S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2016 - 08:59

మచిలీపట్నం, నవంబర్ 24: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం తర్వాత ఉత్పన్నమైన చిన్ననోట్ల సమస్యను పరిష్కరించడంలో కేంద్రం ఒకింత విఫలమైంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు చిన్ననోట్ల సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.

11/25/2016 - 08:58

మచిలీపట్నం, నవంబర్ 24: బందరు పోర్టుకు భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా గురువారం ఆయన మండల పరిధిలోని బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం, హుస్సేన్‌పాలెం, చిట్టిపాలెం, గంటలమ్మపాలెం, అరిసేపల్లి, సుల్తానగరం, ఎస్‌ఎన్ గొల్లపాలెం, సీతారామపురం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.

11/25/2016 - 08:58

హైదరాబాద్, నవంబర్ 24: ట్యాంక్‌బండ్ అంటేనే కొద్దిరోజుల క్రితం వరకు గుర్తుకొచ్చేది బుద్ధవిగ్రహం. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అంటే బుద్ధ విగ్రహం సరసన భారీ జాతీయ పతాకం కూడా స్థానం దక్కించుకుంది. ఇపుడు తాజాగా ముంబైలో మాదిరిగా సముద్రతీరంలో కన్పించే లవ్ ముంబై మాదిరిగా అక్షరాలతో ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ శిల్పం దర్శనమివ్వనుంది.

11/25/2016 - 08:57

హైదరాబాద్, నవంబర్ 24: రానున్న ఆర్థిక సంవత్సరానికి(2017-18)కు గాను జిహెచ్‌ఎంసి రూపొందిస్తున్న బడ్జెట్‌పై అధికార యంత్రాంగం తర్జనభర్జన చేస్తోంది. వర్తమాన ఆర్థిక సంవత్సరం 2016-17కు రూ. 5550 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు సుమారు రూ. 143 కోట్లను పెంచుతూ అధికార యంత్రాంగం బడ్జెట్ ముసాయిదాను తయారు చేసింది.

11/25/2016 - 08:56

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయటంతో నగరవాసులు చిల్లర కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నెల 8వ తేదీన వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ ప్రకటించిన ప్రభుత్వం వెంటనే రూ. 500, రూ. 2వేల కొత్త కరెన్సీ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 2వేల నోటును అందుబాటులోకి తేవటంతో ఉన్న నోట్లు చెల్లకపోయే, ఉన్న రూ.

11/25/2016 - 08:56

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్రం రద్దు చేసిన రూ. వెయ్యి, 500 నోట్లకు సంబంధించి నగదు మార్పిడిని బ్యాంకులు,పోస్ట్ఫాసులు నిలిపివేయనున్నాయి. కానీ ఇదే రద్దయిన పాత నోట్లతో ఆస్తిపన్ను బకాయిలు, కరెంటు, వాటర్ బిల్లులతో పాటు రెగ్యులరైజేషన్ ఛార్జీలు, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్‌లు, ట్రేడ్ లైసెన్సు, బిల్డింగ్ పర్మిషన్ అనుమతల ఛార్జీల స్వీకరణ గురువారం అర్థరాత్రి వరకు కొనసాగింది.

11/25/2016 - 08:55

హైదరాబాద్, నవంబర్ 24: ఓ బ్లడ్ బ్యాంక్ లైసెన్సు రెన్యువల్ చేసేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి రూ. 50 వేల లంచం తీసుకున్న ఓ అధికారికి సిబిఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 2 లక్షల జరిమానా విధించింది.

11/25/2016 - 08:52

న్యూఢిల్లీ, నవంబర్ 24: బ్యాంకాక్‌లో శనివారం నుంచి ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ పాల్గొంటుంది. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పాక్‌తో ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు ఆడని కారణంగా భారత మహిళల జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆరు పాయింట్ల కోత విధించడం తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే.

11/25/2016 - 08:51

మెల్బోర్న్, నవంబర్ 24: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌ని మలేసియాపై భారత్ 4-2 తేడాతో విజయభేరి మోగించింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయింది. నిక్కిన్ తిమ్మయ్య రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

11/25/2016 - 08:51

పారిస్, నవంబర్ 24: సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ సాధించడంతో, చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా ప్రీ క్వార్టర్స్ చేరింది. సెల్టిక్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా హీరో మెస్సీ మ్యాచ్ 24, 55 నిమిషాల్లో గోల్స్ సాధించి బార్సిలోనాను టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేయించాడు.

Pages