S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 18:00

చెన్నై: చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్‌ రాజధాని పోర్టుబ్లెయిర్‌ వెళ్తూ శుక్రవారం గల్లంతైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం కోసం గాలింపు చర్యల్లో 13 యుద్ధనౌకలు, 5 యుద్ధ విమానాలు, ఓ జలాంతర్గామి పాల్గొంటున్నాయి. గల్లంతైన విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు. విమానం కూలిపోయిందా? లేదా దారి మళ్లిందా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

07/22/2016 - 17:48

కాబుల్‌: కుందుజ్‌ ప్రావిన్స్‌లో తాలిబన్‌ తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య జరిగిన అల్లర్లలో 18 మంది తిరుగుబాటు దారులు, నలుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఖాలా-ఇ-జల్‌ జిల్లాలో తిరుగుబాటుదారులపై భద్రతా బలగాలు దాడి చేశాయి.

07/22/2016 - 17:41

హైదరాబాద్: ప్రభుత్వ నిధులను చేజిక్కించుకునేందుకే తెరాస ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే మంత్రి హరీష్‌రావు మళ్లీ ప్రారంభిస్తున్నారన్నారు. కొత్త ప్రాజెక్టుల పేరిట నిధులు ఖర్చు చేసే బదులు పెండింగ్‌లో ఉన్నవాటిని పూర్తి చేస్తే పొలాలకు పుష్కలంగా నీరు అందుతుందన్నారు.

07/22/2016 - 17:40

హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ప్రత్యేకించి ప్రజాప్రతినిధులు ఈ విషయంలో కష్టపడి పనిచేయాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఆయన శుక్రవారం నాడు హరితహారంపై సమీక్ష జరిపారు. హరితహారంపై సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. మంత్రుల పనితీరుపైనా తన వద్ద నివేదికలున్నాయన్నారు.

07/22/2016 - 17:39

లక్నో: తనను, తన కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నారని బిఎస్‌పి అధినేత్రి మాయావతిపైన, ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలపైన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తన భర్త దయాశంకర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, అయినప్పటికీ తనను, తన 12 ఏళ్ల కుమార్తెను బిఎస్పీ కార్యకర్తలు వేధిస్తున్నారని స్వాతి ఆరోపించారు.

07/22/2016 - 17:39

దిల్లీ: పార్లమెంటు వద్ద భద్రతావ్యవస్థను ఎలా ఛేదించాలో సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక వెబ్‌సైట్లలో పోస్టు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ చివరకు క్షమాపణలు చెప్పారు. తక్షణం తన ముందు హాజరుకావాలంటూ ఆయనకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమన్లు జారీ చేశారు. దీంతో భగవంత్ మాన్ శుక్రవారం ఉదయం స్పీకర్‌ను కలిశారు.

07/22/2016 - 17:39

ఇస్లామాబాద్: కుటుంబం పరువు తీసిందన్న ఆగ్రహంతో తన కుమార్తె కందీల్ బలోచ్‌ను హతమార్చిన తన కుమారుడు వసీంను కాల్చి చంపేయాలంటూ బలోచ్ తండ్రి అన్వర్ అజీం పేర్కొనడం ఇపుడు పాకిస్తాన్‌లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియా సెలబ్రిటీగా, మోడల్‌గా రాణిస్తున్న బలోచ్ తమ కుటుంబం పరువు తీసిందని ఆమెను సోదరుడు వసీం గొంతు నులిమి ఇటీవల హత్య చేసిన సంగతి తెలిసిందే. పాక్‌లో ఇటువంటి పరువు హత్యలు సర్వసాధారణమే.

07/22/2016 - 17:38

విజయవాడ: కృష్ణానది పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఎపి సిఎం చంద్రబాబు మరోసారి హెచ్చరించారు. నిన్న పుష్కర ఘాట్లను తనిఖీ చేసిన ఆయన ఈరోజు అధికారులతో సమీక్ష జరిపారు. సీతానగరం వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తీరు మార్చుకోవాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు. ఘాట్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాలు జరగాలన్నారు.

07/22/2016 - 17:38

దిల్లీ: రాష్ట్ర విభజన ఫలితంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఆరోపించారు. ఎపి విషయంలో బిజెపికి చిత్తశుద్ధి లేదన్నారు. తమ పార్టీ ఎంపీ కెవిపి ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు అన్ని ప్రాంతీయపార్టీలు మద్దతు ఇవ్వగా బిజెపి మాత్రం వౌనం వహించడం దారుణమన్నారు.

07/22/2016 - 17:26

విశాఖ: ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఛత్తీస్‌గడ్, విదర్భ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తా, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తామని వాతావరణశాఖ తెలిపింది.

Pages