S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 00:15

ముత్తారం, జూన్ 17: హలో... నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అకౌంట్ సెక్యూరిటీలో లోపం ఉంది. కాస్త ఎటిఎం నెంబర్, పాస్‌వర్డ్ చెప్పండి. సరి చేస్తానంటూ... ఓ మహిళా హోంగార్డుకు ఫోన్ చేసిన ఓ వైట్ కాలర్ నేరగాడు క్షణాల్లోనే తన ఖాతాను నుంచి 15వేల రూపాయలను ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా డ్రా చేసిన సంఘటన ముత్తారం మండలంలో చోటు చేసుకుంది.

06/18/2016 - 00:14

పెద్దపల్లి, జూన్ 17: హైదరాబాద్ వెళ్తున్న సుజల ద్వారా పైపులైనును సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ధ్వంసం చేసి ప్రజల ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు తెలిపారు. తాను సాహసం చేయడం వల్లే ప్రభుత్వం దిగివచ్చి పెద్దపల్లికి గోదావరి జలాలను అందిస్తోందన్నారు.

06/18/2016 - 00:10

వరంగల్, జూన్ 17: గ్రేటర్ వరంగల్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేటర్లు, నగర ప్రజలు, అధికారులు సహకరించాలని మహానగరపాలక సంస్థ మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. పాలక మండలి ఏర్పడిన 92 రోజుల్లోనే ఆ దిశగా అడుగులు వేసామని అన్నారు. గ్రేటర్ వరంగల్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే అవకాశం మనందరికీ లభించడం గొప్ప గౌరవంగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు భావించాలన్నారు.

06/18/2016 - 00:09

నరుూంనగర్, జూన్ 17: కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అని, తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీదే అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ అజ్మత్ ఉల్లా హుస్సేన్ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షతన జరిగింది.

06/18/2016 - 00:08

పర్వతగిరి, జూన్ 17: బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా వచ్చే రుణాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. శుక్రవారం పర్వతగిరి మండలకేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని, మళ్లీ వాటిని సకాలంలో చెల్లించాలని సూచించారు.

06/18/2016 - 00:07

రఘునాథపల్లి, జూన్ 17: మిషన్ కాకతీయతో పల్లెల్లో జలకళ పెరిగి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ శాసనసభ్యులు డా. తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కన్నాయపల్లి గ్రామంలో గల చౌటకుంటలో రూ.30లక్షల వ్యయంతో చేపట్టే మిషన్ కాకతీయ రెండవ దశ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

06/18/2016 - 00:07

ఏటూరునాగారం, జూన్ 17: ఏజన్సీ ప్రాంతాలలోని చేపల చెరువులను గుర్తించి చేపల పెంపకానికి సొసైటీలను ఏర్పాటుచేసి, ఆదివాసీలు చేపలను పెంచేవిధంగా మహిళా సంఘాలు కృషిచేయాలని ఐటిడిఎ పిఒ అమొయ్‌కుమార్ ఆదేశించారు.

06/18/2016 - 00:06

కల్చరల్ (వరంగల్), జూన్ 17: ఘనపూర్ మండలం చిలుపూర్‌గుట్ట గ్రామంలో శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రాతఃకాలార్చన నిర్వహించి, భూదేవి శ్రీదేవి సమేత శ్రీ బుగులు వేంకటేశ్వరుని కల్యాణాన్ని కడురమణీయంగా చేసారు. ఈకళ్యాణోత్సవాన్ని ఐనవోలు వంశం వారు కన్యాదాతలుగా వ్యవహరించారు.

06/18/2016 - 00:05

కేసముద్రం, జూన్ 17: హరితహారం పథకంలో నాటాల్సిన మొక్కలు మండుతున్న ఎండలకు మాడిపోతున్నాయి. కేసముద్రం మండలం దన్నసరి శివారు సబ్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నర్సరీలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలు ఎండలకు మాడిపోతున్నాయి. దీనితో హారితహారం పథకంలో నాటే మొక్కల సంఖ్య తగ్గిపోతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

06/18/2016 - 00:03

చిట్యాల, జూన్ 17: మిత్రుడి వద్ద తీసుకున్న అప్పును తీర్చేందుకు ఎలాంటి మార్గం లేకపోవడంతో ఇద్దరు మిత్రులు దొంగతనాన్ని ఎంచుకుని వాహనాల తనిఖీలో పట్టుబడ్డారని చౌటుప్పల్ రూరల్ సిఐ కె. శివరాంరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఎస్‌ఐలు శివకుమార్, దేవేందర్‌రెడ్డిలతో కలిసి నిందితులను విలేఖరుల ఎదుట ప్రదర్శించి మాట్లాడారు.

Pages