S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 00:54

కడప, జూన్ 17: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టార్గెట్‌కు మంచి వ్యవసాయానికి అధికరుణాలు, ముద్రరుణాలు ఇచ్చామని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చైర్మన్ డి.సంపత్‌కుమారాచారి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఏపిజిబి ప్రధానకార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015-16 మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి, ము ద్రరుణాలకు పెద్దపీట వేశామన్నారు.

06/18/2016 - 00:53

కడప, జూన్ 17:జిల్లాలో వ్యవసాయాన్ని మరింతగా విస్తత్ర పరిచి లాభసాటిగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్త కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో వివిధ శాఖల అధికారులకు వర్క్‌షాప్, ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని నిర్వహించారు.

06/18/2016 - 00:52

రాయచోటి, జూన్ 17:వర్షాకాలం ప్రారంభమైనందున జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం ఆయన స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేఖరులతో మాట్లాడారు.

06/18/2016 - 00:52

వేంపల్లె, జూన్ 17: సీమ నేతలు ఎందరు ఏలినా సీమ ప్రత్యేకతను గుర్తించలేదని, కనీసం ఇకనైనా ప్రత్యేక రాయలసీమను సాధించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రాయలసీమ పరిరక్షణా సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉద్వేగంతో అన్నారు. శుక్రవారం రాయలసీమ చైతన్యయాత్ర కార్యక్రమంలో భాగంగా వేంపల్లె నాలుగురోడ్ల కూడలిలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

06/18/2016 - 00:51

రాయచోటి, జూన్ 17: బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను జూలై 15లోగా రెన్యువల్ చేసుకోవాలని కలెక్టర్ కార్యాలయ ప్రత్యేకాధికారి మరియు ఎల్‌డీఎం రఘునాథరెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం స్థానిక మెప్మా కార్యాలయంలో జేఎం ఎల్‌బీసీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎల్‌డీ ఎం రఘునాథరెడ్డి, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్, మెప్మా పీడీ, డీఆర్‌డీఏ పీడీలు హాజరయ్యారు.

06/18/2016 - 00:51

కడప(కల్చరల్), జూన్ 17:నిత్యావసర ధరలను అదుపుచేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ నగర అధ్యక్షుడు బండి జక్యరయ్య పేర్కొన్నారు. స్థానిక ఇందిరా భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ పక్క నిత్యావసర ధరలు పెరుగుతుంటే , మరో పక్క కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు.

06/18/2016 - 00:50

రాయచోటి, జూన్ 17:ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో డీఈఓ ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

06/18/2016 - 00:50

రైల్వేకోడూరు, జూన్ 17:మండలంలోని ఉప్పరపల్లె సమీపంలో శుక్రవారం గ్రామానికి చెందిన శివయ్య (35) రైలు క్రింద పడి మృతి చెందాడు. అయితే గ్రామం నుంచి పొలానికి కెళుతూ లైన్ దాటుతుండగా రైలు ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా, ఆత్మహత్యా, హత్యా అనేది పోస్టుమార్టమ్‌లో వెల్లడవుతుందని రైల్వే పోలీసులు పేర్కొన్నారు.

06/18/2016 - 00:49

పుల్లంపేట, జూన్ 17:ఆ గ్రామంటే నిన్నటి వరకు నాటుసారా కాపుకు ప్రసిద్ధి. ఏ ఇల్లు చూసినా నారా కాపు కాయడమే జరిగేది. అటువంటి గ్రామంలో సారాపై పూర్తిస్థాయి పరివర్తన వచ్చింది.

06/18/2016 - 00:46

అనంతపురం, జూన్ 17 : వరుస కరవులతో ఏటా వేరుశెనగ పంట నష్టపోతున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే వేరుశెనగ పంట విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. దీనిద్వారా రైతులు విత్తిన తేదీలతో సాగు విస్తీర్ణం వివరాలు పొందు పరుస్తారు.

Pages