S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఫ్లాష్ బ్యాక్ @ 50
మాటలు: ఎన్ఆర్ నంది
పాటలు: దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
కూర్పు: కోటగిరి గోపాలరావు
కళ: తోట
నృత్యం: కెఎన్ రెడ్డి
డీవోపీ: కెఎస్ రా
సంగీతం: కెవి మహదేవన్
నిర్మాత: సి సుందరం
దర్శకత్వం: కె విశ్వనాథ్
**
‘కొడుకులు-కోడళ్ళు’ అనే డబ్బింగ్ చిత్రంతో నిర్మాతగా మారిన పి.మల్లిఖార్జునరావు పలు బ్యానర్లపై అనేక చిత్రాలు రూపొందించారు. పలు హిందీ చిత్రాలను రూపొందించిన వీరు 1968లో సుజాత ఫిలిమ్స్ బేనర్‌పై నిర్మించిన చిత్రమే ‘నేనంటే నేనే’.
అక్కినేనికి నివాళిగా.. (20 సెప్టెంబర్ అక్కినేని పుట్టినరోజు )
=========================================
1-7-1912న తాడిపత్రిలో జన్మించి, మద్రాస్‌లో బి.యస్.సి. చదివారు కదిరి వెంకటరెడ్డి (కె.వి.రెడ్డి). తొలుత రోహిణి సంస్థలో, తదుపరి వాహిని సంస్థలో నిర్మాణ వ్యవహారాలలో అనుభవం సంపాదించారు. వాహిని వారి భక్తపోతన (1942). చిత్రానికి తొలిసారి దర్శకత్వం చేపట్టి, అది విజయం సాధించటంతో ఆపైన పలు చిత్రాలు ‘వాహిని, విజయా సంస్థలు రూపొందించిన వాటికి దర్శకత్వం వహించి వాసి గడించారు.
ఇంగ్లండ్‌లోని ప్రముఖ నాటక రచయిత షేక్స్పియర్ 1590, 92 ప్రాంతంలో వ్రాసిన కామెడీ నాటకం ‘ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ’’ (్The taming of the Shrew). ఆ దేశంలో విరివిగా ప్రదర్శింపబడి ప్రశంసలు పొందింది. ఈ నాటకం ఆధారంగా బి.విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో తమ విఠల్ ప్రొడక్షన్స్ బేనర్‌పై 1957లో రూపొందించిన చిత్రం ‘‘వద్దంటే పెళ్ళి’’. చలం, కృష్ణకుమారి ప్రధాన పాత్రలు పోషించగా, సి.ఎస్.ఆర్, రమాదేవి, అమర్నాథ్, జూ.
తమ్మారెడ్డి కృష్ణమూర్తి, కమ్యూనిస్టు పార్టీలో, ప్రజానాట్య మండలిలో క్రియాశీలక పాత్ర పోషించారు. సారధి స్టూడియోలో ఒక దశాబ్దంపైగా వారు రూపొందించిన చిత్రాలకు చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత స్వయంగా చిత్ర నిర్మాతగా మారి, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు రూపొందించారు.
ఎస్.వి.రంగారావు (సామర్ల వెంకట రంగారావు) 03-07-1918న నూజివీడులో సామర్ల కోటేశ్వరరావు, లక్ష్మీ దంపతులకు జన్మించారు. బి.ఎస్.సి చదివి, కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీక్లబ్‌లో పలు నాటకాలు ప్రదర్శించారు. వీరి బంధువు రామానందం నిర్మించిన ‘వరూధిని’ చిత్రం ద్వారా హీరోగా సినీ రంగానికి పరిచయమయ్యారు.
విజయవాడ లక్ష్మీ టాకీస్ థియేటర్ యజమాని, నటులు ఎన్.టి.రామారావు మిత్రులు మిద్దే జగన్నాథరావు తొలుత జలరుహ ప్రొడక్షన్స్‌పై ‘రాజనందిని’ నిర్మించారు. ఆ తరువాత ఎస్.వి.ఎస్. ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్.టి.రామారావు, కాంచన కాంబినేషన్లో వీరు రూపొందించిన చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’. 10-08-1968 విడుదల.
విజయవాడలో మారుతీ టాకీస్ తరువాత నిర్మింపబడిన థియేటర్ లక్ష్మీటాకీస్. ఆ థియేటర్ ప్రొప్రయిటర్స్ మిద్దే రామకృష్ణరావు, మిద్దే జగన్నాథరావులు. థియేటర్ కట్టకముందు డ్రామా హాలుగావున్న లక్ష్మీటాకీస్లో విద్యార్థిగా, కళాశాలలో చదివేటప్పుడు ఎన్.టి.రామారావు ఇక్కడకు వచ్చి ఆ నాటకాల్లో నటించేవారు. మిద్దే సోదరులతో స్నేహం కుదిరిన రామారావు, వారు నిర్మించిన పలు చిత్రాలలో హీరోగా నటించారు.
కారంచేడు గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకన్నచౌదరి, శంభూ ఫిలిమ్స్ పతాకంపై ‘నమ్మినబంటు’, ‘పూజాఫలం’, ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ’ చిత్రాలను రూపొందించారు. వీరి భాగస్వాములలో ఒకరైన యార్లగడ్డ లక్ష్మీనారాయణ, శంభూ ఫిలిమ్స్ బేనర్‌పై, 1968లో నిర్మించిన చిత్రం ‘పంతాలు-పట్టింపులు.’