S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 23:25

సిద్దిపేట టౌన్, జూలై 3: ప్రతిపక్ష రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, ఆందోళనలతో జిల్లా వస్తాయనుకోవడం భ్రమఅని టిఆర్‌ఎస్ నేతలు అన్నారు. టిఆర్‌ఎస్‌వి జిల్లా ఉపాధ్యక్షుడు గుండురవితేజ, నేతలు తూముల శ్రీనివాస్, ముదిగొండ శ్రీనివాస్ లు మాట్లాడుతూ కొత్తజిల్లాలు పరిపాలన సౌలభ్యం కోసమే ఏర్పాటు అవుతాయని, కొంతమందిని ప్రలోభపెట్టి ఆందోళనలు చేయిస్తే కొత్తజిల్లా కేంద్రాలు ఏర్పడవన్నారు.

07/03/2016 - 23:25

దౌల్తాబాద్, జూలై 3: మల్లన్నసాగర్ పేరిట నిర్మించనున్న ప్రాజెక్ట్ డిటిఅర్ (డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారుచేయకుండానే భూ సేకరణ చేయడం చట్ట విరుద్దమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిది రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం దౌల్తాబాద్‌లో జరిగిన మండల కార్యవర్గ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

07/03/2016 - 23:24

తొగుట, జూలై 3: మండంలోని ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామంలో ఈ నెల4న ఉదయం 11గంటలకు సిపిఎం పాదయాత్ర ముగింపు సమావేశం నిర్వహించడం జరుగుతుందని మల్లన్నసాగర్ జెఏసి కన్వినర్ భాస్కర్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రోఫెసర్ హరగోపాల్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్‌లు హాజరవుతున్నారని, భూనిర్వాసిత గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

07/03/2016 - 23:24

మెదక్ రూరల్, జూలై 3: తారురోడ్లపై దమ్ము చక్రాలు తిరగడం ఆగడం లేదు. గత సంవత్సరం రహదారుల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రోడ్లపై దమ్ము చక్రాలు తిరిగితే పోలీసు కేసులుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆదేశాలను సంబంధిత శాఖల అధికారులు ఖచ్చితంగా అమలుచేయక, ఉదాసీనంగా వ్యవహరించడంతో యధేచ్చగా వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు దమ్ము చక్రాలు తిప్పుతున్నారు.

07/03/2016 - 22:33

మాగనూర్, జూలై 3: ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆగదని, ప్రాజెక్టును పూర్తి చేసి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రజలు బంగారు తెలంగాణలో భాగస్వామ్యమై అభివృద్ధ్దికి నాందిగా నిలవాలని కోరారు.

07/03/2016 - 22:32

గద్వాల, జులై 3: వినతులు, ధర్నాలతో మొదలైన గద్వాల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు పెరుగుతూ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దవౌతుంది. ఈ నెల 1న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసొచ్చే విధంగా దాదాపు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ధర్నాను నిర్వహించి వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు.

07/03/2016 - 22:31

షాద్‌నగర్, జూలై 3: బంగారు తెలంగాణగా మార్చుతామని చెబుతున్న కెసిఆర్ ప్రభుత్వం..ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బాధల తెలంగాణగా మార్చుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి గ్రామ సమీపంలోని భాస్కర గార్డెన్‌లో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

07/03/2016 - 22:30

మహబూబ్‌నగర్, జూలై 3: గతపది రోజుల నుండి జిల్లాను మేఘాలు దండిగా కమ్ముకున్నప్పటికినీ వరుణుడు మాత్రం కనికరించడంలేదు. వానలు ఊరిస్తుడడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో కుండపోత వర్షం కురిసి నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తుంటే మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

07/03/2016 - 22:28

మక్తల్, జూలై 3: మక్తల్ మండల పరిధిలోని పంచదేవ్‌పాడ్‌వద్ద పుష్కరఘాట్ల పనులను రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, డాక్టర్ లక్ష్మారెడ్డిలు పరిశీలించారు. ఆదివారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రామాల్లో పాల్గొన్న మంత్రులు పుష్కరఘాట్లను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 12 నుండి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు.

07/03/2016 - 22:28

మహబూబ్‌నగర్, జూలై 3: జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలింది. ఓ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా మరోపార్టీ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల నాయకుల మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమనే స్థాయికి రాజకీయ రగడ ప్రారంభమయింది.

Pages