S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 23:37

విజయనగరం, నవంబర్ 21: కేంద్రం రద్దు చేసిన కరెన్సీ నోట్లతో సహకార బ్యాంకులు ఇరకాటంలో పడ్డాయి. రద్దయిన నోట్లను ఇతర బ్యాంకులలో స్వీకరించేందుకు ఆర్‌బిఐ గడువు విధించినప్పటికీ, సహకార బ్యాంకులలో ఆ నోట్లు చెల్లుబడికావని స్పష్టం చేయడంతో ఇటు రైతులు, అటు సహకార బ్యాంకు సిబ్బంది విలవిలలాడుతున్నారు. జిల్లాలో 34 మండలాల పరిధిలో 94 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి.

11/21/2016 - 23:37

మెరకముడిదాం, నవంబర్ 21: రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగిస్తున్నామని రాష్ట్ర గ్రామీణ అభివృద్ది, గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిణి అన్నారు. సోమవారం మండలంలో గల ఎం గదబవలస, గోపనన్నవలస, ఎం రావివలస తదితర గ్రామాల్లో మండల అధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు ఆద్వర్యంలో జనచైతన్య యాత్రలు జరిగాయి.

11/21/2016 - 23:36

విజయనగరం, నవంబర్ 21: రైతు పంట రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. సోమవారం ఆయన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశం అనంతరం వీడియోకానె్ఫరెన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణాల రీ-షెడ్యూల్ వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని ఆర్‌బిఐని కోరినట్టు తెలిపారు. రైతు రుణాలు, నోట్ల రద్దు, నగదురహిత లావాదేవీలు, రూపేకార్డులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.

11/21/2016 - 23:36

గజపతినగరం, నవంబర్ 21: జిల్లాలో పది వేల మంది నిరుపేదలకు ఉచితంగా దివ్య దర్శనం కల్పిస్తామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్. ఎస్.వి. ఎస్. ఎస్. ప్రసాద్ అన్నారు. సోమవారం గజపతినగరంలోని సీతారామస్వామి గ్రూపు దేవాలయాల ప్రాంగణాన్ని ఎసి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.

11/21/2016 - 23:35

విజయనగరం, నవంబర్ 21: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 14 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ తగాదాలు, కుటుంబ తగాదాలు, ఇతర సమస్యలపై బాధితులు ఎస్పీ ఎల్‌వికె రంగారావు ఎదుట మొరపెట్టుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలపై ఇద్దరు, భూ తగాదాలపై 5గురు, ఇతర సమస్యలపై 7గురు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ సంబంధిత పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

11/21/2016 - 23:35

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 21: ప్రజలకు ప్రత్యామ్నాయం చూపకుండా కేంద్రం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం అన్యాయమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావుఅన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం కేంద్రంలో బిజెపి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శమని అన్నారు.

11/21/2016 - 23:34

కొత్తవలస, నవంబర్ 21: రాష్ట్భ్రావృద్ధిని ఏ దుష్టశక్తి ఆపలేదని, ఆపేవారు భారీ మూల్యం చెల్లించాల్సిందేనని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం ఎల్.కోట మండలంలోని గొల్జాం, సీతారాంపురం, సంతపేట, పితన్నపేట తదితర గ్రామాలలో జన చైతన్య యాత్రలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక ప్రతిపక్షం ఓర్వలేకపోతుందని విమర్శించారు.

11/21/2016 - 23:34

గజపతినగరం, నవంబర్ 21: వచ్చే ఏడాది మార్చినాటికి స్వచ్ఛ గజపతినగరంగా మారుస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు హామీ ఇచ్చారు. సోమవారం గజపతినగరం దిగువ వీధిలో జన చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్య ఉండేదని వ్యాపారులు, పెద్దలు సహకారంతో పరిష్కారించామని చెప్పారు.

11/21/2016 - 23:32

జి.సిగడాం, నవంబర్ 21: మానవుల్లో పేరుకుపోయిన అజ్ఞానమనే చీకటిని తొలగించేందుకు, జ్ఞానజ్యోతిని వెలిగించేందుకు కార్తీకమాస పర్వదినాల్లో దీపం వెలిగిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని మైలారభట్ల వెంకటశ్రీనివాసశర్మ పేర్కొన్నారు. కార్తీక మాసం నాలుగో సోమవారం పర్వదినం సందర్భంగా స్థానిక ఉమారామలింగేశ్వర దేవాలయం ప్రాంగణంలో సుమారు మూడు వేల మంది భక్తులచే జ్యోతులు వెలిగించారు.

11/21/2016 - 23:32

శ్రీకాకుళం, నవంబర్ 21: మత్స్యకారులంతా మార్పును స్వీకరించి, అభివృద్ధికిలోకి రావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రెండో షిప్పింగ్ హార్బర్ కోసం ప్రతిపాదనలు కోరిందని, ఈ మేరకు కలెక్టర్ వాటిని ముఖ్యమంత్రికి సమర్పించినట్టు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియంలో సోమవారం జరిగింది.

Pages