S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 02:44

ఆంధ్రావని జల దిగ్బంధంలో చిక్కుకుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రెండు రోజుల పాటు కురిసిన కుంభవృష్టి ప్రభావం రాష్ట్రాన్ని వరద పాలు చేసింది. పల్నాడు ప్రాంతంలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. వరద నీటికి గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంట నీటి పాలైంది.

09/24/2016 - 03:02

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: తీర ప్రాంత రాష్ట్రాల్లో మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విశాఖలో మూడు రోజులపాటు జరగనున్న ఇండియా, ఇంటర్నేషనల్ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం ఆమె ప్రారంభించారు.

09/24/2016 - 03:21

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్‌లో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌తో ఇప్పట్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) చైర్మన్ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. శనివారం అతను పిటిఐతో మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తున్నదని, ఫలితంగానే ఉరీలోని భారత సైనిక స్థావరంపై దాడి జరిగిందని అన్నాడు.

09/24/2016 - 02:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి కొత్త పరోక్ష పన్నుల విధానాన్ని అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న కేంద్రం శుక్రవారం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా ఇక్కడ సమావేశమవుతున్న జిఎస్‌టి కౌన్సిల్ శుక్రవారం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)నుంచి మినహాయింపునకు ఎంత ఆదాయ పరిమితి నిర్ణయించాలనే దానిపై చర్చించింది.

09/24/2016 - 02:17

మరికొన్ని ఎండలతో, ఇంకా కొన్ని భరింపనలవికాని చలిగాలులతో చేతనం కోల్పోయి వున్నాయి. జగాలకి అకాండ ప్రళయం ఆవిర్భవించింది. ఈ కాశీక్షేత్రం కల్పాంతకాలంలో అయినా కసుగందక వుంటుంది కనుక ఆ ఉత్పాతం ఇక్కడ కనపడదు. మేము అందరం ఈ మహోపద్రవాన్ని ఉపశమనం కోరి అబ్రహ్మణ్యం చేస్తూ పద్మ సంభవుడిని శరణుచొచ్చాం. ఆ బ్రహ్మదేవుడు మాపై కరుణించి, ఈ ఉత్పాతాన్ని తొలగింపగల సమర్థుడు మైత్రావరుణుడు ఒక్కడే.

09/24/2016 - 02:14

తాపమనగా దుఃఖము. లౌకిక జీవనములో మానవుడు మూడు రకములైన దుఃఖములలో మునిగితేలుచుండును. అవి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములు. ఈ తాపత్రయములనుండి బయటపడుటకు నిరంతరము ఏదో ఒక రక్షణ మార్గాన్ని అనే్వషిస్తూనే యున్నాడు. తాపత్రయాలతో ప్రధానమైనది ఆధ్యాత్మిక దుఃఖము. దీనికి బాధ్యత వహించునది మనసు.

09/24/2016 - 02:13

‘‘నాకే అనుకోండి. ఇవాళ మా ప్రిన్సిపాల్ రిజైన్ చేశాడు. కాశీలో వున్న అహోబలరావుగారికి ఫోన్ చేసి చెప్పాను. నన్ను ప్రిన్సిపాల్‌గా ఛార్జి తీసుకోమని చెప్పాడు. ఆయన రాగానే ఆర్డర్స్ ఇస్తానన్నారు..’’ అన్నది ఛాయ.
‘‘కంగ్రాట్స్.. మరి పార్టీ ఎప్పుడు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘దానికేం భాగ్యం.. రాత్రికి రండి..’’ అన్నది ఛాయ.
రాత్రి ఎనిమిదింటికి రణధీర్ వెళ్ళగానే ఛాయ నవ్వుతూ ఆహ్వానించింది.

09/24/2016 - 02:10

చ. ‘అనిల జవంబునం బఱచు నమ్మదనాగ మెదిర్చి క్రమ్మఱిం
చిన పరికాఁడ పోలెఁ గురుసింహవరూధము నిట్లు గ్రమ్మరిం
చునె యితఁ’డంచునుం దగిలి చూపఱు సాల్వ మహీశు విక్రమం
బొనరఁగ నల్గడం బొగడుచుండిరి విస్మయసక్తచిత్తులై

09/24/2016 - 01:40

యుద్ధాన్ని ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. మన దేశంలో మాత్రం న్యూస్ చానెళ్లు ప్రకటిస్తాయి.

09/24/2016 - 01:28

ముంబయి, సెప్టెంబర్ 23: వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో గురువారం ఉరకలేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం చతికిల పడ్డాయి. బ్యాకింగ్ స్టాక్స్ లాంటి ఇటీవల లాభాలు ఆర్జించిన స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మదుపరులు దిగడంతో వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

Pages