S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/28/2016 - 21:11

‘ముకుంద’ మూవీతో టాలీవుడ్‌ని గోపికమ్మగా అలరించిన బ్యూటీ పూజా హెగ్డే. తర్వాత డైరెక్టుగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పక్కన చాన్స్ కొట్టేసి -పది మెట్లు ఎక్కేసినట్టు ఫీలైంది. మొహెంజొదారో రిజల్ట్ రివర్స్ అవ్వడంతో -మళ్లీ నేల చూపులు చూస్తోందట. చూపించడానికి బోల్డంత్ గ్లామర్ ఉన్నా -అన్నీ హోలీ క్యారెక్టర్లే వస్తున్నాయని గోలపెడుతున్న గోపికమ్మ బెంగను -దువ్వాడ జగన్నాథం తీర్చేయబోతున్నాడట.

11/28/2016 - 08:46

మల్కాజిగిరి, నవంబర్ 27: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారైన ఆనంద్‌బాగ్ చౌరస్తా నుంచి వినాయకనగర్ చౌరస్తా వరకు గల రోడ్డు మార్గం ప్రయాణికులను, వాహనదారులను, పాదచారులను హడలెత్తిస్తోంది. మంచినీటి పైప్ లైన్ పనుల నిమిత్తం జరిపిన తవ్వకాల సమయంలో ఏర్పడ్డ గుంతలను కంకర పౌడర్, కంకర కలిపి గుంతలల్లో వేయటంతో వచ్చిపోయే వాహనాలతో దుమ్ము రేగుతోంది. ఈ దుమ్ము దాదాపు కిలోమీటర్ వరకు దుమ్ము కమ్ముకుంటుంది.

11/28/2016 - 08:45

హైదరాబాద్, నవంబర్ 27: నగరంలోని నెక్లెస్‌రోడ్డులో ఆదివారం ఫ్రీడం 10కె రన్ ఉత్సాహంగా విజయవంతంగా కొనసాగింది. రన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారాకరామరావు విచ్చేసి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహికులు ఈరన్‌లో పాల్గొన్నారు.

11/28/2016 - 08:45

ఖైరతాబాద్, నవంబర్ 27: బ్యాంకుల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశే్వశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన సిండికేట్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ జాతీయ స్థాయి సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు.

11/28/2016 - 08:44

సికిందరాబాద్, నవంబర్ 27: ఎమ్మార్మీస్ ఆధ్వర్యంలో ఆదివారం సికిందరాబాద్ పెరేడ్‌మైదానంలో నిర్వహించిన ధర్మయుద్ధ మహాసభకు భారీఎత్తున జనం తరలివచ్చారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళతోపాటు పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి కూడ ప్రతినిధులు తరలిరావడంతో ఆదివారం సాయంత్రానికి నగరంలోని అన్ని ప్రధాన రహదారులు కిక్కిరిసి పోయాయి.

11/28/2016 - 08:44

హైదరాబాద్, నవంబర్ 27: రాజధాని శివారు ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. పగటిపూట ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. రాత్రిపూట మాత్రం చలి వణికిస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టంగా 31 డిగ్రీలు నమోదవుతుండగా, రాత్రివేల 16 డిగ్రీలుగా నమోదవుతోంది. వారం రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రత 30, కనిష్టంగా 18 డిగ్రీలుగా నమోదు కావచ్చని పరిశీలకుల అంచనా.

11/28/2016 - 08:43

గచ్చిబౌలి , నవంబర్ 27: రెండు రోజులనుండి బ్యాకులకు సెలవులు దానికి తోడు ఏటిఎంలు తెరుచుకోక పోవడంతో హైటెక్ సిటి వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురు, శుక్రవారాలలో కూడా ఆయా బ్యాంకులకు కావలసినంత క్యాష్ సరఫరా చేయక పోవడంతో రెండు వేలకు మించి నగదు ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దుతో కావలసినంత నగదు, చిల్లర దొరకక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

11/28/2016 - 08:42

విజయవాడ, నవంబర్ 27: శ్రీ కన్యకాపరమేశ్వరి సేవా సమితి భవానీపురం శాఖ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం ఆదివారం మహారుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. పున్నమిఘాట్ సమీపంలో జరిగిన ఈ రుద్రాభిషేకంలో శివునికి ప్రీతిపాత్రమైన ద్రవ్యములతో పుణ్యదీపాలాలతో శంఖడమారుక నాదాలతో రుద్రానికి మహారుద్రాభిషేకం, మహాభాస్మాభిషేకం వేలాది భక్తుల నడుమ విశేషంగా జరిగింది.

11/28/2016 - 08:42

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 27: విశ్వబ్రాహ్మణులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని లబ్ధి పొందాలని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. విశ్వబ్రాహ్మణ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వలందపాలెం గంగులతోటలో కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులంతా సంఘటితమై సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు.

11/28/2016 - 08:41

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 27: సంఘటిత శక్తే దేశానికి బలమని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రచారకులు ఆళ్ళ శ్యామ్‌కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక హిందూ కళాశాల ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్ తూర్పు కృష్ణా సాంఘీక్ సభ నిర్వహించారు.

Pages