S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2016 - 23:56

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 1: కేంద్రప్రభుత్వం పెంచిన పెట్రోలు ధరలకు నిరసనగా సిపిఎం జిల్లాకమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని కోట కూడలిలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఇరవైసార్లు పెట్రోలు ధరలను పెంచి సామాన్య, మధ్యతరగతి వర్గాలపై మోయలేని భారాలు మోపిందని విమర్శించారు.

09/01/2016 - 23:54

ఏలూరు, సెప్టెంబర్ 1: జిల్లాలో ఎవరికైనా లంచం కావాలంటే తానే ఇస్తానని, అయితే తెల్లవారితే ఉద్యోగం ఖాళీ అన్న వాస్తవాన్ని గుర్తించి లంచం అడగాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖ ప్రగతి తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు.

09/01/2016 - 23:54

ఏలూరు, సెప్టెంబర్ 1 : విద్యార్ధులకు భారంగా మారిన బేస్‌మెంట్ పరీక్షలను రద్దు చేయాలని ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, బొడ్డు నాగేశ్వరరావులు డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని రద్దు చేయకపోతే ఆరుగురు పిడి ఎఫ్ ఎమ్మెల్సీలు కలిసి ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. స్థానిక డి ఇవో కార్యాలయం వద్ద గురువారం 13 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ జె ఎసి ధర్నా చేపట్టింది.

09/01/2016 - 23:54

ఆచంట, సెప్టెంబర్ 1: పట్టిన పట్టు విడవకుండా మొక్కవోని దీక్షతో ఆరు కిలోమీటర్లు ఏకధాటిగా నడుస్తూ ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా మండుటెండలో 5 గంటలపాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుకుంటూ వెళ్లి రికార్డు సృష్టించిన ఘనత ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకే దక్కుతుంది.

09/01/2016 - 23:53

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 1: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేసిన సిజేరియన్ ఆపరేషన్ వికటించి పట్టణంలోని సాలిపేటకు చెందిన బంగారు లక్ష్మి (25) మృతిచెందింది. గురువారం మృతదేహంతో ఏరియా ఆసుపత్రి ఎదుట ఆమె కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మి మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

09/01/2016 - 23:52

భీమవరం, సెప్టెంబర్ 1: ఫార్మాలో మార్పులొస్తున్నాయ్. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. రోగులను కూడా దృష్టిలో ఉంచుకుని మరిన్ని పరిశోధనలు చేస్తున్నాం. మైక్రోక్యాప్సిల్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామని ఇథియోపియా దేశం మెకలే విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సుభాష్‌చంద్ర దిండా పేర్కొన్నారు.

09/01/2016 - 23:52

ఏలూరు, సెప్టెంబర్ 1: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాధమిక స్ధాయి నుండే క్రీడలతోపాటు వృత్తివిద్యాకోర్సులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను పటిష్టంగా అమలుచేయాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం పాఠశాలల్లో క్రీడా, వృత్తివిద్యా కోర్సుల ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్షించారు.

09/01/2016 - 23:51

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో వరదలు, కరవు నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా జంగారెడ్డిగూడెంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగిన ఎఐకెఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. బుధవారం సమావేశ తీర్మాన వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

09/01/2016 - 23:51

ఏలూరు, సెప్టెంబర్ 1:ప్రతి మండలంలో, నియోజకవర్గంలో కాపుమేళా ఏర్పాటుచేసి లబ్దిదారులకు వెంటనే రుణాలు అందించి పధకాలను గ్రౌండింగ్ చేసేవిధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం లబ్దిదారులకు ఏమేరకు రుణాలు అందించింది, కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీల మంజూరు తదితర అంశాలపై సమన్వయాధికారులతో ఆయన సమీక్షించారు.

09/01/2016 - 23:50

పోలవరం, ఆగస్టు 1: ప్రాజెక్టు డంపింగ్ యార్డు కోసం సేకరించే భూములకు భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్ లవన్న అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీస్తున్న మట్టిని డంపింగ్ చేసేందుకు ఇటికలకోట గ్రామానికి చెందిన భూములను సేకరించేందుకు గురువారం గ్రామ సభ నిర్వహించారు.

Pages