S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 04:51

నెల్లూరు, డిసెంబర్ 9: పేదలు అప్పులపాలు కాకుండా కాపాడే అద్భుతమైన అరోగ్యశ్రీ పథకానికి నిధులు తగ్గించి దానిని నీరుగార్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుదేనని జిల్లా వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు.

12/10/2016 - 04:47

ఖమ్మం, డిసెంబర్ 9: ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతన్న పంట చేతికొచ్చిన తర్వాత కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమయ్యే సీజన్‌లో కేంద్రం పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో రైతులకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వాణిజ్య పంటలను వేసిన రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.

12/10/2016 - 04:46

విజయపురిసౌత్, డిసెంబర్ 9: అలనాటి చారిత్రక వైభవాన్ని చాటే విధంగా ప్రపంచ పర్యాటక కేంద్రమైన అనుపులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.

12/10/2016 - 04:43

భీమవరం, డిసెంభర్ 9: నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ, దేవస్థానం సంముక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 13 నుంచి జరిగే మావుళ్ళమ్మ అమ్మవారి 53వ వార్షిక మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద పందిరి రాట ముహూర్తం నిర్వహించారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు రామాయణం గోవిందరావుతో ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం పూజా కార్యక్రమాలు చేయించారు.

12/10/2016 - 04:41

రాజానగరం, డిసెంబర్ 9: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై శుక్రవారం వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా నగదు రహిత లావాదేవీలపై ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు.

12/10/2016 - 04:38

చిత్తూరు, డిసెంబర్ 9 : కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీమంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని నిరసిస్తూ వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

12/10/2016 - 04:36

అనంతపురం సిటీ, డిసెంబర్ 9:జెఎన్‌టియూ అనంతపురం 8వ స్నాతకోత్సవం ఈ నెల 28న నిర్వహించనున్నట్లు జెఎన్‌టియూ విసి ఆచార్య ఎంఎంఎం సర్కార్ తెలిపారు. ఈ స్నాతకోత్సవం జెఎన్‌టియూ అడిటోరియంలో 28న ఉదయం 10 గంటల ప్రారంభమవుతుందని తెలిపారు. గోల్డ్ మెడల్స్ అందుకునే ప్రతి విద్యార్థి 9 గంటలలోగా ఆడిటోరంలో ఉండాలని, 27న ఆడిటోరియంలోకి వచ్చేందుకు పాస్‌లు సంబందిత ఆచార్యుల నుండి పొందాలన్నారు.

12/10/2016 - 03:50

విజయవాడ (క్రైం), డిసెంబర్ 9: నడిరోడ్డుపై ‘డ్రంకన్ డ్రైవర్స్’ ట్రాఫిక్ విధులు నిర్వహించారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తాగి రోడ్డుపై విచ్చలవిడిగా వాహనం నడపగా లేనిది.. ట్రాఫిక్ విధులు నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదంటూ జనం నిట్టూర్పు విడిచారు. అసలు విషయానికొస్తే.. తాగి వాహనం నడిపి పోలీసులకు పట్టుబడగా.. కోర్టు వీరికి విధించిన శిక్ష ఇది.

12/10/2016 - 03:49

విజయవాడ, డిసెంబర్ 9: వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాల మంజూరులో బ్యాంకర్లు అధిక ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్యాంకు అధికారులకు సూచించారు.

12/10/2016 - 03:48

విజయవాడ, డిసెంబర్ 9: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యానికి 48 గంటల్లోపే చెల్లింపులు జరగాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

Pages