S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 00:23

వాణి, వీణ అవిభక్త కవలలు. నీలోఫర్ ఆసుపత్రిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. కవలల్ని విడదీసి వార్తల్లోకి ఎక్కిన గుంటూర్ డా.నాయుడమ్మ నుంచి ఆస్ట్రేలియా వైద్యుల దాకా స్పందించినా వారికింకా విముక్తి దొరకలేదు. వీరి దీన గాధను తెరకెక్కించాలని ఏ నిర్మాతకూ తట్టలేదు.

07/23/2016 - 00:22

ఆదిలాబాద్, జూలై 22: రాష్ట్ర షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఎస్సీల సంక్షేమానికి తీసు కుంటున్న చర్యలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా అధికారులతో కలిసి సమీక్షించనున్నట్లు కార్పొరేషన్ ఎడి జెమ్స్ కల్వాల తెలిపారు.

07/23/2016 - 00:21

కుంటాల, జూలై 22: మండల కేంద్రమైన కుంటాలలో గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో శుక్రవారం ఉదయం నుండి కుంటాల మండలానికి రాకపోకలు నిలిచిపోయి పంటలు నీట మునిగిపోయాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి 91.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎఎస్‌వో సాయన్న తెలిపారు. దీంతో ఉదయం నుండే మండలానికి రాకపోకలు నిలిచిపోవడంతోప్రయాణీకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

07/23/2016 - 00:20

కడెం, జూలై 22: మానవ మనుగడ కోసం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో ఎస్పీ మొక్కలను నాటారు.

07/23/2016 - 00:19

ఆదిలాబాద్, జూలై 22: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు గ్రామాల్లో వ్యాధులు విజృంభిస్తున్నా యి. నాలుగైదు రోజులుగా జిల్లాలోని ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, బీమిని, జన్నారం, నార్నూర్, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో విషజ్వరాల బారిన పడి వందలాది మంది గిరిజనులు ప్రతిరోజు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

07/23/2016 - 00:19

పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పీఓకే-లో చైనా దళాలు తిష్ఠవేసి ఉండడం పాతబడిన సమాచారం. చైనా, పాకిస్తాన్ దళాలు ఉమ్మడిగా ‘సరిహద్దు’ వెంబడి గస్తీ తిరుగుతుండడం సరికొత్త వ్యూహంలో భాగం. లడక్‌లో మన భద్రతా వ్యవస్థ పటిష్ఠమవుతున్న నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తలపెట్టిన సరికొత్త కవ్వింపు చర్య ఇది. చైనాకు, పాకిస్తాన్‌కు మధ్య సహజమైన సరిహద్దు లేదు.

07/23/2016 - 00:17

కెరమెరి, జూలై 22: కెరమెరి మండలంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షం కారణంగా మండల కేంద్రంలోని రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి.

07/23/2016 - 00:16

కడెం, జూలై 22: జిల్లాలోని ఐదు మండలాలకు సాగు నీరందించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు జలాశయంలోకి గత రెండు రోజులుగా వరద నీరు వచ్చి చేరడంతో శుక్రవారం సాయంత్రానికి దిగువన గోదావరిలోకి ప్రాజెక్ట్ రెండుగేట్లను ఎత్తి 21వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల మూలంగా ఇన్‌ఫ్లో పెరగడంతో ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం పెరుగుతూ వస్తుంది.

07/23/2016 - 00:15

ఆదిలాబాద్, జూలై 22: ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా సాగుతున్న హరితహారం కార్యక్రమం అమలుపై వ్యవసాయ శాఖ అధికారుల్లో చిత్తశుద్ధి లోపించిందని, ఇప్పటికీ పంట చేను గట్లలో మొక్కలు నాటకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమేనని రాష్ట్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశా రు.

07/23/2016 - 00:12

ఆదిలాబాద్, జూలై 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా గురువారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం పశ్చిమ జిల్లాలోని తలమడుగు, తాంసి, జైనథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, భైంసా, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో 4 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా గుడిహత్నూర్, ఇచ్చోడలో సాధారణం మించి వర్షాలు కురిశాయి.

Pages