S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 05:05

హైదరాబాద్, డిసెంబర్ 9: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్‌లోని సహకార చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

12/10/2016 - 05:01

ఒంగోలు,డిసెంబర్ 9:జిల్లాకేంద్రమైన ఒంగోలులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా సూపర్ సక్సెస్ అయింది. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినందుకు నిరసనగా మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు.

12/10/2016 - 04:59

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 9: నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెట్టి బ్యాంక్ నుండి రూ.ఐదు కోట్లు కాజేసిన కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతుంది. ఇందుకు సంబంధించి 12మందిని ఎమ్‌విపిజోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

12/10/2016 - 04:58

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుప్రభావంతో గడిచిన నెలరోజులు నుండి నగదు కోసం ప్రజలు బ్యాంకులు, ఏటిఎం కేంద్రాలు చుట్టూ తిరిగినప్పటికే సమయం సరిపోతుంది. తమ దగ్గర ఉన్న పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసారు. అనంతరం తిరిగి నగదు తీసుకోవడానికి ప్రభుత్వం అనేక ఆంక్షలు విదించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

12/10/2016 - 04:57

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 9: ఎన్టీఆర్ వైద్యాలయానికి గ్రామీణ ప్రాంతాలనుండి అనేక వ్యాధులతో బాధపడుతూ వచ్చే బాధితులకు మెరుగైన వైద్యం అందించి మందులు అందజేయాలని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎన్టీఆర్ వైద్యాలయం సిబ్బందికి సూచించారు.

12/10/2016 - 04:57

నర్సీపట్నం, డిసెంబర్ 9: విశాఖ మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం లంబసింగిలో ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా, శుక్రవారం ఏడు డిగ్రీలు నమోదైంది. చింతపల్లిలో గురువారం 7.5 డిగ్రీలు, శుక్రవారం 8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుఫాన్ వలన ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

12/10/2016 - 04:56

పాడేరు, డిసెంబర్ 9: తమ సమస్యను పరిష్కరించాలని గత ఐదు రోజులుగా ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట రిలే నిరాహర దీక్ష చేపడుతున్న కంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు శుక్రవారం పాడేరు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విధుల్లో నుంచి తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వీరు ఆందోళన చేపడుతున్నారు.

12/10/2016 - 04:56

పాడేరు, డిసెంబర్ 9: ప్రజావాణిలో గిరిజనులు తెలియచేసే సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు.

12/10/2016 - 04:55

కోటవుటర్ల, డిసెంబర్ 9: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిపై స్థానిక పోలీసులు శుక్రవారం దాడి చేసి లక్షా 60 వేల రూపాయల విలువైన 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక ఎస్సై తారకేశ్వరరావు పోలీసు సిబ్బందితో మండలంలో పాములవాక పట్టాలమ్మ గుడి వద్ద కాపు కాసారు. శుక్రవారం ఉదయం ఏజన్సీ అన్నవరం నుంచి ఆటోలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

12/10/2016 - 04:55

విశాఖపట్నం, డిసెంబర్ 9: నిరపేదల ఆరోగ్యంతో టిడిపి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆరోగ్య శ్రీ (ఎన్‌టిఆర్ వైద్య సేవ)ని నిర్వీర్యం చేస్తున్న టిడిపి తీరుపై పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు.

Pages