S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 00:11

ఆదిలాబాద్, జూలై 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా గురువారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం పశ్చిమ జిల్లాలోని తలమడుగు, తాంసి, జైనథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, భైంసా, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో 4 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా గుడిహత్నూర్, ఇచ్చోడలో సాధారణం మించి వర్షాలు కురిశాయి.

07/23/2016 - 00:09

కాకినాడ, జూలై 21: జిల్లాలో జరుగుతున్న స్మార్ట్ పల్స్ సర్వేలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు తప్పడం లేదని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో ఎదురవుతున్న సర్వర్ సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.

07/23/2016 - 00:08

రాజమహేంద్రవరం, జూలై 21: గోదావరి అంత్య పుష్కరాలను పురస్కరించుకుని ఏలూరు రేంజి డిఐజి రామకృష్ణ గురువారం మధ్యాహ్నం కోటిలింగాలరేవు నుంచి ధవళేశ్వరంలోని రామపాదాలరేవు వరకు ఉన్న ప్రధాన ఘాట్లను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ బి రాజకుమారిని ఆరా తీశారు. కోటగుమ్మం, ఇతర అనుసంధాన ప్రాంతాలను ఆయన పరిశీలించి, పలు సూచనలు చేశారు.

07/23/2016 - 00:07

రాజమహేంద్రవరం, జూలై 21: గోదావరి నది అంత్య పుష్కరాల ముహూర్తం తరుముకొస్తోంది. జూలై 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు గోదావరి నదికి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. అధికారులు అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్తున్నారే తప్ప ఇంకా ఏర్పాట్లు కానరావడం లేదు. ఇటీవల వచ్చిన గోదావరి వరద వల్ల రేవుల పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకుపోయ దుర్గంధభరితంగా మారాయి.

07/23/2016 - 00:06

రామచంద్రపురం/ మండపేట, జూలై 21: ఆగస్టు నెలలో తెల్లకార్డు వినియోగదారులు ఆగస్టు నెలలో రేషన్ సరుకులను తీసుకోకపోతే ఆ రేషన్ కార్డులు మనుగడలో ఉండవని జిల్లా పౌర సరఫరాల అధికారి జి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జిల్లాలో 14 లక్షల 40 వేల తెల్ల రేషన్ కార్డులుండగా వాటిలో సక్రమ రీతిలో 13 లక్షల 30 వేల మంది మాత్రమే రేషన్ సరుకులు తీసుకుంటున్నారన్నారు.

07/23/2016 - 00:05

అమలాపురం, జూలై 21: కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను ఏడేళ్లలో పూర్తిచేసే విధంగా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసిందని కోనసీమ రైల్వే లైను నిర్మాణ చీఫ్ ఇంజనీర్ బలిజ అశోక్ వెల్లడించారు. గురువారం కోనసీమ జెఎసి ఆధ్వర్యంలో స్థానిక కాటన్ గెస్టు హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/23/2016 - 00:04

పెద్దాపురం, జూలై 21: పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని స్వయంభువు శ్రీ శృంగార వల్లభస్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఇంత వరకు అభివృద్ధికి నోచుకోక, జీర్ణదశకు చేరిన ఆలయాన్ని టిటిడి దత్తత తీసుకుని అభివృద్ధికి చర్యలు చేపడుతుంది.

07/23/2016 - 00:03

రాజానగరం, జూలై 21: రాజానగరం మండలంలోని కొండగుంటూరు, హౌసింగ్ బోర్డు కాలనీలో రెండు సబ్ స్టేషన్లు మంజూరుకానున్నాయని రాజమహేంద్రవరం ఇపిడిసిఎల్ ఎస్‌ఇ వై ప్రసాద్ తెలిపారు. రాజానగరం మండలంలోని కానవరం గ్రామంలో రెండుకోట్ల 24 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన స్విచాన్ చేసి ప్రారంభించారు.

07/23/2016 - 00:02

రాజమహేంద్రవరం, జూలై 21: గోదావరి అంత్య పుష్కరాల నిర్వహణపై ఈ నెల 30న ట్రయల్ నిర్వహిస్తామని కమిషనర్ వి విజయరామరాజు వెల్లడించారు. 29వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 31న ఉదయం గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభమవుతాయన్నారు. గురువారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అంత్య పుష్కరాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

07/23/2016 - 00:02

చింతూరు, జూలై 21: మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేస్తున్న ఏడుగురు గురువారం జిల్లాలో పోలీసులకు లొంగిపోయారు. ఎటపాక పోలీసు స్టేషన్లో ఒఎస్‌డి ఫకీరప్ప, ఎఎస్పీ శే్వత ఎదుత వీరు లొంగిపోయారు. వీరంతా చింతూరు మండలం లంకపల్లి గ్రామానికి చెందినవారు.

Pages