S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 02:35

హైదరాబాద్, డిసెంబర్ 9: దేశం మొత్తం మీద పనితీరు బాగా కనపరిచిన రెండు అత్యుత్తమ విద్యుత్ డిస్కాంలలో ఆంధ్ర రాష్ట్రంలోని ఈస్టర్న్ పవర్ డిస్కాం ఒకటని కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఇంధన పొదుపు కార్యక్రమం, గృహ విద్యుద్ధీకరణలో వంద శాతం ఫలితాలను సాధించినందుకు ఈ అవార్డు లభించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు.

12/10/2016 - 02:35

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఏపిలో కృషి విజ్ఞాన కేంద్రాలు 23 ఉన్నాయని, అందులో 17 వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 1991 మంజూరు చేసిన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం 2012 నుంచి పనిచేయడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాల తెలిపారు.

12/10/2016 - 02:34

హైదరాబాద్, డిసెంబర్ 9: అక్షయ గోల్డ్ కేసుకు సంబంధించి 17 ఆస్తులు వివాదంలేనివని, వీటిని విక్రయించి వచ్చిన సొమ్ముతో డిపాజిట్‌దార్లకు సొమ్ము చెల్లించగలమని ఆంధ్ర సిఐడి అధికారులు హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు ధర్మాసనానికి సిఐడి 17 ఆస్తుల వివరాలను శుక్రవారం అందించింది. ఈ కేసులో పిటిషనర్ కూడా వివాదం లేని ఆస్తులు 7 ఉన్నాయని హైకోర్టుకు జాబితా ఇచ్చారు.

12/10/2016 - 02:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుపై గొడవ చల్లారకముందే త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించనున్నట్లు కేంద్రం తెలియజేసింది. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని, దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సేకరించడం కూడా ప్రారంభమయిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేవారు.

12/10/2016 - 02:25

హైదరాబాద్, గచ్చిబౌలి, డిసెంబర్ 9: నానక్‌రాంగూడ ప్రమాద ఘటనకు కారణమైన బాధ్యులను వదిలేది లేదని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు ప్రకటించారు. శుక్రవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని అభిప్రాయపడ్డారు.

12/10/2016 - 02:16

ఆదిలాబాద్, డిసెంబర్ 9: కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అంటాడో సినీ కవి. ఆ మాటను ఓ విదేశీ అమ్మ నిజం చేస్తోంది. పేగు తెంచుకుని బిడ్డకు జన్మనిచ్చిన మాతృమూర్తి ఏ కారణం చేతనో పసిగుడ్డును కుప్పతొట్లో వదిలేస్తే, మాతృదేశానికి ఏమాత్రం సంబంధంలేని మహాతల్లి మాత్రం ఆ బిడ్డను భుజానికెత్తుకుంది. అనాధ అన్న ముద్రపడకముందే అక్కున చేర్చుకోవాలని ఐదు రోజులుగా తపన పడుతోంది.

12/10/2016 - 02:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణలో ఖాళీగావున్న మూడు వర్శిటీల వైస్ చాన్స్‌లర్ల నియామకానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విసిల నియామకాలపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

12/10/2016 - 02:10

కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల కష్టాన్ని నిన్నటి వరకూ వౌనంగా భరించిన జనంలో క్రమంగా కాక పెరుగుతోంది. రోజుల తరబడిన కష్టాలు, క్యూలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదన్న

12/10/2016 - 02:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలోని ప్రముఖుల (వివిఐపిల) కోసం 3,600 కోట్ల రూపాయలతో హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శుక్రవారం భారత వైమానికదళ మాజీ ప్రధానాధికారి ఎస్‌పి.త్యాగీని అరెస్టు చేసింది.

12/10/2016 - 01:58

ఒంగోలు,డిసెంబర్ 9: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, గృహనిర్మాణం లాంటి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని, ఆయన మెడలు వంచైనా ఆ పథకాలు అమలు చేయిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Pages