S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 04:13

మోపిదేవి, డిసెంబర్ 3: మోపిదేవి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

12/04/2016 - 04:12

విజయవాడ, డిసెంబర్ 3: కనకదుర్గ ఫ్లైఓవర్ మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఫిబ్రవరి మొదటి వారం నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమా కంపెనీ ఇంజనీర్లను ఆదేశించారు. భవానీపురం వద్ద కాస్టింగ్ యాడ్‌లో నిర్వహిస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌కు సంబంధించిన పనులను శనివారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లా కలెక్టర్ బాబు.ఎతో కలిసి పరిశీలించారు.

12/04/2016 - 04:10

హైదరాబాద్, డిసెంబర్ 3: తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ మోసం చేసే వారిని వెంటాడి, వేటాడి పట్టుకోవాల్సిన పోలీసులే ఓ రాజకీయ నేతతో కుమ్మక్కై తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ వ్యాపారులను మోసగించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పరిధిలోని కాంగ్రెస్ నేత ఒకరు తక్కువ ధరకే బంగారం ఇస్తానని వ్యాపారులకు ఆశ చూపాడు.

12/04/2016 - 04:10

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 3: పట్టణంలో మరో రైతుబజారు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాజుపేట మీ-సేవా కేంద్రం సమీపంలో రైతుబజారును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక 31, 32, 33, 34 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

12/04/2016 - 04:09

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 3: నోట్ల మార్పిడి కేసులో ఓ పోలీస్ అధికారి సహా ముగ్గురు కానిస్టేబుళ్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అనుచరుడు తిరుమలేష్ నాయుడు పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తే 20 శాతం కమీషన్ ఇస్తామని ఆశ చూపాడు.

12/04/2016 - 04:08

కైకలూరు, డిసెంబర్ 3: నియోజకవర్గ ప్రజలంతా తనను ఆశీర్వదించి నాడు గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రజాభీష్టాన్ని గౌరవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు వైద్య, ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి పదవిని ఇచ్చారని, వైద్య ఆరోగ్య శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి సర్కారు దవాఖానాలో పేదలందరికీ మెరుగైన వైద్యమందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య, వైద్

12/04/2016 - 04:08

హైదరాబాద్, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నవ్వులాటగా మారిందని ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని క్యాష్‌లెస్ కాదు జాబ్ లెస్‌గా మారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన అభిషేక్ సింఘ్వి గాంధీభవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.

12/04/2016 - 04:07

సిద్దిపేట, డిసెంబర్ 3: టిఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీల అమలుకోసం కాంగ్రెస్ నేతలు ఈనెల 5న దీక్ష చేస్తామని ప్రకటించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. టిఆర్‌ఎస్ పై విమర్శలు చేయడం సూర్యుని మీద ఉమ్మివేయడమేనన్నారు.

12/04/2016 - 04:07

విజయవాడ, డిసెంబర్ 3: సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఎవరికీ తక్కువ కాదని అవకాశాలు కల్పిస్తే అందలం ఎక్కగలరని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా ఇలా జన్మించామంటూ ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని, ఇతరులను నిందిస్తూ బాధపడవద్దు.. అండగా నేనున్నానంటూ హర్షధ్వానాల మధ్య భరోసా ఇచ్చారు.

12/04/2016 - 04:06

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ, దృష్టి మళ్లించడం, రాగి చెంబులో డబ్బు పెడితే ధనం పెరుగుతుందంటూ అమాయక ప్రజలను మోసగిస్తున్న బెంగళూరు ముఠాను శనివారం సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. రెయిన్ బజార్ పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు ఉండగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుంచి రూ.

Pages