S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/27/2018 - 21:41

‘షకీలా’ సినిమా వస్తుందంటే చాలు. పెద్ద పెద్ద స్టార్లు కూడా తమ చిత్రాలను ఆమెకు పోటీగా విడుదల చేసేవారు కాదు. అలాంటి షకీలా జీవిత కథ ఇప్పుడు సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా సినీ రంగంలోకి ఎలా వచ్చారు? శృంగార తారగా ఎలా మారారు? సినీ రంగంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు? ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె కథలో చూపించనున్నారు.

10/27/2018 - 21:40

ఎక్కడికి పోతావు చిన్నవాడా? చిత్రంలో నిఖిల్ సరసన ఆత్మ ఆవహించిన ప్రేమికురాలి పాత్రతో అదరగొట్టేసింది నందిత. ఆమె అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. సినిమా ఆద్యంతం నందిత షోతో కట్టిపడేసిందన్న ప్రశంసలూ దక్కించుకుంది. మంచి నటి అన్న ప్రశంసలు అందుకున్న నందిత, మొనే్న వచ్చిన శ్రీనివాస కళ్యాణం చిత్రంలోనూ తనదైన నటనతో మెప్పించి ప్రశంసలు నిలబెట్టుకుంది.

10/27/2018 - 20:23

మనసు పెడితే మణిరత్నానికి మించిన ‘రత్నం’ లేదు -అన్నది అభిమానుల మాట. నిజమే -మామూలు కథని క్లాసిక్ చేయగల సత్తా ఆయనలో ఉంది మరి. అలాంటి మణిరత్నం డిజైన్ చేసిన గొప్ప తెలుగు క్లాసిక్స్‌లో -గీతాంజలి ఒకటి. అందులోని ‘ఆమని పాడవే కోయిలా’ పాటంటే నాకు చాలా ఇష్టం. ఏముంది అందులో..? అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానంగా సినిమా గురించి చెప్పుకోవాలి.

10/27/2018 - 20:21

ఒక సినిమాకు బీఎన్ రెడ్డి నిర్మాతగా పెట్టుబడి పెట్టాడంటే -కచ్చితంగా ఆ సినిమా కథ చక్రపాణి రాసి ఉండాలి. మార్కస్ బార్ట్లె సినిమాటోగ్రాఫరై ఉండాలి. వీళ్లంతా విజయ వాహిని స్టూడియోస్‌లో ఉండుండాలి. నాకు నచ్చిన సినిమా ఈపాటికి రీళ్లు రీళ్లుగా మీకూ గుర్తొచ్చే ఉంటుంది. ఒకవేళ చాలా చిత్రాలే మదిలో మెదిలితే -అందులో ఒకటి మాత్రం కచ్చితంగా ఉంటుంది. అదే -గుండమ్మ కథ.

10/27/2018 - 20:16

సినిమాల్లో స్నేహానికి ప్రతీకలుగా నిలిచి స్నేహితులకోసం స్నేహంకోసం సహాయ సహకారాలు అందించినవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ సినిమాలో తప్పనిసరిగా ‘అలీ’ఉంటాడు. అలాగే రవితేజ నటించే ప్రతి సినిమాల్లో చాలావరకు ‘బ్రహ్మాజీ’, దిల్‌రాజు సినిమాలో ప్రకాష్‌రాజు తప్పనిసరిగా ఉంటాడు. అలాగే తనికెళ్ళ భరణి, ప్రకాష్‌రాజు స్నేహం కూడా చెరిగిపోనిదిగా ఉంది.

10/20/2018 - 22:58

20వ శతాబ్ద పూర్వార్ధంలో కన్ను తెరచి మూడు దశాబ్దాలపాటు సాహిత్య వ్యవసాయం సాగించి తెలుగు సారస్వత ప్రియులకు ప్రాతఃస్మరణీయులైన మేరుగిరి శిఖర సద్యనుడు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ ఆయన పూర్తి పేరుకు హ్రస్వాక్షరాలు.

10/20/2018 - 22:55

చాలామంది ఆడియన్స్ దృష్టిలో సినిమా ఓ వినోదం. ఒకింత రొమాన్స్. ఒక ఐటెంసాంగ్. రెండు డ్యూయెట్లు. నాలుగు ఫైట్లు. కాని ‘కర్తవ్యం’ సినిమాలో ఇవేవీ ఉండవు. విదేశీ చిత్రంలాగ ఒక సంఘటన, అది జరగడానికి దారితీసిన పరిస్థితులు, తగిన పరిష్కారం మాత్రమే మనకు కనిపిస్తుంది. తమిళం నుంచి డబ్బింగ్ అయిన ‘కర్తవ్యం’లో నిరుపేద కూలీనాలీ ఉండే కుగ్రామంలో ఒక చిన్నపిల్ల బోరుబావిలో పడిపోతుంది.

10/20/2018 - 22:53

కొన్ని పాటలు తలలూపే పాటల్లాకాకుండా, తలచుకునేకొద్ది తలరాతను దిద్దుకోమని, బుద్ధిని సరిదిద్దుకోమని హెచ్చరిస్తాయి. కమలహాసన్ నటించిన ‘ఇంద్రుడు- చంద్రుడు’ చిత్రంలోని ‘లాలిజో లాలిజో/ ఊరుకో పాపాయి/ పారిపోనీకుండా పట్టుకో నాచేయి’ పాట నాకు చాలా ఇష్టం. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ రచన, ఇళయరాజా సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గళం.. వెరసి ఆ చిత్రంలో ఈ పాట ఓ అద్భుతం. తప్పులు అందరి జీవితాల్లోనూ ఉంటాయి.

10/20/2018 - 22:51

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత’లో జగపతిబాబు పోషించిన ‘బసిరెడ్డి’ పాత్ర లేకుండా ఊహించుకోవడం కష్టమే. విలనిజంతో మెప్పిస్తున్న జగపతిబాబుతో ఇంటర్వ్యూ...
మీ పాత్రకు వస్తున్న రెస్పాన్స్?
- హ్యాపీగావుంది, మంచి పాత్ర పోషించినందుకు. అందరూ బాగాచేసానని అభినందిస్తున్నారు. మంచి రెస్పాన్స్.
మీ పాత్ర లేకుంటే సినిమా లేదని టాక్ వస్తుంది. మీరేమంటారు?

10/14/2018 - 06:02

బాలీవుడ్ శృంగార తారగా సంచలనం రేపిన సన్నీలియోన్ అంటే క్రేజ్ ఉండని ప్రేక్షకుడు ఎవరూ ఉండరు. ఆమె తమ ప్రాంతానికి వస్తుందంటే చాలు జనాలు ఎగబడిపోవడం ఇదివరకటి అనుభవాలే. అలాంటిది ఇప్పుడు సన్నీలియోన్ అంటే చాలామంది ఫైర్ అవుతున్నారు. సన్నీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, పోర్న్‌స్టార్ నుండి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ తన ఇమేజ్‌ని మార్చుకునే పనిలో ఉంది.

Pages