S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

09/15/2018 - 22:30

తమ్మారెడ్డి కృష్ణమూర్తి, కమ్యూనిస్టు పార్టీలో, ప్రజానాట్య మండలిలో క్రియాశీలక పాత్ర పోషించారు. సారధి స్టూడియోలో ఒక దశాబ్దంపైగా వారు రూపొందించిన చిత్రాలకు చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత స్వయంగా చిత్ర నిర్మాతగా మారి, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు రూపొందించారు.

08/18/2018 - 23:44

ఎస్.వి.రంగారావు (సామర్ల వెంకట రంగారావు) 03-07-1918న నూజివీడులో సామర్ల కోటేశ్వరరావు, లక్ష్మీ దంపతులకు జన్మించారు. బి.ఎస్.సి చదివి, కాకినాడ యంగ్‌మెన్స్ హ్యాపీక్లబ్‌లో పలు నాటకాలు ప్రదర్శించారు. వీరి బంధువు రామానందం నిర్మించిన ‘వరూధిని’ చిత్రం ద్వారా హీరోగా సినీ రంగానికి పరిచయమయ్యారు.

08/11/2018 - 21:57

విజయవాడ లక్ష్మీ టాకీస్ థియేటర్ యజమాని, నటులు ఎన్.టి.రామారావు మిత్రులు మిద్దే జగన్నాథరావు తొలుత జలరుహ ప్రొడక్షన్స్‌పై ‘రాజనందిని’ నిర్మించారు. ఆ తరువాత ఎస్.వి.ఎస్. ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్.టి.రామారావు, కాంచన కాంబినేషన్‌లో వీరు రూపొందించిన చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’. 10-08-1968 విడుదల.

08/04/2018 - 19:55

విజయవాడలో మారుతీ టాకీస్ తరువాత నిర్మింపబడిన థియేటర్ లక్ష్మీటాకీస్. ఆ థియేటర్ ప్రొప్రయిటర్స్ మిద్దే రామకృష్ణరావు, మిద్దే జగన్నాథరావులు. థియేటర్ కట్టకముందు డ్రామా హాలుగావున్న లక్ష్మీటాకీస్‌లో విద్యార్థిగా, కళాశాలలో చదివేటప్పుడు ఎన్.టి.రామారావు ఇక్కడకు వచ్చి ఆ నాటకాల్లో నటించేవారు. మిద్దే సోదరులతో స్నేహం కుదిరిన రామారావు, వారు నిర్మించిన పలు చిత్రాలలో హీరోగా నటించారు.

07/28/2018 - 22:26

కారంచేడు గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకన్నచౌదరి, శంభూ ఫిలిమ్స్ పతాకంపై ‘నమ్మినబంటు’, ‘పూజాఫలం’, ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ’ చిత్రాలను రూపొందించారు. వీరి భాగస్వాములలో ఒకరైన యార్లగడ్డ లక్ష్మీనారాయణ, శంభూ ఫిలిమ్స్ బేనర్‌పై, 1968లో నిర్మించిన చిత్రం ‘పంతాలు-పట్టింపులు.’

07/21/2018 - 19:05

కృష్ణా జిల్లా ఊడ్పుగల్లులో 14-06-1922న జన్మించారు వీరమాచినేని మధుసూధనరావు. ప్రముఖ దర్శకులు యల్.వి.ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు వంటి వారివద్ద సినిమాకు సంబంధించిన పలు అంశాలను అభ్యసించారు. ‘సతీ తులసి’(1959) పౌరాణిక చిత్రంతో దర్శకునిగా తొలి ప్రయత్నం మొదలుపెట్టారు. నాటినుంచి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

07/14/2018 - 21:26

పి.మల్లిఖార్జునరావు, తొలుత ‘కొడుకులు-కోడళ్ళు’ డబ్బింగ్ చిత్రం నిర్మించారు. తరువాత మధు పిక్చర్స్ బేనర్‌పై జ్వాలాదీప రహస్యం, ఇద్దరు మొనగాళ్ళు, ‘మంచి కుటుంబం’, ‘మంచి మిత్రులు’, ‘ఇంటి గౌరవం’, ‘ఇంటి కోడలు’(1974) నిర్మించారు. సునందిని పిక్చర్స్ పతాకంపై 1968లో ‘్భలే మొనగాడు’ రూపొందించారు. ఆ తరువాత హిందీ చిత్రసీమలోను పలు చిత్రాలు రూపొందించి, విజయవంతమైన నిర్మాతగా పేరుపొందారు.

07/14/2018 - 21:25

పోలుదాసు పుల్లయ్య (పి.పుల్లయ్య) నెల్లూరులో 1911లో జన్మించారు. కళల పట్ల ఆసక్తి. బి.ఏ. చదివిన తరువాత, స్నేహితులతో కలిసి, ‘కొలంబియా’వారికి గ్రామఫోను పాటలు పాడారు. మిత్రులతో కలిసి కొల్హాపూర్‌లో స్టార్ కంబైన్స్ అనే ఫిలిం కంపెనీ ద్వారా హరిశ్చంద్ర (1935) నిర్మించారు. కొంతకాలం బొంబాయిలో అనుభవం సంపాదించారు. ఆ తరువాత స్టార్ కంబైన్స్ వారు పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘సారంగధర’ నిర్మించారు.

06/30/2018 - 21:41

1964వ సం.లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉత్తమ చిత్రాలకు, నంది పురస్కారాలు ఇవ్వటం ప్రారంభించింది. అన్నపూర్ణ సంస్థ వారు నిర్మించిన ‘డాక్టరు చక్రవర్తి’ చిత్రానికి నంది పురస్కారం, బంగారు నంది (ఉత్తమ చిత్రంగా) అవార్డు పొందింది.

06/23/2018 - 22:02

శోభనాచల స్టూడియోస్ చిత్ర నిర్మాణ వ్యవహారాలు, నిర్వర్తించే బుగతా అప్పల సుబ్బారావు (బి.ఏ.సుబ్బారావుగా పరిచితులు) 1949లో బి.ఏ.ఎస్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా మల్టీ స్టారర్ చిత్రం ‘పల్లెటూరిపిల్ల’ అక్కినేని, నందమూరి, అంజలిదేవిలతో స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. 1950లో విడుదలైన ఈ చిత్రం ద్వారా ఎన్.టి.రామారావుకు తొలిసారి హీరోగా అవకాశం ఇచ్చారు.

Pages