S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/24/2019 - 04:19

పిఠాపురం, మార్చి 23: రాష్ట్రంలో సెజ్ భూములపై తాము అధికారంలోకి రాగానే రైతులతో కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సు మేరకు రైతులకు న్యాయం చేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

03/24/2019 - 04:17

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో ట్యూబర్కులోసిస్ (టీబీ) వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచేందుకు ప్రత్యేక సర్వే చేస్తున్నామని, నివారణకు బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని టీబీ జాయింట్ డైరెక్టర్, స్టేట్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఏ. రాజేశం తెలిపారు.

03/24/2019 - 04:06

పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా శనివారం ఇస్లామాబాద్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో షహీన్-3 క్షిపణి. విన్యాసాల్లో పాల్గొన్న ఎఫ్-16 విమానాలు... పరేడ్‌ను తిలకిస్తున్న మలేషియా ప్రధాని మహతిర్ మహమ్మద్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి.

03/24/2019 - 03:51

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదాయం 2004తో పోల్చితే 2014లో పెరిగిందని బీజేపీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత ఆదాయం పెరిగేందుకు కారణాలేముంటాయని బీజేపీ ప్రశ్నించింది. కాగా కాంగ్రెస్‌పార్టీ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు. కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, 2004లో రాహుల్ గాంధీ ఆదాయం రూ.55 లక్షలు ఉంటే, 2014కు రూ.9 కోట్లకు పెరిగిందన్నారు.

03/24/2019 - 03:49

న్యూఢిల్లీ, మార్చి 23: స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు యువతకు ఆదర్శమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ఇక్కడ ఈ ముగ్గురు వీరుల వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భగత్ సింగ్ ఆలోచనలు, ఆశయాల సాధనకు అంకితభావంతో పనిచేస్తామన్నారు.

03/24/2019 - 03:49

‘షహిదీ దివస్’ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ కాంప్లెక్స్ వద్ద షహీద్ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ విగ్రహాల వద్ద నివాళులర్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ ముగ్గురూ స్వాతంత్య్ర సమర యోధులను అప్పటి బ్రిటిష్ సర్కారు ఇదే రోజున ఉరి తీసింది.

03/24/2019 - 03:47

వాషింగ్టన్, మార్చి 23: తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసే విధానాన్ని అమెరికా శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఈ ఇంధనం యొక్క సామర్థ్యం బాగుంటుందని వారు చెప్పారు. ఆర్కానాస్ వర్శిటీ, ఆర్గోనే్న నేషనల్ ల్యాబ్‌కు చెందిన శాస్తవ్రేత్తలు హెచ్2ఓ (నీరు)ను మరింత విశే్లషించి విచ్ఛిన్నం చేస్తే హైడ్రోజన్ ఇంధనం తయారవుతుందని చెప్పారు.

03/24/2019 - 03:46

ముంబయి, మార్చి 23: ఎల్‌కే అద్వానీ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీలో అతి పెద్ద నాయకుడిగా ఉంటారని బీజేపీ మిత్రపక్షమయిన శివసేన పేర్కొంది. బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత రెండు రోజులకు శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది.

03/24/2019 - 03:45

న్యూఢిల్లీ, మార్చి 23: దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడాలన్న ప్రాంతీయ పార్టీల ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రామ్‌మనోహర్ లోహియా సోషలిస్టు సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ అనైతిక రాజకీయాలకు పాల్పడడం దిగజారుడు తనమేని శనివారం ఇక్కడ నిప్పులు చెరిగారు.

03/24/2019 - 03:44

చైనాలోని జియాంగ్‌సూ ప్రావీన్స్, జియాంగ్‌షుల్‌లో భారీ పేలుడుకు గురైన యాన్‌చెంగ్ కెమికల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియల్ వ్యూ. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి వెళ్లి, మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. చైనాలో అన్ని పరిశ్రమల్లో, ప్రత్యేకించి ఔషధ పరిశ్రమల్లో భద్రతా ఏర్పాట్లు నామమాత్రంగా ఉన్నాయని ఈ సంఘటన స్పష్టం చేస్తున్నది.

Pages