S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 00:30

నల్లగొండ, జూలై 22: ప్రశ్నించే మనస్తత్వమే విజ్ఞాన, వికాసాలకు మూలమని విద్యార్థులు ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతు దేశానికి ప్రశ్నించడం నేర్పింది నల్లగొండ జిల్లాయని, మొదటి నుండి ఈ జిల్లాకు అది సహజ గుణంగా ఉందన్నారు.

07/23/2016 - 00:29

దేశంలో సామాజిక అశాంతిని కలుగజేయడానికి అరాచకవాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. ఆ అవకాశం కోసం విచ్ఛిన్నకరవాదులు సిద్ధంగానే ఉంటారు. ఈ పెడధోరణులకు సమాజంలో స్థానం లేదని స్పష్ట పరచడంలో ప్రభుత్వం ముందుండాలి. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం, సోదరభావం ధ్యేయంగా రాజ్యాంగం రూపుదిద్దుకొంది. ఆ స్ఫూర్తిని కాపాడేందుకు అవసరమైన వ్యవస్థని స్వతంత్ర భారతం ఏర్పాటు చేసుకుంది.

07/23/2016 - 00:29

సూర్యాపేట, జూలై 22: పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ సీజన్‌లో గతంలో తేలికపాటి వర్షం కురియగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుండి 3.30గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

07/23/2016 - 00:28

భువనగిరి: తెలంగాణ రాష్ట్రాన్ని ఫూల, పండ్ల, సాంప్రదాయ చెట్లతో ఆకుపచ్చని సస్యశ్యామలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావ్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి, శిక్షణా శాఖా మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి తెలిపారు.

07/23/2016 - 00:27

వచ్చే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా అధికార, పాలక ప్రతిపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందులో కొత్తదనం ఏముందీ? ఏ పార్టీలైనా అధికారం కోసం వెంపర్లాడడం సహజమే కదా అని అనుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పాలక, ప్రతిపక్షాల మధ్య పోటా పోటీ నడుస్తోంది.

07/23/2016 - 00:25

భైంసా రూరల్, జూలై 22: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక గేటును ఎత్తివేసి 18వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతమైన మహారాష్టల్రో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుంది. ఉదయం గడ్డెన్నవాగు ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టును సందర్శించి ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో నీటిని వదిలారు.

07/23/2016 - 00:25

తాంసి, జూలై 22: తెలంగాణకు హరితహారంలో ప్రతి గ్రామానికి 40వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని, గ్రామస్తులు స్వచ్ఛందంగా మొక్కలు నాటడమే గాక వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న గ్రామస్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తాంసి మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం బండల్‌నాగపూర్ గ్రామంలో మంత్రి మొక్కలు నాటారు.

07/23/2016 - 00:25

అది ఇష్టంతో కావచ్చు, అయిష్టంతో కావచ్చు ప్రపంచ ప్రజల నాలుకపై అమెరికా నామస్మరణ నిత్యకృత్యం. ఆ దేశ విదేశాంగ విధానాల ఆధారంగా అమెరికా మీద ఎక్కువమంది దురభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. కాని ఎవరైనా అమెరికా పర్యటించి వచ్చిన తరువాత ఆ అభిప్రాయాన్ని చాలావరకు మార్చుకుంటారు. మన కమ్యూనిస్టు అగ్ర నాయకులు నారాయణ, రాఘవులు విషయంలో కూడా ఇది రుజువైంది.

07/23/2016 - 00:24

మామడ, జూలై 22: మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ముడిపడిఉందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలునాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కలు నాటినప్పుడే వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించబడుతుందన్నారు. దీంతో వర్షాలు సకాలంలో కురిసే అవకాశం ఉందన్నారు.

07/23/2016 - 00:23

మంచిర్యాల, జూలై 22: ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడమేకాక వాటి సంరక్షణర బాధ్యత చర్యలుకూడా తీసుకోవాలని మెప్మా అడిషనల్ డైరెక్టర్ వందన్‌కుమార్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని తూర్పు జిల్లా మున్సిపల్ కమిషనర్‌లు, ఇంజినీర్లు, అర్బన్ ఐకెపి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Pages