S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 01:00

పెద్దనోట్ల రద్దు రూపంలో నల్లకుబేరులపై ప్రధాని నరేంద్ర మోదీ ‘సర్జికల్ దాడి’ చేశాక దేశ సామాజిక, ఆర్థిక రంగం రూపురేఖలే మారిపోయాయి. నల్లధనం మీద దాడి చేయవద్దని, అవినీతిని అరికట్టవద్దని ఎవరూ అనరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉండే వారు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. గతంలో అధికారం చలాయించినవారూ చాలా నిర్ణయాలు తీసుకున్నారు.

12/10/2016 - 00:58

పెద్దనోట్లను రద్దు చేశాక బడాబాబులు ముందుగానే జాగ్రత్త పడ్డారు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. నగదు కొరత, చిల్లర సమస్యతో పేద, మధ్యతరగతి వారు నానా యాతన అనుభవిస్తున్నారు. చిరువ్యాపారులకు జీవనోపాధి కరవయ్యే ప్రమాదం ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు ఫలితంగా చిల్లర నోట్లను సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో ఈ దుస్థితి ఏర్పడింది. నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద భారీ క్యూలు తప్పడం లేదు.

12/10/2016 - 00:50

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టడం ఇది 23వ సారి. ఎక్కువ పర్యాయాలు ఫైవ్ వికెట్స్ హౌల్ సాధించిన భారత బౌలర్ల జాబితాలో అతను కపిల్ దేవ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నాడు. అనిల్ కుంబ్లే (35), హర్భజన్ సింగ్ (25) మాత్రమే ఈ జాబితాలో అశ్విన్, కపిల్ కంటే ముందున్నారు.

12/10/2016 - 00:47

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 5 వికెట్లకు 288): అలస్టర్ కుక్ స్టెంప్డ్ పార్థీవ్ పటేల్ బి రవీంద్ర జడేజా 46, కీటన్ జెన్నింగ్స్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 112, జో రూట్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 21, మోయిన్ అలీ సి కరుణ్ నాయర్ బి అశ్విన్ 50, జానీ బెయిర్‌స్టో సి ఉమేష్ యాదవ్ బి అశ్విన్ 14, బెన్ స్టోక్స్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 31, జొస్ బట్లర్ బి రవీంద్ర జడేజా 76, క్రిస్ వోక్స్ సి పార్

12/10/2016 - 00:46

ముంబయి, డిసెంబర్ 9: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (31), జొస్ బట్లర్ (76), చివరిలో జేక్ బాల్ (31) కొంత వరకు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించడంతో ఇంగ్లాండ్ 400 పరుగుల మైలురాయిని చేరగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 146 పరుగులు చేసింది.

12/10/2016 - 00:44

గౌహతి, డిసెంబర్ 9: ఇక్కడ జరుగుతున్న జాతీయ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో దేవేంద్రో సింగ్, మనోజ్ కుమార్ తమ అసలు వెయిట్‌కు కాకుండా ఇతర వెయిట్‌లో పోటీపడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శుభారంభం చేశారు. దేవేంద్రో 49 కిలోలకు కాకుండా 52 కిలోల ఫ్లైవెయిట్ విభాగంలో భోజ్‌రాజ్‌ను 3-2 తేడాతో ఓడించాడు. మరో ఫైట్‌లో మనోజ్ 5-0 ఆధిక్యంతో మణికందన్‌ను చిత్తుచేశాడు.

12/10/2016 - 00:44

ముంబయి, డిసెంబర్ 9: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజున తలకు బంతి తగలడంతో స్వల్పంగా గాయపడిన అంపైర్ పాల్ రీఫెల్‌కు విశ్రాంతినివ్వాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయించింది. జెన్నింగ్స్ కొట్టిన బంతిని స్క్వేర్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేసిన భువీ, దానిని వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ వైపు విసిరాడు.

12/10/2016 - 00:42

లక్నో, డిసెంబర్ 9: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో విజయంపై భారత్ కనే్నసింది. మొదటి మ్యాచ్‌ని కెనడాపై 4-0 తేడాతో గెల్చుకొని ఊపుమీద ఉన్న భారత్ శనివారం ఇంగ్లాండ్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. 2011 తర్వాత జూనియర్ హాకీ ప్రపంచ కప్ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు.

12/10/2016 - 00:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: లోధా సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న బిసిసిఐపై తీసుకోబోయే చర్యలను ఖాయం చేయడాన్ని సుప్రీం కోర్టు మళ్లీ వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈనెల 5వ తేదీన తుది తీర్పునిస్తుందని తొలుత అనుకున్నారు. అయితే, టిఎస్ ఠాకూర్ అనారోగ్యం కారణంగా విధులకు హాజరుకాకపోవడంతో కేసు శుక్రవారం నాటికి వాయిదా పడింది.

12/10/2016 - 00:51

మెల్బోర్న్, డిసెంబర్ 9: డేవిడ్ వార్నర్ విజృంభణ న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాకు 117 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సంపాదించిపెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రత్యర్థికి ఆసీస్ వైట్‌వాష్ వేయగలిగింది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి, మూడో వనే్డలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 264 పరుగులు సాధించింది.

Pages