S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 00:49

జోగిపేట, జూలై 22: జోగిపేట పట్టణంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్మించిన క్రీడా మైదాన భవనాన్ని శుక్రవారం నాడు అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ ప్రారంభించారు. మూడు కోట్ల రుపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాల నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ మైదానాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు.

07/23/2016 - 00:48

నర్సాపూర్,జులై 22: నర్సాపూర్ మండల ప్రజల అభిప్రాయం మేరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు 48గంటల బంద్‌కు పిలుపునిచ్చారు.

07/23/2016 - 00:48

గజ్వేల్, జూలై 22: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇక్కడి సర్కారు పక్క దారి పట్టిస్తోందని, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూ. 721 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసినా రైతులకు చెల్లించకపోవడంలో అంతర్యమేమిటని టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

07/23/2016 - 00:47

సంగారెడ్డి టౌన్, జూలై 22: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1254మంది అభ్యర్థులు హాజరైనారు. ఇందులో 733 మంది అర్హత సాధించారు.
వీరందరికీ శనివారం ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎఎస్పీ వెంకన్న, ఎఆర్ ఎఎస్పీ బాబురావు, డిఎస్పీలు తిరుపతన్న, వెంకట్‌రెడ్డి, సిఐలు పోటీలను పర్యవేక్షించారు.

07/23/2016 - 00:46

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన కూరగాయాలు’ పథకం విజయవంతం కావడంతో త్వరలోనే హైదరాబాద్‌లో 100 ఔట్‌లెట్‌లను ప్రారంభించబోతున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి, మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు మంత్రి వివరించారు.

07/23/2016 - 00:45

హైదరాబాద్, జూలై 22: పాలిమర్ పైపుల ఉత్పత్తి రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన స్కిప్పర్ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా హైదరాబాద్‌లో పాలిమర్ పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్ దేవేష్ బన్సల్ తెలిపారు.

07/23/2016 - 00:45

వనపర్తి, జూలై 22: వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలో విద్యుత్ లైనుకు అంతరాయం కలిగిస్తున్నారన్న నెపంతో ఏకంగా విద్యుత్ అధికారులు ఆ గ్రామానికే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, గ్రామస్తులు డిఇ ఇంటి ముందు బైఠాయించారు.

07/23/2016 - 00:44

అలంపూర్, జూలై 22: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.16,500కోట్ల మిగులు బడ్జెట్ మిగిలించిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో ఉందని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్‌లు అన్నారు. గద్వాల జిల్లా సాధనకై జములమ్మ నుంచి జోగుళాంబదేవి ఆలయం వరకు చేస్తున్న పాదయాత్ర 4వ రోజు శుక్రవారం అలంపూర్‌కు చేరుకుంది.

07/23/2016 - 07:27

న్యూఢిల్లీ, జూలై 22: పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్), ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ (టాన్)లను ఇక ఒక్కరోజులోనే సంస్థలు పొందవచ్చు. అవసరమున్న సంస్థలు డిజిటల్ సిగ్నేచర్ సర్ట్ఫికెట్ ఆధారిత దరఖాస్తును సమర్పిస్తే చాలు.. 24 గంటల్లోనే పాన్, టాన్ రిజిస్ట్రేషన్ అందుతుంది. వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భాగంగానే ఈ సంస్థాగత మార్పు అని ఆదాయ పన్ను శాఖ శుక్రవారం తెలిపింది.

07/23/2016 - 00:42

ముంబయి, జూలై 22: దేశీయంగా ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 21 శాతం క్షీణించి 1,555.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 1,978.44 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 13,852.1 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 12,234.41 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages