S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 23:58

గోదావరిఖని, ఆగస్టు 4: శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు... కడెం ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న భారీ ఇన్‌ఫ్లోతో ఎల్లంపల్లి జలాశయం నిండిపోయింది. రోజుకు 90వేల క్యూసెక్కులకు పైగానే నీరు ఇన్‌ఫ్లో అవుతుండడంతో జలాశయం గేట్లు ఎత్తివేసి దిగువకు భారీగానే నీటిని విడుదల చేస్తున్నారు.

08/04/2016 - 23:58

వెల్గటూరు, ఆగస్టు 4: మండలంలోని ముంపు గ్రామమైన కోటిలింగాల గ్రామానికి వెళ్లే రహదారి మధ్యన వంతెన గోదావరి నీటిమట్టం పెరగడంతో మునిగిపోయింది. రాకపోకలు మొత్తంగా నిలిచిపోవడంతో గురువారం కలెక్టర్ నీతూప్రసాద్ మునిగిపోయిన వంతెనను సందర్శించారు. కోటిలింగాల ముంపు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయంగా రహదారి ఏర్పాటు చేయాలని ముంపు బాధితులు కలెక్టర్‌ను కోరారు.

08/04/2016 - 23:57

ముత్తారం, ఆగస్టు 4: తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశంలోనే భేష్ అని, ఇతర రాష్ట్రాలు తెలంగాణలోని పథకాలను ఆదర్శంగా తీసుకొని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, స్పీకర్ సిరికొండ మధుసుధన చారి పేర్కొన్నారు. బుధవారం ఓడేడ్ గ్రామం వద్ద మానేరు నదిపై హైలెవల్ బ్రిడ్జీ నిర్మాణం కోసం 47.40 కోట్ల నిధులు మంజూరు కాగా శంకుస్థాపన చేశారు.

08/04/2016 - 23:57

కరీంనగర్, ఆగస్టు 4: ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూములను 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో పార్టీ కరీంనగర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

08/04/2016 - 23:56

కరీంనగర్, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123 జిఓను హైకోర్టు రద్దు చేసినా ప్రభుత్వానికి జ్ఞానోదయం కలుగలేదని, ఈ విషయంలో తిరిగి అప్పీల్‌కు వెళ్తామనడం అవివేకమని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు.

08/04/2016 - 23:56

ముస్తాబాద్, ఆగస్టు 4: ముస్తాబాద్‌లో గత యేడు అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యవసాయరైతు అనమేని యాదగిరి బాధిత కుటుంబానికి ప్రభుత్వం 5లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసిందని గురువారం సర్పంచ్ నల్ల నర్సయ్య చెప్పారు. శుక్రవారం తహశీల్ కార్యాలయంలో మృతుడి భార్యకు 5లక్షల చెక్కు అందజేయనున్నట్లుగా తెలిపారు.

08/04/2016 - 23:55

కరీంనగర్ టౌన్, ఆగస్టు 4: హరితహారం కార్యక్రమంలో భాగంగా నగర సమీపంలోని దిగువ మానేరు జలాశయ కట్ట కింద శుక్రవారం మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బల్దియా కమిషనర్ కృష్ణ్భాస్కర్ తెలిపారు. దీనిపై గురువారం అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, ఈనెల 1న పురపాలక మంత్రి కెటిఆర్ చేసిన సూచన మేరకు చెట్లు నాటబోతున్నట్లు పేర్కొన్నారు.

08/04/2016 - 23:55

బెజ్జంకి, ఆగస్టు 4: ఎంసెట్ లీకేజీకి సంబంధించిన బ్రోకర్లపై చర్యలు తీసుకోవాలని, అందుకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలని కోరుతూ కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గురువారం బెజ్జంకి తహశీల్దార్ ఈశ్వరయ్యకు వినితిపత్రం ఇచ్చారు.

08/04/2016 - 23:54

లీగల్ (కరీంనగర్), ఆగస్టు 4: తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తులు పెట్టుకున్న ఆప్షన్లు వెంటనే తీసుకోవాలని ఇటీవల న్యాయవాదులు చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన న్యాయవాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల జెఎసి, రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపుమేరకు శుక్రవారం కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు అధ్యక్షులు గోపు మదుసూధన్ రెడ్డి, ఉపాధ్యక

08/04/2016 - 23:54

బెజ్జంకి, ఆగస్టు 4: మండలంలోని రేగులపల్లి గ్రామ శివారులో బండ సంపత్ అనే గొర్రెల కాపరి మందపై చిరుతపులి దాడి చేసి గొర్రెను చంపింది. ఇటీవల వరుసగా నాలుగు గొర్రెలపై దాడి చేసి చంపడం గొర్రెల కాపరులకు, రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుసార్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pages