S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 00:51

హైదరాబాద్, ఆగస్టు 4:గనుల శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించింది. సంవత్సరాల తరబడి ఒకేచోట పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది వల్ల ఇసుక అక్రమ రవాణాతోపాటు ఇతరత్రా జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడానికి సంబంధిత శాఖ మంత్రి కెటిఆర్ నడుం బిగించారు. ఒకేరోజు 93 మంది అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

08/05/2016 - 00:48

హైదరాబాద్, ఆగస్టు 4:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్సెట్-2 లీకేజి కేసులో రెండవ నిందితుడు రాజ్‌గోపాల్ రెడ్డి సిఐడి విచారణలో విస్తుగొలిపే అంశాలు వెల్లడించాడు. ఢిల్లీ కర్నాటక భవన్, బెంగళూరు హోటల్ వౌర్యాలో ఎమ్సెట్-2 లీక్‌పై తాము ‘వ్యూహ రచన’ చేసినట్టు రాజ్‌గోపాల్‌రెడ్డి పోలీసులకు తెలిపాడు.

08/05/2016 - 00:41

రియో డి జెనీరోలో 31వ ఒలింపిక్ క్రీడలు శుక్రవారం ఘనంగా ప్రారంభం కానున్నాయ. మన దేశంలో క్రీడాభిమానులకు ఒలింపిక్స్ అర్ధరాత్రి పండుగ అవుతుంది. బ్రెజిల్ మనకంటే ఎనిమిదిన్నర గంటలు వెనుక ఉండడమే అందుకు కారణం. చాలావరకు కీలక ఈవెంట్లు అక్కడ సాయంత్రం వేళ జరుగుతాయి. ఫలితంగా మన దేశంలో వాటిని అర్ధరాత్రి దాటిన తర్వాతే చూడగలుతాం.

08/05/2016 - 00:39

విజయవాడ, ఆగస్టు 4: రాజధాని అమరావతికి సమీపంలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందడుగు పడింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు సమీపంలోని ముక్త్యాల వద్ద 310 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఇంటిగ్రేటెడ్ మెగా టౌన్‌షిప్.. అమరావతికి ప్రత్యేక ఆకర్షణ కానుంది.

08/05/2016 - 00:38

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఆదేశం మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయంలో టిడిపిపి నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు.

08/05/2016 - 00:37

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలపై చర్చించారు. తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

08/05/2016 - 00:53

ఇస్లామాబాద్, ఆగస్టు 4: సార్క్ దేశాల సదస్సు సాక్షిగా పాకిస్తాన్ ఉగ్ర స్వరూపాన్ని భారత్ తీవ్ర పదజాలంతో ఎండగట్టింది. ఉగ్రవాదుల్ని కీర్తించడం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం తక్షణం కట్టి పెట్టాలని పరోక్షంగానైనా చాలా స్పష్టంగానే పాకిస్తాన్‌కు తేల్చిచెప్పింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్న 26/11, పఠాన్‌కోట్ దాడుల్ని ప్రస్తావించింది.

08/05/2016 - 00:33

హైదరాబాద్, ఆగస్టు 4: కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జలకళ ఉట్టిపడుతోంది. నిన్నమొన్నటి వరకు కృష్ణా నదిలో పుష్కర స్నానాలు ఆచరించడానికి నీటి లభ్యత లేని పరిస్థితి నుంచి నది గట్లు వరద తాకిడికి తట్టుకోలేనంతగా వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది.

08/04/2016 - 23:59

హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 4: చేనేత కార్మికులు ఆధునిక కాలంలోనూ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారని, వారి బతుకులు మారాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో గురువారం కమలాపూర్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వసతుల సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

08/04/2016 - 23:59

జగిత్యాలటౌన్, ఆగస్టు 4: మనోహరబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్‌ను ఉత్తర బారత రైల్వేలైనుకు కలిపే విధంగా సిఎం కెసిఆర్ చొరవచూపాలని సిఎల్‌పి ఉపనేత జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి సిఎం కెసిఆర్‌కు వినతి చేసారు.

Pages