S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 18:11

విజయవాడ: పట్టిసీమ సాగునీటి ప్రాజెక్టులో పంపులను బుధవారం నాడు ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించేందుకు టిడిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

07/05/2016 - 18:10

విశాఖ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ నెల 7న నగరానికి వస్తున్నారు. ఆ రోజు జరిగే నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో దిగ్విజయ్‌తో పాటు ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటారు.

07/05/2016 - 18:10

విజయవాడ: నగలకు మెరుగు పెడతామని నమ్మించి సుమారు లక్ష రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ఆగంతకులు దోచుకుపోయిన సంఘటన ఇక్కడి ప్రసాదం పాడులో మంగళవారం జరిగింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఇక చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.

07/05/2016 - 18:09

హైదరాబాద్: బ్యాంకులు, విత్తనాల కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినడం లేదని నిస్సహాయత ప్రకటిస్తున్న తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తక్షణం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రైతులు సమస్యలతో సతమతమవుతున్నా కెసిఆర్ సర్కారు ఎలాంటి సహాయం చేయడం లేదన్నారు.

07/05/2016 - 18:09

హైదరాబాద్: 11 మంది జడ్జీలపై సస్పెన్షన్లను ఎత్తివేస్తే తాము విధులకు హాజరవుతామని తెలంగాణ న్యాయాధికారులు మంగళవారం తెలిపారు. ఇక్కడ మంగళవారం జరిగిన తెలంగాణ న్యాయాధికారుల సంఘం సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్లను తక్షణం ఎత్తివేయాలని సంఘం నాయకులు ఉమ్మడి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేరిస్తే సుప్రీం కోర్టు, హైకోర్టు చేసిన సూచనలను పాటిస్తామని కూడా వారు ప్రకటించారు.

07/05/2016 - 18:08

కాకినాడ: రాజానగరం మండలం బొల్లకడియం వద్ద మంగళవారం ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 14 మంది జూదరులను అరెస్టు చేశారు. వీరి నుంచి 5.5 లక్షల రూపాయల నగదు, 5 బైకులు, 13 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

07/05/2016 - 18:08

ఏలూరు: తణుకు సమీపాన సజ్జాపురం వద్ద గోస్తని నదిలో తల్లీకూతుళ్ల మృతదేహాలను మంగళవారం స్థానికులు కనుగొన్నారు. మృతులను లక్ష్మీనరసమ్మ (32), ఆమె కుమార్తె లాస్య (7)గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఆదివారం నుంచి కనిపించడం లేదు. కుటుంబ కలహాల వల్లే కుమార్తెతో పాటు కాల్వలోకి దూకి తల్లి నరసమ్మ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

07/05/2016 - 18:08

ముంబయి: ‘కండల వీరుడు’, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ‘హిట్ అండ్ రన్’ కేసు ఇంకా వదలడం లేదు. ఆ కేసులో నిర్దోషిగా విడుదలైన సల్మాన్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిని విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం మంగళవారం తెలిపింది.

07/05/2016 - 18:07

కర్నూలు: అవినీతి, అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తిన వైకాపా అధినేత వైఎస్ జగన్ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. జగన్ వైఖరి నచ్చకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్నారు. ‘గడప గడపకూ వైకాపా’ కార్యక్రమానికి బదులు గడప గడపకూ వెళ్లి జగన్ క్షమాపణలు చెప్పుకోవాలన్నారు.

07/05/2016 - 18:07

ఆదిలాబాద్: హైదరాబాద్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన ఐసిసి సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తామని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొనడాన్ని నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు నిర్మల్‌లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఓవైసీ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు.

Pages