S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2016 - 04:14

గుంటూరు, మే 28: ముద్రగడ పద్మనాభం శనివారం హైదరాబాద్‌లో చిరంజీవి, దాసరిని కలవడంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ కావాలంటే మంజునాథ కమిషన్ ముందు వాదనలు వినిపించాలే తప్ప ఇలా చిరంజీవి, దాసరిని కలిసి ఉపయోగం లేదన్నారు. శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ మేరకు మంత్రి నారాయణ స్పందించారు.

05/29/2016 - 04:12

తిరుమల, మే 28: టిటిడి పాలక మండలి సభ్యుడిగా అరికెల నరసారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డిని బోర్డు సభ్యులుగా నియమిస్తూ శనివారం రాత్రి నియామక పత్రాలు విడుదల చేశారు.

05/29/2016 - 04:12

అనంతపురం సిటీ, మే 28 : ఆంధ్రప్రదేశ్ లా సెట్-2016 యుజి, పిజి ప్రవేశ పరీక్షలకు 12,368 మంది హాజరైనట్లు లా-సెట్ రాష్ట్ర కన్వీనర్ పుల్లారెడ్డి తెలిపారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయలు యూనివర్శిటీ ఆవరణలో ఉన్న లాసెట్ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లా సెట్-2016 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

05/29/2016 - 04:11

మామిడికుదురు, మే 28: కంటికిరెప్పలా కాపాడవలసిన తండ్రే కూతుర్ని లైంగిక కాటువేసాడు.తండ్రి ఒడిగట్టిన అఘాయిత్యాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన గెడ్డం ప్రసాదరావు భార్య గల్ఫ్‌లో ఉంటోంది. తాగుడికి బానిసైన ప్రసాదరావు కన్న కూతురుపై అత్యాచారం చేశాడు.

05/29/2016 - 04:10

విశాఖపట్నం, మే 28: కోస్తాంధ్రలో శనివారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. కొన్ని చోట్ల వర్షపాతం నమోదు అయినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఆదివారం కూడా చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపారు. బాపట్లలో 41 డిగ్రీలు, నెల్లూరు 41.3, మచిలీపట్నంలో 33.6, తునిలో 32.6, కళింగపట్నంలో 36.6, గన్నవరంలో 37.6 డిగ్రీలు నమోదైంది.

05/29/2016 - 04:09

నెల్లూరు/ఒంగోలు, మే 28: నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో శనివారం ఉదయం కొద్దిసెకెన్లపాటు భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, వరికుంటపాడు, కలిగిరి, వింజమూరు, ఎఎస్‌పేట, చేజర్ల, సంగం మండలాల్లో, ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు, లింగ సముద్రం మండలాల్లో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో భూ ప్రకంపనలకు గోడలు బీటలు వారాయి.

05/29/2016 - 04:03

తిరుపతి, మే 28: దివంగత ఎన్ టి ఆర్ తెలుగు జాతిలో పుట్టడం గర్వకారణమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తిరుపతిలో నెహ్రూమున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు రెండోరోజు సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కర్రపెత్తనంతో విచ్చలవిడిగా వ్యవరిస్తున్న కాంగ్రెస్ దురహంకారానికి అడ్డుకట్ట వేయడానికే ఎన్ టి ఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారన్నారు.

05/29/2016 - 04:00

తిరుపతి, మే 28: మహానాడు నందమూరి వారసుల మధ్య విభేదాలకు వేదికగా మారింది. ప్రత్యేకహోదా, మహానాడుపై ఎన్టీఆర్ పుత్రరత్నాల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు పార్టీ వర్గాలలో చర్చనీయాంశమయ్యాయి. మహానాడు... కార్యకర్తల పండుగ. కుటుంబ వాతావరణంలో, ఇది తమ పార్టీ అని భావించి నిర్వహించుకునే సంబరం.

05/29/2016 - 03:54

హైదరాబాద్, మే 28: రోహిణీ కార్తెలో నిజంగానే రోళ్ల్లు పగిలేలా ఎండలు మండుతున్నాయి. ఎండాకాలం ముగిసే సమయంలో రోహిణీ కార్తె వస్తుంది. ఈ పర్యాయం ఇది మే 25 నుండి జూన్ 8 వరకు ఉంటుంది. గత నాలుగు రోజుల నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గత నాలుగు నెలల్లో లేని విధంగా బాగా పెరిగాయి.

05/29/2016 - 03:54

హైదరాబాద్, మే 28: సంస్కారాన్ని పెంపొందించేది సాహిత్యం అని బిహార్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం రవీంద్ర భారతిలో ఉర్దూ రచయిత్రి జిలానీ బానోకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆయన అందజేశారు.

Pages