలుసా? అంతెందుకు ఫస్ట్ డైలాగ్ తెలుసా? ఇప్పటి తీరున చూస్తే.. బహుశ అదే ఫస్ట్ పంచ్ డైలాగ్ కూడా అయవుండొచ్చు. అదేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలుగుతోంది కదూ.. అయతే చదవండి.

11/02/2019 - 21:04

‘ప్రేమలు-పెళ్ళిళ్ళు’ చిత్రంకోసం ఆత్రేయ రాసిన పాట ఇది. ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్వరపరచగా పి.సుశీల, ఘంటసాల గాత్ర సుధ చిందించారు. తెరమీద రేర్ కాంబినేషన్ ఊర్వశి శారద, అక్కినేని నాగేశ్వరరావు కనువిందు చేశారు. లలిత శృంగార జ్వలిత గీతాన్ని మనకందించి ఇప్పటికి కొన్ని దశాబ్దాలైనప్పటికీ.. ఎప్పటికప్పుడు కమనీయంగా, రమణీయంగానే అనిపిస్తుంది ఈ పాట.

11/02/2019 - 21:02

ఏటా ఎన్నో వందల సినిమాలు థియేటర్లకు వస్తుంటాయ. అందులో మనం కొనే్న చూస్తుంటాం. అందులోనూ ఏ కొద్ది సినిమాలో నచ్చుతుంటాయ. ఆ కొన్నింటిలో బాగా గుర్తు పెట్టుకునే చిత్రాలు మరీ కొనే్న ఉంటాయ. అలా నేను గుర్తుపెట్టుకున్న చిత్రాల్లో -‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఒకటుంటుంది. సింగిల్ పాయంట్ స్టోరీయే అయనా పాత్రల చిత్రీకరణతో ఆడియన్స్‌ని కట్టిపడేసిన సినిమా ఇది.

10/26/2019 - 21:02

‘మనసులేని బ్రతుకొక నరకం/ మరువలేని మనసొక నరకం/ మనిషికెక్కడ ఉన్నది స్వర్గం/ మరణమేగా దానికి మార్గం...’ -ఈ పాట సెక్రటరీ చిత్రంకోసం వ్రాసినది. గీత రచయిత ఆత్రేయ. సంగీత స్వరకర్త కెవి మహదేవన్. గాత్రం రామకృష్ణ. అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకత్వ ప్రతిభాశాలి కెఎస్ ప్రకాశరావు. ఇది తెరవెనుక. ఇక తెరపైన అక్కినేని అభినయం ఇటు పండితులని, పామరులని మెప్పిస్తుంది. ఒప్పని ఒప్పిస్తుంది.

10/26/2019 - 21:00

యన్టీఆర్, అక్కినేని కలసి నటించిన తొలి సినిమా. దర్శకుడిగా బిఏ సుబ్బారావుకూ ఫస్ట్ చిత్రం. ఆదినారాయణరావును సంగీత దర్శకుడ్ని చేసిన సినిమా -పల్లెటూరిపిల్ల. ఆదినారాయణరావు స్వయంగా ‘పల్లెసీమ అందమోయి’ అనే పాటనూ వ్రాశారు. మిగతా పాటలు తాపీ ధర్మారావు వ్రాశారు. ఆదినారాయణరావు కూర్చిన బాణీలు ప్రేక్షకులకు వినసొంపయ్యాయ.

10/26/2019 - 20:59

వెండి చందమామలు -పులగం చిన్నారాయణ -వడ్డి ఓంప్రకాష్ నారాయణ
వెల: 50/-
ప్రచురణ: ఫ్లాట్ నెం.89, ఎఫ్-2, రాధాసదన్, బాలాజీ స్వర్ణపురి కాలనీ, మోతీనగర్ దగ్గర, హైదరాబాద్ -500114
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, తెలుగు బుక్‌హౌస్, సాహిత్య నికేతన్, మరియు ప్రముఖ పుస్తక కేంద్రాల్లో
=============================================================

Pages